You Are Here: Home » ఇతర » ఏ వైద్యం మంచిది..

ఏ వైద్యం మంచిది..

ఈ ప్రశ్న చాలామందికి వస్తుంది. ఒకళ్ళు ఇది మంచిదంటే మరొకరు అది మం చిది అంటూంటారు. మనకి వెైద్య విధానాల్లో అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేదం, యునానీ వంటి వెైద్యాలు చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఏ వెైద్య చికిత్స మంచిదీ అనే సంశయం చాలామందికి వస్తుంది.

2filler ఇప్పుడు ఆయుర్వేదం చాలా ప్రాబల్యంలో ఉంది. అలాగే ఇంగ్లీషు మందులు వెంటనే ఉపశమనాన్ని ఇస్తూ వుంటాయి. అదే విధంగా హోమియోపతిని కూడా ఎక్కువమంది నమ్ముకుంటారు. యునానీ వెైద్యంలో సిక్కులు దిట్టలని చెప్పవచ్చు. హస్తవాసి ఉన్న వెైద్యుడు ఏ మందిచ్చినా అమృతంలా పనిచేస్తుందని ఒక నానుడి. ఎవరు ఏ వెైద్య విధానాన్ని అనుసరిద్దామనుకున్నా, ఏ ఔషధాన్ని వాడదామనుకున్నా ముఖ్యంగా రోగికి ఉండవలసినది నమ్మకం. ‘బిలీఫ్‌ ఈజ్‌ రిలీఫ్‌’ అంటారు అందుకే. వెైద్యుని మీద ఉన్న నమ్మకమే సగం రోగం తగ్గిస్తుంది. తెలియని డాక్టర్‌ దగ్గరకి వెళ్ళి అనుమానంతో వాడే మందులు త్వరగా పనిచేయవు. సరికదా ఆ నెపం వెైద్యుడి మీద తోసేస్తాం.

ఒక వెైద్యుడు జ్వరానికి మందు ఇస్తే తగ్గలేదంటాం. అదే వెైద్యుడు మరొకరికి కూడా జ్వరానికి మందిస్తాడు అతడికి తగ్గిపోతుంది. ఈ తేడా ఎక్కడుంది. మన నమ్మకంలోనే ఉంది. కనుక మీరు ఏ రకమైన వెైద్యానికి అలవాటు పడినా ముందుగా ఆ డాక్టరు మీద విశ్వాసంతో వెళ్ళండి. వెంటనే ఉపశమనం ఉంటుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top