You Are Here: Home » సఖి » ఏక్‌ దిన్‌ కా ఎంప్లయీ

ఏక్‌ దిన్‌ కా ఎంప్లయీ

BYఏక్‌ దిన్‌ కా సుల్తాన్‌ కథ అందరికీ తెలిసిందే. రాజు బాధ్యతలు ఎలాంటివో తెలుసుకోవాలంటే సింహాసనం అధిష్ఠించాల్సిందే. అలాగే తండ్రి విధి నిర్వహణ ఎలా ఉంటుందో పిల్లలు తెలుసుకోవాలంటే వాళ్ళూ ఒక రోజు ఆఫీస్‌కు వచ్చి తండ్రి చేసే పనులు చూడాల్సిందే. ఇలాంటి పనినే ఓ కంప్యూటర్‌ రంగ సంస్థ చేస్తే పిల్లల్లో సృజనాత్మకత మరింత పెరిగే అవకాశం ఉంది. మైక్రోసాఫ్ట్‌ ఇండియా సరిగ్గా ఇలాంటి పనే చేసింది. ఆ సంస్థ శుక్రవారం నాడు హైదరాబాద్‌, బెంగళూరు, ఢిల్లీలలోని తన కార్యాలయాల్లో ‘బ్రింగ్‌ యువర్‌ చెైల్డ్‌ టు వర్క్‌’ కార్యక్రమాన్ని నిర్వహించింది.

BYCదేశవ్యాప్తంగా సుమారు 2100 మంది మైక్రోసాఫ్ట్‌ కిడ్స్‌ ఈ కార్యక్రమంలో పాల్గొంటే, హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో సుమారు 1200 మంది పాల్గొన్నారు. సంస్థ ఈ తరహా కార్యక్రమాన్ని నిర్వహించడం ఇది ఆరోసారి. ఈ సందర్భంగా పిల్లల కోసం పలు వినోద కార్యక్రమాలను, ఆటలపోటీలను నిర్వహించారు. చిన్నారుల్లో సాంకేతికత, వినూత్నతలపెై అవగాహన పెంచేందుకు మైక్రోసాఫ్ట్‌ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. నూతన టెక్నాలజీలను తెలుసుకునేందుకు, వాటిని ఉపయోగించేందుకు ఇది చిన్నారులకు అవకాశం కల్పిస్తుంది. జీవితానికి, ఆఫీస్‌ పనికి మధ్య సమతుల్యం ఉండేలా చూడడానికి మైక్రోసాఫ్ట్‌ ప్రాధాన్యం ఇస్తోంది. అలాంటి కార్యక్రమాల్లో భాగంగా దీన్ని నిర్వహించారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top