You Are Here: Home » ఇతర » ఒత్తిడికి లోనైతే బరువే కాదు..నడుము కొలతా పెరుగుతుంది!

ఒత్తిడికి లోనైతే బరువే కాదు..నడుము కొలతా పెరుగుతుంది!

ఒత్తిడికి గురయ్యే పరిస్థితులు ఎదురయినపుడు బుర్రంతా వేడెక్కిపోయి, మనస్సు బరువవడమే కాదు నడుము కొలత కూడా పెరిగిపోతుంది. టెన్షన్‌ స్థాయి ఎక్కువుగా ఉంటే ఎడ్రినలిన్‌, కార్టిసోల్‌ స్థాయిలు పెరుగుతాయని తద్వారా శక్తికోసం నిల్వఉండిపోయిన చక్కెర, కొవ్వులను రక్తసరఫరా వ్యవస్థలోకి విడుదల చేస్తాయని ఓ పరిశోధనలో తేలింది.

Filler-(1)ఒకసారి ఒత్తిడి ఆరంభమైతే తదుపరి ఛాలెంజింగ్‌ పరిస్థితులు సిద్ధంకావడం కోసం క్యాలరీల నిల్వల్ని ఉపయోగించుకునేందుకుగాను కార్బోహైడ్రేట్లు, కొవ్వుల అవసరాన్ని కార్టిసోల్‌ ఉద్ధీపం చేస్తుంది. దీరకాలిక ఒత్తిడి వల్ల ఈ కార్టిసోల్‌ ఎపెటైట్‌ స్పందన నిరంతరం కొనసాగుతూనే వుంటుందని, దీనివల్ల అదనపు చక్కెర, ఫ్యాట్‌కు దారితీసే ప్రమాదముందని పరిశోధన తేల్చింది. నడుముచుట్టూ బరువు కొవ్వు రూపంలో ఎక్కువుగా పేరుకుపోయి వుంటుంది. కాలేయానికి సమీపంలోని ఫ్యాట్‌ అత్యంత త్వరితంగా ఇంధనంగా మారుతుండడమే ఇందుకు కారణం. కాబట్టి , ఎప్పుడైనా ఒత్తిడిగావుంటే సుదీర్ఘంగా ఊపిరితీసుకుంటూ వుండాలి. దీనివల్ల మనస్సు ఆరోగ్యంగా వుండడమే కాకుండా నాజూకు నడుమూ మీ సొంతం అవుతుంది.

Other News From

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top