You Are Here: Home » సఖి » అందం » ఏరోబిక్స్‌

ఏరోబిక్స్‌

వ్యాయామాలు ప్రధానంగా రెండు రకాలుగా విభజించవచ్చు. అవి-ఎయిరోబిక్స్‌, ఎనరోబిక్స్‌. ఎయిరోబిక్స్‌ ప్రక్రియలో మనిషి గాలిని ఎక్కు వగా పీల్చుకుంటాడు. జాగింగ్‌, వేగంగా నడ వడంవంటివన్నీ ఈ విధానంలోకి వస్తాయి. ఎన రోబిక్స్‌లో బరువులు ఎత్తడం (వెయిట్‌ లిఫ్టింగ్‌) వంటి వ్యాయామాలు వస్తాయి. వీటిలో ఊపిరిని బిగబట్టి బరువులను ఎత్తడం జరుగు తుంది. అంటే గాలిని పీల్చుకోవడం ఎనరో బిక్స్‌లో తక్కువగా ఉంటుంది.
శరీరాన్ని అలసటను లేదా ఒత్తిడి తట్టుకుని నిలిచేలా చేయగలిగే వ్యాయామం జాగింగ్‌. జాగింగ్‌ ఎయిరోబిక్‌ వ్యాయామ ప్రక్రియ. ఎయి రోబిక్‌ ప్రక్రియల్లో మనం ఎంత గాలిని పీల్చు కుంటామో అంత ఉపయోగం ఉంటుంది. దీని వలన శరీరంలో శక్తి వినియోగమవడమే కాక, అంతకు మించిన శక్తి కొత్తగా ఉద్భవిస్తుంది.
అలవాటు లేని వారు పరుగెత్తాల్సి వచ్చిన ప్పుడు విపరీతమైన ఆయాసం వస్తుంది. క్రమం తప్పకుండా జాగింగ్‌ చేయడంవలన శరీరం ఇటు వంటి వాటికి తట్టుకోగలుగుతుంది. ఆయాసం రాకుండా అదుపులో ఉంచుతుంది.
అంటే జాగింగ్‌ వలన గుండెపై పడే భారం తగ్గుతుంది. తద్వారా గుండె మరింత ఆరోగ్య వంతంగా ఎక్కువకాలం పని చేయడానికి అవ కాశం ఉంటుంది. ఉదాహరణకు క్రీడాకారులు పరుగెత్తినప్పుడు వారి నాడి 40 సార్లు కొట్టు కుంటే, పరుగెత్తడం అలవాటు లేని వారి నాడి 80 సార్లు కొట్టుకుంటుంది. అంటే గుండె ఆ స్థాయిలో పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుం దన్నమాట. జాగింగ్‌ దీనిని నివారిస్తుంది.
ఈ ప్రక్రిను ఆరుబయలు ప్రదేశాల్లో చేయడం  ద్వారా మనసులో అలజడి తగ్గుతుంది. మాన సిక ప్రశాంతత కలిగి శరీరం కొత్త ఉత్సాహం పుంజుకుంటుంది. జాగింగ్‌ చేయడానికి ప్రత్యే కమైన సదుపాయాలు, వస్తువులు అవసరం లేదు. కేవలం సౌకర్యవంతంగా ఉన్న బూట్లను సిద్ధం చేసు కుంటే చాలు. సౌకర్యవంతంగా లేని బూట్ల వాడకం వలన జాగింగ్‌ చేస్తున్న సమ యంలో బాధతోపాటు కాలి బెణుకులు, లేదా కీళ్లకు సంబంధించిన ఇతర బాధలకు గురి కావచ్చు. అందువలన జాగింగ్‌ను చేపట్టదలచిన వారు బూట్ల అడుగు భాగం (సోల్‌) మెత్తగా ఉండి, పరుగుపెట్టినప్పుడు శరీర బరువును తట్టుకుని ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఉండే నాణ్యమైన వాటిని ఎంపిక చేసి కొనుగోలు చేయాలి.
జాగింగ్‌ సమయంలో ధరించే దుస్తులు కూడా వాతావరణ పరిస్థితులను తట్టుకుని శరీరాన్ని కాపాడగలిగే విధంగా ఉండాలి. జాగింగ్‌ సమ యంలో శరీరంనుంచి వెలువడే చెమటను పీల్చు కుని, సూర్యరశ్మిలోని వేడిని శరీర భాగాలకు అంతగా తాకకుండా ఉండే దస్తులను ధరించాలి.
జాగింగ్‌ సమయంలో శరీరం రిలాక్స్‌డ్‌గా ఉండాలి. నడుము పైభాగం వీలైనంత వరకూ నిటారుగాఉంచి, కొంచెంముందుకు వంగి ఉండాలి. వెన్నెముకకు సమాంతరంగా నిటారుగా తల భాగాన్ని ఉంచాలి. అందువలన 30 లేదా 40 అడుగుల ముందు భాగాన్ని స్పష్టంగా చూడ గలిగి ఎలాంటి అడ్డంకులు ఉన్నా దాటవచ్చు.
కాళ్లు ముందుకు వెనుకకు వేసే సమయంలో వాటి కదలికకు వ్యతిరేక దిశలో మోచేతులు ‘లంబకోణం పద్ధతిలో వంచి నడక సాగించాలి. మోచేతులు శరీర భాగానికి అతుక్కునేట్లు ఉంచి, కదలిక ముందుకు వెనక్కు సాగేట్లు చూడాలి.
ముంజేయి ముందుకు వచ్చినప్పుడు ఛాతీకి సమాంతరంగా ఉండే ఎత్తు వరకూ ఊపాలి. వెనకకు వచ్చినప్పుడు నడుము పైభాగానికి చేరేట్లు ఊపాలి. చేతులు ఊపేటప్పుడు పిడికిలిని పూర్తి గానూ, లేదా సగం వరకూ మూసి ఉంచాలి. అంతేకాని గట్టిగా బిగించి ఉంచకూడదు.
పరుగుపెట్టేటప్పుడు పాదం వెనుక భాగం మొదట భూమిని తాకాలి. తరువాత మిగతా పాదం భాగం పూర్తిగా భూమిపై ఆనించాలి. పాదం ముందు భాగం పరుగెడుతున్న దిశవైపే ఉండాలి. ముందు భాగానికి వచ్చిన కాలి మోకాలు వద్ద కొంచెం వంగి ఉండేటట్లు జాగ్రత్తపడాలి. ఎందుకంటే మోకాలు ముందుకు తీసుకురావడం వలన శరీరంలో ఏర్పడే ఇంపాక్ట్‌ వేవ్స్‌ భారం కీళ్ల భాగాలపై ఊండి కీళ్లకు హాని కలుగవచ్చు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top