You Are Here: Home » చిన్నారి » స్ఫూర్తి » ఆత్మకథ » కందుకూరి వీరేశలింగం

కందుకూరి వీరేశలింగం

పేరు : కందుకూరి వీరేశలింగం
ఊరు : రాజమండ్రి
ప్రత్యేకత : సంఘ సంస్కర్త

తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి. సామాజిక దురాచారాలపై యుద్ధం చేసి గ్రామీణ ప్రజల మూఢత్వాన్ని పోగొట్టారు. ఆయన రచించిన ‘రాజశేఖర చరిత్ర’ తొలి తెలుగు నవలగా వాసికెక్కింది.

లంచమివ్వాల్సి వస్తుందని ప్రభుత్వోద్యోగానికి, అబద్ధాలాడాల్సి వస్తుందని న్యాయవాద వృత్తికి దూరంగా ఉన్నారు.
వివేకవర్ధిని పత్రిక ద్వారా అవినీతి, దురాచారాల నిర్మూలనకు పోరాడారు.

{బహ్మసమాజం ఆంధ్ర శాఖ స్థాపించారు.

యువజన సంఘాలు మొదలయ్యింది ఈయనతోనే. కో ఎడ్యుకేషన్ ప్రవేశ పెట్టింది కందుకూరే. స్త్రీల కోసం సతీహితబోధిని పత్రిక నడిపారు. వితంతు వివాహాలు చేశారు.

‘హితకారిణీ సమాజం’ ద్వారా సొంత డబ్బుతో సేవ చేశారు.
కందుకూరిని ప్రజలు ‘గద్య తిక్కన’గా పిలుచుకునేవారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top