You Are Here: Home » ఇతర » ఒలింపిక్‌ వీక్షకుల రికార్డ్‌

ఒలింపిక్‌ వీక్షకుల రికార్డ్‌

(0)PTI7aఇటీవలే ప్రారంభమైన లండన్‌ ఒలిపిక్‌ క్రీడలు ఆరంభంలోనే సంచలనాల్ని సృష్టించాయి. ప్రారంభోత్సవాలను యూనైటెడ్‌ కింగ్‌డమ్‌లో దాదాపు 26.9 మిలియన్‌ ప్రజలు వీక్షించారని బిబిసి సమాచార వ్యవస్థ వివరించింది. బిబిసి ప్రకారం యూకెలో అత్యధిక వీక్షకాదరణను సాధించిన 13వ కార్యక్రమం ఇదేనట . ఇంతకు ముందు ఇంతలా పాపులారిటీ సంపాదించిన కార్యక్రమాలలో బ్రిటన్‌క్వీన్‌- జేమ్స్‌బాండ్‌ మీటింగ్‌కు సంబంధించిన ప్రొగ్రామ్‌ ఒకటి. ఒలింపిక్‌ స్టేడియంలోని 80వేల ప్రేక్షకులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా మిలియన్‌ల కొద్ది అభిమానులు వేడుకలను తిలకించారు.2008లో జరిగిన బీజింగ్‌ ఒలింపిక్స్‌ను యుకెలో 8 మిలియన్‌ మంది చూశారు. ఏథెన్స్‌ గేమ్స్‌లో 8.68 మంది యుకెవాసులు ఆసక్తి చూపించారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top