You Are Here: Home » ఇతర » ఒక ముందడుగు!

ఒక ముందడుగు!

mbdపరభృతం కాకి గూట్లో పెరిగినంత మాత్రాన
తన పంచమ స్వరాన్ని మధుర కలకూజిత కుహురావాన్ని
మర్చిపోయి ‘కా….కా’ అని అరుస్తుందా ?
పరాయిపాలనలో అరువు తెచ్చుకున్న భాష
ఆప్తబంధువై పోతుందా ?
ఆత్మభాషై పోతుందా?
అమ్మపాలు వెక్కసమైపోయి.. పోతపాలకి పరవశించే
పసివాడి చందమైపోయింది !
ఎంత చక్కని భాష మనది !… అజంతాలతో చెక్కిన
అందాల శిల్పమైన భాష మనది
గుండ్రని ముత్యాల కోవల దీపాలై వెలిగే.. నా తెలుగు అక్షరాలు
లక్షల సాహిత్య సుమాల మాలలల్లుకొన్న మహోన్నత సంస్కృతీ
సారస్వతోద్యానాలు;
కళల కైవారాలందుకొన్న శతాబ్దాల తెలుగు వెలుగుల్ని…
ఆ జిలుగుల్ని.. తలచుకొంటే
గర్వించని తెలుగు గుండెవుంటుందా ?
కావ్య నాటక ప్రబంధాల సరస నవరస మనోహరి
ద్విపద నడకల కులుకులోలికిన కలికి పలుకుల ఒయారి.
వేమనార్యుని నీతి మరందాల మూట!
అన్నమాచార్యుని రస భావసంపదల వూట!!
ఎంత చక్కనిది రుూ తెలుగు మాట!!!
ఎన్ని భాషలు నేర్చినా సెహభాషే ! కాదనేవారెవరు ?
కానీ మాతృభాష రాకుండా మరోభాషకై
ఎగబడడమంటే… అంతకంటే ఆత్మవంచన వుంటుందా?!
అందుకే మృతభాష కాకుండా మన అమృతభాషని కాపాడడానికి
కొడిగడుతున్న మన సంస్కృతీ దీపానికి చేతులడ్డు పెట్టడానికి..
నడుం కట్టిన రుూ ప్రపంచ తెలుగు భాషా సదస్సు నామనస్సు

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top