You Are Here: Home » చిన్నారి » కథలు » ఒక ఊరి కథ

ఒక ఊరి కథ

sunday-storyదాదాపు కొన్ని సంవత్సరాల క్రితం… ఆ ఊరిని ఫ్యాక్షన్‌ భూతం కబలించింది. పచ్చగా వున్న ఊరిని, ఎర్రగా మార్చింది. భూ పంపకాల విషయంలో దొర్లిన పొర పాటుకు, పచ్చగడ్డి కూడ భగ్గున మండింది. రాజకీయ రొచ్చులో కూరుకుపోయింది. వర్గాలుగా చీలి పోయిన ఆ ఊరి జనం మధ్య మానవత్వం త లదించుకుంది. తెల్ల చొక్కాలు తిరాగాల్సిన ఊరి వీధుల్లో కాకీ చొక్కాల పహార పరుగులు పెట్టింది. నెత్తుటి కూడు తినే దుస్థితి దాపురిం చింది. కొద్ది రోజులు సద్దుమనిగిన ఊరులో మళ్ళీ ఫ్యాక్షన్‌ కోడి భీకరంగా కూత పెట్టింది.

అంతే… పగ, ప్రతీకారం మధ్య… ప్రేమ ఆప్యాయతలు అట్టుడికిపోయాయి. రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వున్న ఊరిలో వుండలేని పరిస్థితి ఏర్పడింది. ఆ పల్లె పరుగుదీసింది. చెల్లాచెదురుగా చీలిలైపోయింది. ప్రతి వారం రోజులకి రెండు శవాలు చవిచూడాల్సిన సంకటస్థితిలో పడిం ది ఊరు. మనుషుల ప్రాణకోత సరిగ్గా అర్థ రాత్రి దాటాక జరుగుతుండడం ఒక విచిత్రమైతే… ఎలా చస్తున్నారో తెలియకపోవడం మరో విచిత్రం… రాత్రి అయిందంటే ఇళ్ళల్లో నుండి బయటికి రావటానికి బెంబేలెత్తిపోయో భయం వాతావరణం నెలకొంది. ఊర్లో దె య్యాలు వున్నాయని కొందరు ఇదంతా బైరెడ్డి, కొండారెడ్డి మధ్య ఫ్యాక్షన్‌తో ఇరువర్గాలవారు ఒకరినొకరు మోసం గా చంపుకొంటున్నారని మరికొందరు అనుకొంటున్నారు.

పండుగలు పబ్బాల సమయంలో ఉత్సాహంతో ఊర్రూతలూగి ఉరకలేసే ఆ ఊరు… ఉసూరుమంటూ… ఊడ్చుకపోయాక, వుండలేని గ్రామ సింహాలు కూడా, పొరుగూరికి వలస పోవాల్సి వచ్చింది. ఇప్పు డు ఆ పాంత్రం నిర్మానుష్యంగా మారిపోయిం ది. మహా సంగ్రామాన్ని తలపించిన ఆ ఊరు స్థితిగతులు వార్తా పత్రికల్లో కథనాలుగా వెలువడ్డాయి. ఇప్పుడు దాదాపు కొన్ని సంవత్సరాలుగా ఆ ఊరి ఉసేలేదు.
మెయిన్‌ రోడ్డు నుండి…. ఆ ఊర్లోకి నడచి వెళ్ళాలంటే… ఫర్లాంగు దూరం నడచి వెళ్ళాల్సిందే… ఒకప్పుడు విశాలంగా వున్న రహదారి… ఇప్పుడు అటు ఇటు గుబురు చెట్లతో కప్పబడివుంది. చుట్టూ బీళ్ళు పడిన చేలల్లో… పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి, అడవిని తలపిస్తున్నట్లు వున్నాయి. దట్టంగా మొలచిన వృక్షా ల మధ్య ఊరు కనిపించకుండానే పోయింది.

ఆ ఊర్లోకి అడుగుపెట్టాడు ఒక జర్నలిస్ట్‌… అంతా కలయజూస్తూనే అడుగులు మెల్లగా కదుపుతున్నాడు. భుజానికి వేలాడేసుకున్న బ్యాగ్‌ను సవరించుకొంటు, దిక్కులు పరిగణిస్తున్నాడు. మెడలో కెమెరా వేలాడుతూ వుంది. మొదటి వీధిలోకి అడుగు పెట్టాడో లేదో గాని… తుర్రూ… మంటూ పందికొక్కు తన కాళ్ళ మీద నుండి బొరియవైపు పరుగెత్తుకు వెళ్ళింది. ఐనా అతనిలో భయం కూసంతైనా కనిపించలేదు.
జర్నలిజానికి కావల్సింది భయం కాదు. శో ధించే తత్వం… సాధించే పటుత్వం… నిజా న్ని నిర్భయంగా తెలిపే సమానత్వం… ఇవన్ని అతనిలో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయ్‌… అ టు ఇటూ చూస్తూ నడుస్తున్నాడు. ప్రతి ఇంటిపైనా రాళ్ళ కుప్పలు… వాటి మధ్యలో చొచ్చుకొని వచ్చి తొంగిచూస్తున్నట్టు గడ్డిపోచలు. కొ న్ని ఇళ్ళ తలుపులు చీలిపోయి వున్నాయి. పూరి గుడిసెలు శిథిలావస్థలో వున్నాయి.

‘ఇది ఊరా..? వల్లకాడా…?’ మనసులో అ నుకున్నాడతను. జేబులో నుండి చిన్న పుస్త కం బయటికి తీసాడు. అందులో ఏదో వ్రాసి తిరిగి జేబులో పెట్టుకున్నాడు. ఉత్తరం వైపుగా చిన్న వీధి… నేరుగా వెళ్ళితే… రాముని దేవాలయం. రాముడు, సీత, లక్ష్మణ, ఆంజనేయ విగ్రహాలు బిక్కు బిక్కుమని చూస్తున్నట్టు… సాలీడు గూళ్ళ మధ్య… దుమ్ము దుమారాలు మధ్య కాలం వెల్లబుచ్చు తున్నట్లు నిలబడే వు న్నాయి. ఇంకాస్త ముందుకెళ్ళి తూర్పుకు తిరిగితే… నాగలకట్ట… దానికి ఎడమ వైపు పెద్ద బంగ్లా… తిన్నగా అక్కడికి వెళ్ళాడు జర్నలిస్ట్‌.

ప్రాంగణపు గేటు వేసింది వేసినట్టేవుంది. అక్కడికెళ్ళి నిలబడ్డాడు. తన మెడలో ఊయలూగుతున్న కెమెరాకు పని పెట్టాడు. ఆ బం గ్లాను తన కెమెరాలో బంధించి, గేటు ఎక్కి లోపలికి ప్రవేశించాడు. నెంబరు ప్లేట్‌ లేని కారు ఒకటి చెట్ల మధ్యన… తుప్పుపట్టి… చెత్త చెదారాల మధ్య పడుంది. వెళ్ళి కారుని పరిశీలించాడు. అక్కడ కూడా తన కెమెరాను క్లిక్‌ మనిపించాడు. అటునుండి నేరుగా ఇంటి ముఖద్వారం దగ్గరకు వెళ్ళి నిలబడ్డాడు. తలుపులకు తాళం బి గించి వుంది. అడ్డదారిలో లోపలికి వెళ్ళాడు. విశాలమైన హాలు మధ్య గోడకు పులి బొమ్మ పెద్దగా కనిపించింది. అలాగే లోపలికి వెళ్ళా డు. బూజు పట్టిన సోపాసెట్లు… విరిగి పడివున్న డైనింగ్‌ టేబుల్‌… తెరచి వుంచిన కిటికీల్లో నుండి వచ్చి పడిన దుమ్ముతో కప్పబడిన షోకేస్‌ అద్దాలు… అక్కడ ఏ ఆనవాళ్ళు దొరకలేదతనికి. అన్ని గదులు గాలించగా… బెడ్‌రూంలో ఒక డైరీ లాంటి పుస్తకం దొరికింది. చిరిగిపోయిన పేజీలు ఒక్కొక్కటి మెల్లగా తిప్పాడు.

హతవిధీ…! అనుకున్నాడు. ఈ ఊర్లో ఫ్యాక్షన్‌ ఈ ఇంటి నుండే మొదలైంది… పుస్తకం తన బ్యాగులో సర్ది… వెనక్కి తిరిగాడు. వీధిలోకి అడుగుపెట్టాడు. చివరి వీధివరకు అటు ఇటు చూస్తూ వెళ్ళాడు. రెండు కుక్కలు తారసపడ్డా యి. వాటిని అనుసరించాడు. ఊరి చివరి వర కు వెళ్ళాయి… మూడు దారుల కూడలి మధ్య లో ఒక చిన్నపాటి గుడిసె… తలుపు తెరిచే వుంది. వాకిట పంచనకెళ్ళి అటు ఇటు కూర్చున్నాయి కుక్కలు, జర్నలిస్ట్‌ ఆశ్చర్యబోయాడు.
తిన్నగా అక్కడికే వెళ్ళాడు. సరిగ్గా అప్పుడే… చేతిలో ఎంగిలి విస్తరి పట్టుకొని, పొడి దగ్గు దగ్గుతూ..బయటికి వచ్చాడు ఒక ముసలాయ న… జర్నలిస్ట్‌ ముఖం చూడగానే… భయపడినట్టు..విస్తరి విసరిపారేసి..చకాచకా లోపలికెళ్ళి తలుపు బిగించుకున్నాడు… ఏమీ అర్థం కాలేదు జర్నలిస్ట్‌కు. వెళ్ళి తలుపు తట్టాడు.

‘‘తాతగారూ… తలుపు తెరవండి…’’ అన్నా డు. లోపలున్న తాత ఈ మాత్రం ఉలుకు ప లుకు లేదు…‘‘పరవాలేదు తలుపు తెరవం డి… నేను రిపోర్టన్‌ని… భయపడకు… నీకు సాయం చేద్దామని వచ్చాను…’’ అంటూ నానా తంటాలు పడి… ముసలాయన చేత తలుపు తీయించాడతను. ఈత చాప తెచ్చి ఆరుబయట పరచి కూర్చోమన్నాడు ముసలాయన.
‘‘శ్మశానాన్ని తలపిస్తున్న ఈ ఊరిలో… ఒక్కడివే ఎలా వుంటున్నావ్‌..?’’ ముసలాయన్ని ప్రశించాడు జర్నలిస్ట్‌… ‘‘ఇది శ్మశానం అయి నందువల్లే ప్రశాంతంగా వుంది బాబు… కానీ ఒకటే బాధ… పిల్లలు తెచ్చిన తంటా… పెద్దల కంఠానికి వచ్చింది చూడు… అది తలచుకున్నప్పుడు… మెతుకు మింగుడు పడదు…’’ కన్నీరు కార్చాడు ముసలాయన…

‘‘నువ్వనేది అర్థం కాలేదు తాత…’’ అన్నాడు జర్నలిస్ట్‌… ‘‘కాదు బాబు… ఒక పట్టాన అర్థం కాదు… పచ్చగా వున్న ఊరు పొలికేక పెట్టింది… ఊరు వల్లకాడైంది… ఆ వల్లకాడుకు కాటి కాపరిలాగా నేనొక్కడే ఇక్కడ మిగిలిపోయాను… ఒక చిన్న సమస్య. రెండు సమాధులకు పునాది వేసింది…’’ అంటూ గతంలోకి జారుకున్నాడు ముసలాయన.

చుట్టూ పచ్చని పొలాల మధ్య ఒదిగి వున్న ఆ పల్లెటూరులో… బైరెడ్డి, కొండారెడ్డి, పెద్ద రైతు లే కాదు… ఆ ఊరికి పెద్ద దిక్కు కూడా వా రే…రచ్చబండ దగ్గర పంచాయితిలో న్యాయం చెప్పేవారు వీరిద్దరే… ఖద్దర్‌ షర్టు ఎర్రటి అం చుగల పన్నా పంచెలు కట్టుకొని ఊరి వీధిలో వస్తుంటే… గ్రామం ఒక్కసారిగా రంకేసి పోట్లగిత్తలా గంభీరంగా తలాడించేది. అట్లాంటి వీరిద్దరి మధ్య… భూపంపకాల విషయంలో తారతమ్యాలు విజృంభించాయి. అంతే ఒకే కూటమిగా వున్న ఊరు… రెండు వర్గాలుగా విభజన జరిగింది. ఒకే పార్టీజండాలు ఎగురుతున్న ఆ ఊరిలో మరో పార్టీ జండా సగభాగాన్ని ఆక్రమించింది.
బైరెడ్డి కూతురు దివ్య. కొండారెడ్డి అనుచరుడైన కేశవరెడ్డి కొడుకు లోక్‌నాథ్‌రెడ్డిని ప్రేమిం చింది. గుట్టుగా సాగుతున్న వీరి ప్రేమ వ్యవహారం… కాలేజ్‌ ఫీజు కోసం ఇంట్లో ఇచ్చిన పైకంతో… లోక్‌నాథ్‌రెడ్డి మెడచైను తీయిం చిన దివ్య గురించి బైరెడ్డికి తెలిసిపోయి…. కేశవరెడ్డికి వార్నింగ్‌ ఇచ్చి… లోక్‌నాథ్‌రెడ్డిని కొడతాడు… దీనికి కొండారెడ్డి రగిలిపోతాడు.

అక్కడే ఇద్దరి మధ్య రగడ వ్యాప్తి చెంది. గ్రామం తల్లడిల్లింది… బైరెడ్డి కూతుర్ని ఊరి పొలిమేర్లో చంపేస్తానని కొండారెడ్డి అన్నట్లు… మధ్యవర్తి బైరెడ్డికి చెప్పగానే… వీరిద్దరి మధ్య కోపతాపాలు మరింతగా రెచ్చిపోతాయి… ఆ రోజు నుండి తన మనుషులు దివ్యను కాలేజ్‌ వరకు వదిలి పెట్టి వచ్చేవారు. లోక్‌నాథ్‌రెడ్డికి కొండారెడ్డి మనుషులు తోడుగా వెళ్ళేవాడు… ఐనా ఈ తంతు చాలా రోజులు జరగలేదు… స్వచ్ఛమైన ప్రేమికుల మధ్య రాజకీయం రాజుకుంది… అనుకున్నట్టుగానే దివ్యను ఊరి నడిబొడ్డులో చంపిస్తాడు కొండారెడ్డి.
బైరెడ్డి క్రుంగిపోయాడు… రోషానికి ఆనకట్ట వేద్దామనుకున్నాడు కాలేదు… ఒక్కగానొక్క కూతుర్ని కొండారెడ్డి పొట్టన పెట్టుకున్నాడు… అదే చిచ్చు లోకనాథరెడ్డిని అదే ఊరు నడిబొడ్డులో బలి తీసుకుంది. ఈ గొడవలు రేపడానికి ఒక మధ్యవర్తి బాగా కృషిచేసాడు.

అంతే… ఆ ఊరు భీకరమైన మార్పును సం తరించుకుంది… పోలీసుల రంగప్రవేశంతో బైరెడ్డి, కొండారెడ్డి మధ్య పగ కొద్ది రోజులు సద్దుమనిగింది. ఎవరెవరి పనుల్లో వారు బిజీగా గడపసాగారు. అనుకోకుండా ఒకరోజు… అర్థరాత్రి దాటాక చావుకేక పొలిమేర దాకా…వినపడింది. అంతే ఊరు ఒక్కసారిగా ఉలిక్కిపడిలేచింది… దెయ్యం… దెయ్యం… అంటే పరుగెడుతూ వస్తున్నాడు బైరెడ్డి అనుచరుడు నరసింహారెడ్డి. ‘‘ఏం జరిగిందిరా…’’ అడిగాడు బైరెడ్డి. ‘‘దె… దె… దెయ్యం’’ అం టూ స్పృహ తప్పి పడిపోయాడు.

అధికంగా దేవాలయాలు వున్న ఊరు కావ డం వలన. ఇంకా ఎన్నో పురాతన దేవాలయ కట్టడాలు శిథిలమై వున్నాయి… అలాంటి ఊరిలోకి దెయ్యాలు రావని కొందరు. ఒక సారి బైరెడ్డి వర్గంలోని వారు చినిపోతే… మ రోసారి కొండారెడ్డి వర్గానికి చెందినవారు చనిపోవడం అనుమానస్పదంగా వుందని కొంద రు… దివ్య, లోకనాథ్‌రెడ్డి… అర్దాయుష్యుతో చనిపోవడం వలన వారి ఆత్మలు ఇక్కడే తిరుగుతుంటాయని మరికొందరు… అనుకొం టుండగానే… బైరెడ్డి అనుచరుడు నరసింహారెడ్డి చనిపోయాడన్న సంగతి తెలిసి… ఊరు జనాల్లో భయ కంపనాలు మొదలయ్యాయి…
ఇలా ఊర్లో ఏం జరుగుతోందో అర్థం కాలేదు… ఏ న్యూస్‌ పేపర్‌ చదివినా ఫ్యాక్షన్‌తో ప్రాణాలు పోతున్నాయని. పెద్ద పెద్ద హెడ్డింగ్స్‌ రాసారు. కానీ అసలు ఏమీ జరుగుతున్నదో… ఎవరికి తెలియదు… అలా ఒక్కరు ఒకరుగా… ఊరు వదలి దూరంగా వెళ్ళిపో యారు. ఇప్పుడా ఊరు ఒంటరిదై పోయింది… గతం ముగించాడు ముసలాయన…

ముసలాడు చెప్పింది పూర్తిగా విన్న జర్నలిస్ట్‌… ‘‘వెళ్ళొస్తాను తాత…తరువాత కలు ద్దాం సరేనా..?’’ అంటూ లేచి అక్కడి నుండి కదిలాడు… ఊరికి దూరంగా ఒక చెట్టు కింద సేదతీరి… ఆలోచించాడు… బంగ్లాలో దొరికిన డైరీ… తీసి మరోసారి చదివాడు… అది బైరెడ్డి రాసుకున్న డైరీ. తన కూతురు దివ్య చనిపోగానే… ఒక్కగానొక్క కూతురు. తమ పగల వలన శాశ్వతంగా దూరమైందని… లో లోన కుమిలిపోయాడంట… అప్పట్నుండీ అ న్నింటికి దూరంగా వుంటూ వచ్చాడు..ఆ రో జు నుండి ఆ ఊరిలో ఫ్యాక్షన్‌ లేదు…అలాం టప్పడు నిష్కారణంగా మనుషులు ఎందుకు చస్తున్నారు…? ఈ పగలు ప్రతీకారాలకు… ఎవరో మధ్యవర్తి కారణమైవున్నాడు… ముస లాడు అతని గురించి స్పష్టంగా ఎందుకు చెప్పలేక పోయాడు…? చనిపోయిన ప్రేమికులు దెయ్యాలుగా మారారని పుకార్లు పుట్టిం చారు… ఎందుకు..? అందరూ ఊరు వదిలి ఎందుకు పారిపోయారు… ముసలాడు ఒక్కడే ఊళ్లో ఎందుకు వున్నట్లు…? ఇలా అనేక ప్రశ్నలు జర్నలిస్ట్‌ మెదడును తొలిచేస్తున్నాయి. పగలంతా ఊరి బయటే గడిపేసాడు.

రాత్రి పదిగంటలు దాటింది. నిశ్శబ్ద చీకటిలో కీచుమంటూ కీటకాల అరుపులతో భయంగా వుందా ప్రాంతం… ఐనా సరే ధైర్యంగా అడు గు ముందుకు వేసాడు జర్నలిస్ట్‌… సెల్‌ బ్యా టరీ వెలుగులో రోడ్డు స్పష్టంగా కనిపించకపోయినా మెల్లగా అడుగులు వేసాడు.
తిన్నగా ఊర్లోకి చేరుకున్నాడు. నిశ్శబ్దంగా అ డుగులు వేస్తూ… ముసలాడు వున్న గుడిసె దగ్గరగా వెళ్ళి ఆగాడు. రెండు కుక్కలు నాలుకలు చాపి, గుడిసె ముఖ ద్వారం మందు అటు ఇటు కూర్చుని వున్నాయి. ఇంటికి తాళం వేసి వుంది. ముసలాడు పగలు మాత్రమే ఇంట్లో వుంటున్నాడు… రాత్రి పూట ఎక్కడికి వెళుతున్నాడు? అనే అనుమానం కలిగింది జర్నలిస్ట్‌కు.
అక్కడినుండి తిన్నగా వెకక్కి వెళ్ళి… ఊరు నడిబొడ్డులోకి వచ్చి నిలబడ్డాడు. ఏమీ తోచలేదు అతనికి. అలాగే ముందుకు వెళ్ళాడు. ఊరి బయట మర్రిచెట్టు కింద రెండు సమాధులు కనిపించాయి. వెళ్ళి కూర్చున్నాడు. ఆ వాతావరణం చాలా భయంగా వుంది. అంతలోనే.. ఘల్‌… ఘల్‌… అంటూ ఎక్కడినుంచో శబ్దం వినపడేసరికి… ఉలిక్కిపడి లేచాడు. ‘‘కొంపదీసి దెయ్యం కాదు కదా…’’ అనుకొంటూ ఎలాగో ధైర్యం చేసి ఆ శబ్దం వస్తున్న వైపుకు మెల్లగా కదిలాడు.

కాళ్ళకు మొటికరాయి తగిలి పడబోయిన జర్నలిస్ట్‌ నిలవరించుకున్నాడు. బ్యాగులో వున్న వాటర్‌ బాటిల్‌ తీసి, తాగి, ముందుకు కదిలాడు. ఆ శబ్దం ఇంకా ఎక్కువగా వినిపించింది. కంపచెట్లు దాటుకొని ముందుకు వెళ్ళగానే… వెళ్తురు కనిపించింది. ఇక ఆలస్యం చేయలేదు. ఆ వెలుతురులో నలుగురు మనుషులు ఏదో తవ్వుతున్నట్టు స్పష్టంగా కనిపించింది.
వారికి కనిపించకుండా… చెట్ల దాపున దగ్గరికి వెళ్ళాడు ఆశ్చర్యం..! అక్కడ నలుగురు బలాడ్యులతోబాటు, ముసలాడు కూడా వున్నా డు. దేవాలయం ముందు పెద్ద గరుడస్తం భం.. దాని చుటూట ముగ్గులు వేసి, అక్షిం తలు, నిమ్మకాయలు మంత్రించి పెట్టినట్లు వున్నారు. బహుషా… గుప్తనిధులకై వీరు ప్రయత్నం తీవ్రంగా చేస్తున్నట్లు వుంది.

ముసలోడి నిజస్వరూపం చీకట్లో బయటపడింది… తిన్నగా సెల్‌ ఓపన్‌ చేసి, పోలీసులకు సమాచారం అందించాడు జర్నలిస్ట్‌… అంతే నిశ్శబ్దంగా అక్కడికి చేరుకున్న పోలీసులు వా రిని అదుపులోకి తీసుకున్నారు. ముసలోడు అసామాన్యుడు…ఆ ఊర్లో గుప్త నిధులు పుష్కలంగా దొరుకుతాయని… తన తంత్ర విద్యలతో తెలుసుకొని… ప్లాన్‌ ప్రకారం ఊర్లో చి చ్చు పెట్టి ఖాళీ చేయించాడు. బైరెడ్డి, కొండారెడ్డి మధ్యన మధ్యవర్తిగా వుండి చిచ్చురేపా డు. దివ్యను, లోకనాథ్‌రెడ్డి ప్రేమ, పగల పేరు తో చంపించాడు. వాళ్ళే దెయ్యాలుగా మారి జనాలని చంపుతున్నారని పుకార్లు పుట్టించా డు… చేతబడులతో కొంత మందిని పొట్ట నపెట్టుకున్నాడు. చివరికి పల్లెను పరుగులు పెట్టించాడు… గుప్తనిధులకు ఎసరు పెట్టాడు.

చూడ్డానికి పేదవాడుగా కనిపిస్తున్నా… తన ఖాతాల్లో లక్షల డబ్బు టర్నోవర్‌ అవుతున్నాయని తెలిసి, పోలీసులు నెవ్వెరబోయారు… ముసలోడు, ఆయన కొడుకులు ఒకప్పుడు నిరుపేదలు. ఊరు పాడుపడ్డాక షావుకార్లుగా ఎదిగిపోయారు.
శ్రమకు ఓర్చుకొని, క్లిష్టమైన సమస్యను బ యటికి లాగి, తిరిగి ఆ ఊరికి పునర్జన్మ కల్పిం చిన జర్నలిస్ట్‌కు అవార్డు లభించింది. ఇప్పుడు ఆ పల్లె ఒంటిరిది కాదు… పారిపోయిన వారు ధైర్యంగా రావడంతో మళ్ళీ పచ్చదనం పుంజుకుంది… కోడి కూత పెట్టింది… స్వేచ్ఛగా…

– నరెద్దుల రాజారెడ్డి,
సెల్‌: 96660 16636

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top