You Are Here: Home » ఇతర » కనికరమున కావునయ్య కృష్ణయ్యా!

కనికరమున కావునయ్య కృష్ణయ్యా!

వఙ్గక్కడల్‌ కడైన్ద మాదవనై క్కేశవనై
త్తిఙ్గల్‌ తిరుముగత్తు చ్చేయిళైయార్‌ శెన్ఱిఱైఞ్జ
అఙ్గప్పరైకొణ్ణ వాతె్తై యణిపుదునై
పైఙ్గమల త్తణ్ణెరియల్‌ ప్పట్టర్‌ పిరాన్‌ కోదైశొన్న
శఙ్గత్తమిళ్‌ మాలై ముప్పదున్‌ తప్పామే
ఇఙ్గప్పరిశురైప్పారీ రిరణ్డు మాల్వరై త్తోళ్‌
శెఙ్గణ్‌ తిరుముగత్తు చ్చెల్వత్తిరుమాలాల్‌
ఎఙ్గం తిరువరుళ్‌ పెత్తు ఇన్బుఱువ రెమ్బావాయ్‌

ఓ డలతో కూడిన క్షీరసముద్రమును మధింప జేసి లక్ష్మీదేవిని పొంది మాధవుడని పిలువబ డువానిని బ్రహ్మ రుద్రాదులను కూడ తమతమ పనుల యందు నియమించువాడు నగు వానిని, వ్రేపల్లేలో చంద్రబింబము వంటి ముఖములు గలిగి అపురూప మైన ఆభరణములను దాల్చిన గోపికలు సమీపించి మంగళము పాడి పఱయను వాద్యమును లోకుల కొర కును, భగవద్దాస్య మును తమ కొరకును పొందియున్నాను.

ఆ ప్రకారము లోకమున కంతకును అభరణ మైన శ్రీ విల్లిపుత్తూరులో అవతరించి యెల్లపుడును తా మర పూసలమాలికను మెడలో ధరించు శ్రీభట్టనాథుల (విష్ణుచిత్తుని) పుత్రికయగు గోదాదేవి ద్రావిడ భాష లో ముప్పది పాశురములను మాలికగా సంతరించినది. ఈ ముప్పది పాశురములను క్రమము తప్పక చదువువారు గోపికలు శ్రీకృష్ణుని నుండి పొందిన ఫలమును, గోదాదేవి వ్రతము నాచరించి, పొందిన ఫలమును గూడ పొందెదరు. కేవలము చదువుట చేతనే తామర పువ్వురేకులవంటి కన్నులు కలవాడు ఎతె్తైన భుజశిరస్సులు కలవాడును లక్ష్మీభర్తయు నాల్గు భుజములు గల శ్రీమన్నారాయణుడు ప్రసన్నడై సర్వత్ర సర్వదా ఆనందమును ప్రసాదించును.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top