You Are Here: Home » భవిత » విద్య » ‘కరస్పాండెన్స్‌’ ప్రయోజనాలెన్నో…

‘కరస్పాండెన్స్‌’ ప్రయోజనాలెన్నో…

‘కరస్పాండెన్స్‌’ ప్రయోజనాలెన్నో…

చదువుకోవాలని వుంటుంది. కానీ రెగ్యులర్‌గా కాలేజీకి వెళ్లలేని పరిస్థితి కొందరిది. బతుకు దెరువుకోసం ఉద్యోగం చేయాలి. కుటుంబాన్ని పోషించుకోవాలి. ఇలాంటప్పుడు డిగ్రీలు చదవాలన్న ఆశ నెరవేరేదెలా? అన్న సందేహానికి చక్కటి సమాధానం కరస్పాండెన్స్‌ కోర్సులు. రెగ్యులర్‌ కోర్సులు చేసే అవకాశం, పరిస్థితి లేని వారికి ఇవెంతో ఊరటనిస్తున్నాయి. అవకాశాలవైపు నడిపిస్తున్నాయి.

కరస్పాండెన్స్‌ కోర్సులంటే… ఏదో తక్కువచేసి చూడాల్సిన అవసరం లేదు. రెగ్యులర్‌ కోర్సులకు ఎంత విలువుందో వీటికీ అంతే వుంది. ఓ విధంగా ఆర్థిక ఇబ్బందులవల్లో, ఇతర కారణాలనో రెగ్యులర్‌ డిగ్రీలు చేసేందుకు ఇబ్బంది పడేవారు తమ విద్యార్హతలను పెంచుకోవడానికి ఈ కోర్సులు చక్కటి సౌలభ్యంగా ఉంటున్నాయి. వీటిలో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులేగాక పోస్టుగ్రాడ్యుయేట్‌ కోర్సులూ చేయవచ్చు. అండర్‌గ్రాడ్యుయేట్‌ కోర్సలనే బ్యాచిలర్‌ డిగ్రీలుగా కూడా పిలుస్తారు. అన్ని సబ్జెక్టుల్లోనూ ఈ కరస్పాండెన్స్‌ కోర్సులు చేయడానికి వీలుంది. అండర్‌గాడ్య్రుయేట్‌ కోర్సులు చేయడంవల్ల ఆయా సబ్జెక్టులపై ప్రాథమిక పరిజ్ఞానం ఏర్పడుతుంది. అదే పోస్టుగ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో అయితే సబ్జెక్టులపై లోతైన అవగాహన ఏర్పడుతుంది. ఏ సబ్జెక్టులోనైనా సరే ఇంటర్మీడియెట్‌ లేదా తత్సమానమైన కోర్సు పూర్తి చేసిన వారు అండర్‌గ్రాడ్యుయేట్‌ కోర్సులు చేయవచ్చు.

విద్యార్హతలు లేకున్నా

ముఖ్యమైన యూనివర్సిటీలో ఆయా కోర్సుల్లో ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఓపెన్‌ యూనివర్శిటీలైతే కనీస వయస్సు ఉంటే చాలు, ఎలాంటి విద్యార్హతలు లేకున్నా అండర్‌గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నాయి. అయితే ఇందుకోసం ఆయా ఓపెన్‌ యూనివర్శిటీలు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఎలాంటి విద్యార్హత లేకపోయినా 18 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు ఈ ప్రవేశ పరీక్షకు హాజరు కావచ్చు. కొన్ని యూనివర్శిటీలు అయితే కరస్పాండెన్స్‌ కోర్సుల్లో ఎం.ఫిల్‌. పిహెచ్‌.డి వంటి పరిశోధనా కోర్సులను కూడా నిర్వహిస్తున్నాయ. అలాగే డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులను కూడా నిర్వహిస్తున్నాయి. రెగ్యులర్‌ కోర్సులు చేయలేని వారెందరికో కరస్పాండెన్స్‌ విద్య ఎంతో మేలు చేస్తోంది. తమకాళ్లపై తాము నిలబడుతూ విద్యార్హతలు సంపాదించుకునే అవకాశం ఉండటంవల్ల చాలామంది దీనివైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా దేశ విద్యావిధానంలో అధ్భుతమైన మార్పులు చోటు చేసుకున్నాయి. వచ్చే రెండు దశాబ్దాల్లో విద్యా విధానంలో విప్లవత్మాక మార్పులు చోటు చేసుకుంటాయని నిపుణుల అంచనా. ఉపగ్రహ కమ్యూనికేషన్‌, లోపవర్‌ ట్రాన్స్‌మిటర్ల సహాయంతో ఉపాధ్యాయులు ఉన్న చోటినుంచే లైవ్‌ ద్వారా దేశవ్యాప్తంగా విద్యాబోధన చేస్తారు. ఇప్పటికే అక్కడక్కడా కొనసాగుతున్న ఈ ప్రక్రియ రానున్న రెండు దశాబ్దాల్లో దేశవ్యాప్తంగా విస్తరించనుంది.

దేశంలో 14 ఓపెన్‌ యూనివర్శిటీలు 75 రెగ్యులర్‌ యూనివర్శిటీలు కరస్సాండెన్స్‌ కోర్సుల్ని అందిస్తున్నాయి. ఇతర విద్యాసంస్థలు కూడా ఈ దూర విద్యాకోర్సులను నిర్వహిస్తున్నాయి. వివిధ కారణాలతో ఉన్నత విద్యకు నోచుకోని అనేక మందికి ఇదొక సదవకాశంగా మారుతోంది. ఆలస్యంగా విద్యాభ్యాసం మొదలు పెట్టినవారు. తాము నివసిస్తున్న ప్రాంతాల్లో ఉన్నత విద్యావకాశాలు లేనివారు, ఉద్యోగులు, విద్యావంతులైనప్పటికీ తమ విద్యార్హతలు పెంచుకోవాలనుకునేవారికి ఈ దూర విద్యా కోర్సులు ఒక వరంగా మారాయి. కరస్పాండెన్స్‌ కోర్సులు నిర్వహిస్తున్న విద్యా సంస్థలు విద్యార్థులకు ఆయా సబ్జెక్టులకు సంబంధించిన బోధనా సామగ్రి(మెటీరియల్‌)ని కూడా సరఫరా చేస్తున్నాయి. కాంటాక్ట్‌ క్లాసులు (బోధనా తరగతులు) నిర్వహిస్తున్నాయి. తర్వాత పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ప్రధానం చేస్తున్నాయి. వివిధ విద్యాసంస్థలు తమ వద్ద కరస్పాండెన్స్‌ కోర్సు చేస్తున్న విద్యార్థులకు ఇప్పటి వరకైతే చాలా మట్టుకు అచ్చువేసిన బోధనా సామగ్రిని అందజేస్తున్నాయి. వీటితో పాటు ఆయా నోడల్‌ సెంటర్లలో మల్టీ మీడియా సౌకర్యాలు కూడా కొన్నిచోట్ల ఉంటున్నాయి. అక్కడక్కడ టెలివిజన్‌, రేడియో నెట్‌వర్క్‌ ద్వారా కూడా విద్యాబోధన సాగుతోంది.

యూనివర్సిటీలు

1.జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నాలజికల్‌ యూనివర్శిటీ, హైదరాబాద్‌. 2.కాకతీయ యూనివర్శిటీ, వరగంల్‌ 3.ఉస్మానియా యూనిరివర్శిటీ, హైదరబాద్‌.4. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్‌. 5.శ్రీ కృష్ణదేవరాయ యూనివర్శిటీ అనంతపూర్‌. 6. శ్రీవెంకటేశ్వర యూనివర్శిటీ తిరుపతి. 7.శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి. 8. నల్సార్‌ యూనివర్శిటి ఆఫ్‌ లా, హైదరాబాద్‌. 9 నాగార్జున యూనివర్శిటీ నాగార్జునా నగర్‌. వీటితోపాటు దేశంలోని ఇంకా అనేక యూనివర్సిటీలు కరస్సాండెంట్‌ కోర్సుల్ని అందిస్తున్నాయి. ఇటు ఉద్యోగం చేస్తూ అటు చదువుకునే అవకాశంగల ఈ కోర్సులు పేద, మధ్య తరగతి యువతకు ఉపయోగకరంగా ఉంటున్నా

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top