You Are Here: Home » చిన్నారి » ఏసుక్రీస్తు ఏ భాషలో మాట్లాడేవాడు?

ఏసుక్రీస్తు ఏ భాషలో మాట్లాడేవాడు?

‘నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుడి’ అనే మాటలు వినగానే మనకు ఏసుక్రీస్తు బోధనలు గుర్తొస్తాయి. కాని ఏసుక్రీస్తు తన బోధనల్ని ఏ భాషలో బోధించారనేది చాలామందికి తెలియదు. ఏసుక్రీస్తు తన బోధనలు ఏ భాషలో చేశారో చూద్దాం!

ఏసుక్రీస్తు మాట్లాడిన భాష చాలామంది అనుకున్నట్లుగా హీబ్రూ కాదు. ఆయన జీవించిన కాలంలో పాలస్తీనా ప్రాంతపు ప్రజలు అరామిక్ భాష మాట్లాడే వారు. అరామిక్ భాష అంటే అరబ్బులు మాట్లాడుకునే అరబిక్ భాష కాదు. హీబ్రూ భాషకు అరామిక్ భాషకు దగ్గర పోలికలు ఉంటాయి.

అయినంత మాత్రాన మనం వాటిని ఒకే భాషగా భావించకూడదు. ఏసుక్రీస్తు జీవించిన కాలంలో ఇజ్రాయిలీలకు అరామిక్ అనే భాష వాడుకలో ఉండేది. అందుకనే నూతన నిబంధన అరామిక్ భాషలో రచించారు. ఆ తర్వాత అరామిక్ భాష నుంచి గ్రీకు భాషలోనికి అనువాదం చేశారు. అలాగే పాత నిబంధన గ్రంథాన్ని హీబ్రూ భాషలోనే రాశారు. ఆ కాలంలో ఇజ్రాయిలీలు హీబ్రూ భాషలోనే మాట్లాడుకున్నారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top