You Are Here: Home » ఇతర » ఒక కునుకు తీయండి..

ఒక కునుకు తీయండి..

వత్తిడిని తగ్గించుకోవడానికి ఒక కొత్త మార్గాన్ని మొన్ననే కనుగొన్నారు అమెరికాకి చెందిన శాస్త్రవేత్తలు. పనిసమయాల్లో పది నిముషాల పాటు కళ్ళుమూసుకుని నిద్రపోతే వత్తిడి చాలా వరకూ తగ్గుతుంది అని అంటున్నారు.

1fillerనిర్విరామంగా కంప్యూటర్లముందు పనిచేసే మహిళ ల్లోనే ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. తీరిక సమయం దొరక్కపోయినా, ఏదో విధంగా తీరికచేసుకుని, ఏ ఆలోచనలూ పెట్టుకోకుండా 10 నిముషాల పాటు నిద్రపోతే, అంతవరకూ ఉన్న వత్తి డి చాలా వరకూ తగ్గి మళ్ళీ ఉత్సాహం పుంజుకుం టారని అంటున్నారు. ఈ విధంగా కొంతమందిని పరిశీలించిన శాస్తవ్రేత్తలు ఈ విషయాన్ని వెల్లడించారు. నిజమే నరెైన నిద్రలేకుండా పనిచేయడం కూడా అనేక సమస్యల్ని తెచ్చిపెడుతుందని వెైద్య నిపుణులు కూడా గతంలో హెచ్చరించారు. అనేక రకాల మందులు వాడి వత్తిడి తగ్గించుకోవాలని ప్రయత్నించే కన్నా ఈ పద్దతి ఎంతో సులువుగాను, ప్రయోజనాత్మకంగానూ కూడా ఉంటుంది. వీలుంటే ఒక 10 నిముషాలు విశ్రమిం చడంలో తప్పేమీలేదు. అయితే ఆ సంస్థ యాజమా న్యాలు ఇందుకు సహకరించాలి.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top