You Are Here: Home » ఇతర » కనువిందు చేసిన కథక్‌-ఫ్లెమెంకో

కనువిందు చేసిన కథక్‌-ఫ్లెమెంకో

IMGaఏకకాలంలో పాటపాడుతూ, సంగీతం వినిపిస్తూ తన హావభావా లతో ఓ కథను హృద్యంగా శాస్ర్తీయ నృత్యరీతులు మిస్‌ కాకుండా ఇచ్చిన కథక్‌-ఫ్లెమెంకో నృత్యం కనువిందు చేసింది. కీర్తిలాల్స్‌ జ్యుయలర్స్‌ సమర్పించిన ‘ఫాస్టెస్ట్‌ ఫీస్ట్‌ ఆన్‌ ఫైర్‌’ కార్యక్రమం ఆద్యంతం ఆహూతులను అలరించింది. పండిట్‌ చిత్రేష్‌దాస్‌, స్పెయిన్‌కు చెందిన ఫ్లెమెంకో ఆర్టిస్ట్‌ ఆంటోనియో హిడాల్గోలు తమ వ్యక్తిగత ప్రతిభలను మేళవించి ఒకే వేదికపై వినూత్నంగా తమ ప్రదర్శన ఇచ్చి ఔరా అనిపించారు. ఈ కార్యక్రమంలో కీర్తిలాల్స్‌ జ్యుయలర్స్‌ డైరెక్టర్‌ సీమా మెహతా మాట్లాడుతూ భారత పర్యటనలో భాగంగా అందించే కార్యక్రమాలను కొన్ని చోట్ల సమర్పిస్తున్నామని తెలిపారు. నాణ్యమైన ఆభరణాలను అందించడంలో కీర్తిలాల్‌ జ్యుయలర్స్‌ వినియోగదారుల మన్ననలు పొందిందని కీర్తిలాల్స్‌ డైరెక్టర్‌ సూరజ్‌ శాంతకుమార్‌ తెలిపారు.

కోయంబత్తూరు ప్రధాన కేంద్రంగా చెనై్న, మధురై, కోచి, బెంగుళూరు, హైదరాబాద్‌, విజయవాడ, వైజాగ్‌లలో కీర్తిలాల్స్‌ ఎక్స్‌క్లూజివ్‌ ఔట్‌లెట్స్‌లలో బంగారు ఆభరణాలను విక్రయిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో రిటైల్‌ ఆపరేషన్‌ హెడ్‌ ఎం. రాజేంద్రన్‌, హైదరాబాద్‌ సీనియర్‌ స్టోర్‌ ఆపరేషన్స్‌ మేనేజర్‌ జి. మధుసూధన్‌ తదితరులు పాల్గొన్నారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top