You Are Here: Home » చిన్నారి » ఓడ నీటి మీద ఎలా తేలుతుంది?

ఓడ నీటి మీద ఎలా తేలుతుంది?

నీటి సాంద్రత కన్నా ఎక్కువ సాంద్రత ఉన్న వస్తువులను నీటిలో వేస్తే వెంటనే అవి మునిగిపోతాయి. ఆ వస్తువు నీటిమీద తేలియాడితే ఆ వస్తువు నీటి సాంద్రత కంటే తక్కువ సాంద్రత కలిగి ఉన్నదని తెలిసిందే. చె క్క లేదా కాగితం, బెండుముక్కను నీటిపై పడవేస్తే అవి తేలుతాయి. ఇనుము, ఉక్కువంటి వాటిని నీటిలో పడవేసినప్పుడు అవి మునిగిపోతాయి. అయితే ఇనుము, ఉక్కులతో తయారుచేసిన ఓడ నీటిలో మునుగకుండా ఎలా తేలుతుంది? ఎందుచేత? అనే ప్రశ్న వస్తుంది. ఇనుపముక్కను నీటిలో పడవేసినప్పుడు అది స్థానభ్రంశం చెందించిన నీటి ఘన పరిమాణం కన్నా ఇనుపముక్క ఘన పరిమాణం ఎక్కువ. అందువల్ల అది మునుగుతుంది.

కాని ఓడను ఇనుముతో రూపొందించినప్పటికీ దానికి ఉన్న నిర్దిష్టమైన ఆకృతి వలన అది ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. అందువలన తేలియాడుతుంది. ప్రమాదం సంభవించి ఓడలోకి క్రమంగా నీరు చేరినప్పుడు ఓడ బరువు పెరుగుతుంది. అప్పుడు ఓడ ఘన పరిమాణం అది స్థానభ్రంశం చెందించిన నీటి ఘనపరిమాణం కన్నా ఎక్కువవుతుంది. దీని ఫలితంగా ఓడ మునుగుతుంది. అంతేకాకుండా ఓడలు సముద్రపు నీటిలో తక్కువ లోతునకు మునిగితే నదులలో చాలా ఎక్కువ లోతుకు మునుగుతుంది. దీనికి కారణం నది నీటి సాంద్ర త, సముద్ర నీటి సాంద్రతల మధ్య తేడాయే. అంటే సముద్రపు నీటి సాంద్రత ఎక్కువ, నది నీటి సాంద్రత తక్కువ.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top