You Are Here: Home » ఇతర » ఏలియన్స్‌ ప్రమాదకరమే…

ఏలియన్స్‌ ప్రమాదకరమే…

మానవ ఉనికి గురించి గ్రహాంతర జీవులకు తెలియనివ్వడం సరికాదని వ్యాఖ్యానించారు నోబెల్‌ గ్రహీత బ్రియాన్‌ పి స్మిట్‌. చైనాలో జరుగుతున్న 28వ అంతరిక్ష సమా ఖ్య సదస్సులో ఆయన మాట్లాడుతూ ‘గ్రహాంతర జీవులను ఎదుర్కొని పరిచయం పెంచుకోవడం మనకు అంత సంతోషాన్ని ఇవ్వకపోవచ్చు. అందుకే మన జాడను వాటికి తెలియజేడయం మంచిది కాదు’ అని వివరించారు. అంతులేని విశ్వం ఆగకుండా వ్యాప్తి చెందుతోందని నిరూపించిన బ్రియాన్‌ నోబెల్‌ ప్రైజ్‌ను సాధించారు.

alienగ్రహాంతర జీవులతో ఇప్పుడు మనకొచ్చిన ప్రమాదమేమీ లేదు. నిజానికి అంతరిక్షంలో ఒక చోటు నుంచి మరో చోటుకు ప్రయాణించడానికి ఏళ్ళ సమయం పడుతుంది. అయితే వాటిని ఎదుర్కొవా ల్సిన సమయం వచ్చినప్పుడు తప్పదు. ఇప్పటికైతే ఎలాంటి దిగులు లేదు వివరించారు. నిజానికి బ్రియాన్‌ ఆవిష్కరణ కు ముందు విశ్వం మెల్లిగా వ్యాప్తిస్తుందని భావించారు.అనంత విశ్వంలోని డార్క్‌ ఎనర్జీ ప్రతీ పాలపుంతని వేరుచేస్తూ విశ్వం శరవేగంతోవ్యాపింప చేస్తుందని నిరూపిం చారు. ‘ఈ ఆవిష్కరణతో ఒక్కటి మాత్ర స్పష్టమైంది. విశ్వ విస్తరిస్తున్న కొద్ది పాలపుంతల మధ్య దూరం మరింతగా పెరుగుతోంది. ఇంతకు ముందు మనమ నుకున్న దూరం మరింత పెరగవచ్చు. దీంతో గ్రహంతర జీవుల వేట మరింత కష్టమవ్వవచ్చు. అసలు వాటి జాడ కనుక్కోలేకపోవచ్చు కూడా.

నిజానికి ఇలాంటి అన్వేషణ ఒక కొలిక్కి రావడం విశ్వంలోనే అరుదైన విషయం. అని వివరించాడు . బ్రియాన్‌ అభిప్రాయం ప్రపంచాన్ని విస్మయానికి గురిచేశాయి. ఇంత కాలం ఎక్కడో..ఎదో చోట మనలాంటి ప్రాణులు ఉండే ఉంటాయి అనే ఆశకు ఆయన వ్యాఖ్యాలు అడ్డుకట్టవేశాయి. ‘మానవ జాతి గ్రహాంతర జీవులతో జాగ్రత్తగా ఉండాలి. వాటివల్ల ప్రమాదం ఉండే అవకాశం లేకపోలేదు. వాటి టో సంప్రదింపులు చేయడం రిస్క్‌తో కూడుకున్నపని అని’ 2010లో ప్రపంచ ప్రసిద్ధ థియరాటికల్‌ ఫిసిటిస్ట్‌ స్టీఫెస్‌ హాకింగ్స్‌ అభిప్రాయం కూడా అప్పట్లో సంచలనాన్ని సృష్టించాయి.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top