You Are Here: Home » యాత్ర » తీర్ధ యాత్రలు » కన్నయ్య కొలువైన…గురువాయూర్‌

కన్నయ్య కొలువైన…గురువాయూర్‌

కన్నయ్య కొలువైన…గురువాయూర్‌

 

తెలుగువారికి తిరుపతి ఎంతటి పవిత్ర పుణ్యక్షేత్రమో… కేరళీయులకు శబరిమల, గురువాయూర్‌లు అంతటి పవిత్ర పుణ్యక్షేత్రాలు. అయ్యప్ప కొలువైన శబరిగిరి సంవత్సరాని ఒక్కసారి మాత్రమే రద్దీగా ఉంటుంది. కానీ చిన్ని కృష్ణుడు కొలువైన గురువాయూర్‌లో సంవత్సరం మొత్తం భక్తులతో కిటకిటలాడుతుంది.
varanaరాష్ట్రానికి పూర్తిగా దక్షిణ కొసను త్రివేండ్రంలోని అనంత పద్మనాభస్వామి, దాదాపు ఉత్తరకొసను గురువాయూర్‌ కొలువై ఉన్నాయి. గురువాయూర్‌, త్రివేండ్రం కాక ఇంకా కేరళలో అంబళపురం, పట్టాంబి, కాలడి మొదలైన పుణ్యక్షేత్రాలున్నా, అవి స్థానికుల వరకే పరిమితం. ఆది శంకరా చార్యులవారి జన్మస్థలం గనుక, ప్రత్యేకమైన ఆసక్తివున్న కొందరు మాత్రం కాలడి దర్శిస్తుంటారు. ప్రతి ముఖ్యమైన ప్రదేశాన్నుంచి గురువాయూర్‌కు సరాసరి బస్సులు వున్నాయి. రైలు మీద వచ్చే వారు త్రిశూర్‌ (త్రిచూర్‌) స్టేషనులో దిగాలి. త్రిచూర్‌ నుండి గురువాయూర్‌ సుమారు ముప్పై కిలోమీటర్లు వుంటుంది. గంట లేక గంటన్నరలోపు ప్రయాణం. త్రిశూర్‌ నుంచి గురువాయూర్‌కు రైలు మార్గం కూడా ఉంది.

Akbadగురువాయూర్‌ తర్వాత కాలడి వెళ్ళాలనుకునేవారికి, గురువాయూర్‌ నుంచి, త్రిచూర్‌ నుంచి సరాసరి బస్సులు వున్నాయి. రైలులో వెళ్ళేవారు త్రిచూరు నుంచి కొచ్చిన్‌ వైపు వెళ్ళే రైలులో వెళ్ళి ‘అంగమలై’ అనే స్టేషన్‌లో దిగాలి. త్రిచూర్‌ నుంచి అంగమలై నలభై ఆరు కిలోమీటర్లు. సుమారు గంట లేక గంటంపావు ప్రయాణం. అంగమలై నుంచి కాలడి ఎనిమిది కిలోమీటర్లు. బస్సులో వెళ్ళాలి. అరగంట ప్రయాణం. ఈ అంగమలైలో సూపర్‌ ఫాస్ట్‌రైళ్ళు తప్ప, ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళతో సహా అన్ని రైళ్ళు ఆగుతాయి. త్రిచూరు రైల్వేస్టేషన్‌ ఆవరణలో నుంచే గురువాయూర్‌ వెళ్ళే బస్సులు కొన్ని బయలుదేరుతాయి. లేదంటే, స్టేషను ఆవరణ దాటి కేవలం ఒక వంద గజాలలోపు వస్తే, ఒక పెద్ద మెయిన్‌రోడ్‌ వస్తుంది. ఆ జంక్షన్‌లో నుంచుంటే, గురువాయూర్‌ వెళ్ళే బస్సు అక్కడే ఎక్కవచ్చు. లేదంటే, ఆ జంక్షన్‌ కుడిప్రక్కగా మరో వంద గజాల దూరంలోనే బస్‌స్టాండ్‌ వుంది. గురువాయూర్‌ వెళ్ళే బస్సు అక్కడి నుండే బయలుదేరుతుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top