You Are Here: Home » ఇతర » ఓటుహక్కు వజ్రాయుధం

ఓటుహక్కు వజ్రాయుధం

ప్రజల కొరకు, ప్రజల చేత ఏర్పాటు చేయబడిన ప్రజాస్వామ్య ప్రభుత్వం మనది. మనకు నచ్చిన నాయకుడి మనం ఎన్నుకునే పద్ధతి… ఆ నాయకుడు మంచివాడైనా, చెడ్డవాడైనా ఎన్నికల్లో గెలిస్తే అతన్ని మెజారిటీ ప్రజలు ఆమోదించినట్లే భావించాలి… ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మనదే… అందుకు ఓటే వజ్రాయుధం… నేను ఒక్కడినీ ఓటు వేయపోతే వచ్చిన నష్టం ఏమీ లేదనే భావన ఉండరాదు… ఇలాంటి ఆలోచనలతోనే ఓటింగ్‌ శాతం తగ్గుతూ వస్తోంది. ఎన్నికల సంఘం, స్వచ్చంధ సంస్థలు అవగాహన కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నా చదువుకున్న యువతలో చైతన్యం రావడంలేదు… ఓటే ఓ నాయకుడిని తయారుచేస్తుంది… ఓటే ప్రజాస్వామ్య స్థాపన చేస్తుంది… ఓటే అవినీతిపరులను తరిమికొడుతుంది… ఓటే అక్రమార్కులను ప్రశ్నిస్తుంది… ఓటే తప్పు చేసే ప్రజాప్రతినిధులకు భీతిగొల్పుతుంది… ఈ ఓటరు దినోత్సవం సందర్భంగా ‘అందరం ఓటు వేద్దాం.. సమసమాజ స్థాపనకు కృషి చేద్దాం’ అని ప్రతిజ్ఞ చేద్దాం…
ఓటరు నమోదు విధానం
pollingఓటర్లు, తమ తమ మండల రెవెన్యూ కార్యాలయాలలోనూ , తహశీల్దారు కార్యాలయాలలోనూ తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు. ఈ ఆఫీసులు ఎలక్టోరల్‌ ఆఫీసు లలాగా పనిచేస్తాయి. అలాగే కొన్ని నగరాలలో ‘ఆన్‌-లైన్‌’ సౌకర్యం ద్వారానూ తమ పేర్లను నమోదు చేసుకొన వచ్చును. దరఖాస్తు చేసుకున్న నెల రోజుల్లో ఓటర్‌ కార్డు అందజేస్తారు. ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరంలో వారం రోజులు ప్రత్యేకంగా ఓటర్ల నమోదు ప్రక్రియ నిర్వహిస్తోంది. ఈ సయయంలో ఆయా ప్రాంతాల్లోనే శిబిరాలు ఏర్పాటు చేసి ఓటర్‌ నమోదు ప్రక్రియ కొనసాగిస్తారు. ఎవరైనా ఓటింగు రోజు హాజరుకాలేకపోతే వారి వోటు వృధా అవుతోంది. దీనిపై భారత ఎన్నికల కమిషన్‌ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

రాష్ట్రంలోని ప్రతి పౌరునికి ఫొటో గుర్తింపు ఓటరు కార్డు ఉండడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కార్డులో స్పష్టంగా పేరు, చిరునామా, ఫొటో కనిపించేలా.. నలుపు తెలుపు గుర్తింపు కార్డులు ప్రస్తుతం జారీ చేస్తున్నారు. ఈ స్థానంలో కలర్‌ గుర్తింపు కార్డు జారీ అంశాన్ని పరిశీలిస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా ఓటర్ల నమోదు ప్రక్రియ సరళతరం చేసి యుద్ధ ప్రాతిపదికన కొనసాగిస్తుండడంతో రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఓటర్లు గుర్తింపు కార్డులు పొందారు.

చట్టసభలకు చేరని మెజారిటీ ఓటర్ల ఎంపిక..
boothఇప్పుడు జరుగుతున్న ఎన్నికల విధానంలో బరిలో దిగిన అభ్యర్థుల్లో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారే గెలిచినట్లు ప్రకటిస్తున్నారు. అయితే మిగతా అభ్యర్థులకు పోలైన ఓట్లను కలిపి చూస్తే గెలిచిన అభ్యర్థికంటే మూడు నాలుగు రెట్లు అధికంగా ఉంటున్నాయి. మెజారీటీ ఓటర్ల ప్రాతినిధ్యం చట్టసభలకు వెళ్లడంలేదు. 2004లో రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రకారం ఎన్నికల సంఘం ప్రకటించిన లెక్కలు పరిశీలిస్తే 2004 సంవత్సరంలో కాంగ్రెస్‌ పార్టీకి 38.58 శాతం ఓట్లు రాగా 225 ఎమ్మెల్యే సీట్లు గెలిచారు. 2009 సంవత్సరంలో 294 సీట్లుకు పోటీ చేయగా 37.42 శాతం ఓట్లు రాగా 156 స్థానాలు గెలిచారు. అంటే కాంగ్రెస్‌కు 2004 ఎన్నికలతో పోల్చినప్పుడు ఓట్ల శాతం తగ్గింది. సీట్లు తగ్గాయి. కాని ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అంటే ఓట్ల శాతం తక్కువ వచ్చినను ఎన్నిక అవుతున్నారు.

ఈ పద్ధతికి స్వస్తి చెప్పవలసిన ఆవశ్యకత ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఉదాహరణకు 2009 ఎన్నికల్లో పాలకొల్లు నియోజక వర్గంలో 1,29,000 ఓట్లు పోలయ్యాయి. పిఆర్పీ 43,970 ఓట్లు, తెలుగుదేశం అభ్యర్థికి 29,238 ఓట్లు వచ్చాయి. గెలిచిన కాంగ్రెస్‌ అభ్యర్థికి 49,132 ఓట్లు వచ్చాయి. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఎంపికకు 73,208 వ్యతిరేకంగా ఉన్నారు. కాని కాంగ్రెస్‌ అభ్యర్థే గెలిచినట్లు మన ఎన్నికల ప్రక్రియ చెబుతోంది.

కొత్త వాదన…
ఓటింగ్‌ ప్రక్రియలో భారంగా అన్ని పార్టీల గుర్తుల కింద ‘ఏ అభ్యర్థీ నచ్చలేదు’ అన్న అవకాశాన్ని కూడా చేర్చాలని ఎన్నికల కమిషన్‌ యోచిస్తోంది. దీంతో ఓటరుకు ఓటింగ్‌ విధానంపై నమ్మకం పెరుగుతుంది. తాము ఎంపిక చేసిన అభ్యర్థిని ఎంత మంది వ్యతిరేకిస్తున్నారో పార్టీలకు కూడా తెలుస్తుంది. దీనికి ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉంది. అయితే దీని వల్ల నిరసన భావం పెరిగితే నచ్చలేదు అనే అంశానికి ఎక్కువ ఓట్లు పడే అవకాశాలు లేకపోలేదు.

ఓటర్ల ఎంపికలో మార్పులు…
Voteaప్రపంచ దేశాలలో మనదేశానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎక్కువ జనాభా గల అతిపెద్ద ప్రజాస్వామిక వ్యవస్థ. ప్రజల చేత, ప్రజల కొరకు పరిపాలన సాగించే ఈ పద్ధతి బ్రిటిషు వారు ప్రవేశపెట్టారు. 1937 వరకు ఆర్థికంగా ఉన్నవారికి, డిగ్రీ పూర్తిచేసిన వారికి మాత్రమే ఓటు హక్కు కల్పించారు. దీంతో దేశంలోని 14 శాతం మందికి మాత్రమే ప్రజాప్రతినిధులను ఎన్నుకునే అవకాశం ఉండేది. 1946లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కోసం ఈ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించారు. 1952 పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికల్లో 21 సంవత్సరాలు నిండిన స్ర్తీ, పురుషులందరికీ వయోజన ఓటు హక్కు ల్పించారు. 1956 సంవత్సరంలో రిపబ్లిక్‌గా ప్రకటించి అప్పటినుండి 2009 జరిగిన ఎన్నికల వరకు 18 సంవత్సరాలు నిండిన స్ర్తీ, పురుషులకు ఓటు హక్కుతో ఎన్నికలలో పాల్గొంటున్నారు. అదేవిధంగా బ్యాలెట్‌ పేపర్లు, బ్యాలెట్‌ పెట్టెలు దగ్గరనుండి ఫొటో గుర్తింపు కార్డులతో, ఇవిఎంల వరకు (ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్లు) వరకు ఎన్నికలు నిర్వహించే తీరులో అభివృద్ధి చెందాం.

భారత ఎన్నికల కమిషన్‌..
భారతదేశంలో ఎన్నికల నిర్వహణ భారత ఎన్నికల కమిషను ఆధ్వర్యంలో జరుగుతోంది. ఈ మిషనును భారత రాజ్యాంగం ఏర్పాటు చేసినది. ఈ ఎన్నికల కమిషను, న్యాయస్థానాలకు అతీతంగా, కొన్నిసార్లు తానే న్యాయస్థానంగా కూడా పనిచేస్తుంది. ఓటర్ల నమోదు కార్యక్రమం, ఓటర్ల గుర్తింపు కార్డుల విడుదల, ఎన్నికల నిర్వహణ, ఎన్నికల ఫలితాల ప్రకటన మొదలగు కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహిస్తుంది. రాష్టస్రాయిలో వీటి శాఖలు ఉంటాయి.

యువతే కీలకం..
Youthప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం… దేశ అధ్యక్షుడినైనా, ప్రధానైనా ఎంపిక చేసే శక్తి ఓటుకు మాత్రమే ఉంది. అవినీతి, గుండాయిజం, డబ్బుకు ఓటు అమ్ముడు పోవడంతో నెలకొన్న నైరాశ్యం.. కారణమేదైనా ఎన్నికలకు ఎక్కువ శాతం యువత దూరంగా ఉంటోంది. ఓటింగ్‌ సమయంలో ఎక్కువగా పాల్గొనేది గ్రామీణులు… పట్టణ మధ్య వయసువారే కావడం ఇందుకు నిదర్శనం. దీంతో ఆయా ప్రాంతాల్లో పోలింగ్‌ 60 నుంచి 70శాతం దాటడం లేదు. దూరంగా ఉన్న వారిలో ఎక్కువ భాగం యువతే. సమయంతో పాటు దూసుకుపోతున్న ఈ కాలంలోనూ గంటల తరబడి ఓటు వేయాల్సి రావడం కూడా యువత పోలింగ్‌లో పాల్గొనకపోవడానికి ఓ కారణం. ‘ఈ పోలింగ్‌’ విధానాన్ని ప్రవేశపెట్టాలని…

ఇంటి వద్ద నుంచే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాలను పరిశీలించాలని ఈసీని యువత కోరుతోంది. ఇది అందుబాటులోకి వస్తే ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకుంటారని వారు పేర్కొంటున్నారు. అయితే చదువుకున్న యువత ఓటింగ్‌లో ఎక్కువ శాతం పాల్గొనాలని, ప్రజాస్వామ్య పరిరక్షణలో వారి ప్రాతే కీలకమని ఎన్నికల సంఘం అవగాహన చర్యలు చేపడుతోంది.

మీకు తెలుసా…

  • నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక నియోజకవర్గాలు కలిగిన జిల్లా తూర్పు గోదావరి జిల్లా.
  • ఇప్పటి వరకు రాష్ట్ర శాసనసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన సభ్యుల సంఖ్య 42.
  • రాష్ట్రంలో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను వినియోగించిన తొలి నియోజకవర్గం షాద్‌నగర్‌.
  • 1951లో మొదటిసారిగా 26 రాష్ట్రాల్లో 489 లోక్‌సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. ఆ కాలంలో బహుసంఖ్య నియోజకవర్గాలుండేవి. ఒక నియోజకవర్గంలో 2 నుంచి 3 సీట్లు వుండేవి. 1960లో ఈ విధానాన్ని రద్దుచేశారు…
Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top