You Are Here: Home » ఇతర » ఏక్తా టైగర్‌లో భిన్నమైన పాత్ర – బాలీవుడ్‌ నటి కత్రినాకైఫ్‌

ఏక్తా టైగర్‌లో భిన్నమైన పాత్ర – బాలీవుడ్‌ నటి కత్రినాకైఫ్‌

kat1నటుడు సల్మాన్‌ఖాన్‌తో కలిసి నటించిన ‘ఏక్తాటైగర్‌’ చిత్రంలో విభిన్న పాత్రలో కనిపించనున్నట్లు బాలీవుడ్‌ నటి కత్రినాకైఫ్‌ చెప్పారు. సల్మాన్‌తో కలిసి నటించిన ఈ చిత్రం స్వాతంత్య్ర దినోత్సవమైన ఆగస్టు 15న ప్రేక్ష కుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర బాలీవుడ్‌ నటి కత్రినాకైఫ్‌ హైదరాబాద్‌ బషీర్‌ బాగ్‌లో ఉన్న గీతాంజలి జ్యుయలర్‌ షోరూమ్‌ను సందర్శించారు. అలాగే సోమాజిగుడలోని షోరూమ్‌లో వెడ్డింగ్‌ కలెక్షన్‌ను ప్రారంభోత్సవంలోనూ, జూబ్లీహిల్స్‌ లోని గీతాంజలి షోరూమ్‌ వార్షికోత్సవ వేడుకల్లో సందడి చేశారు. చికినీ చమేలీ అంటూ పాటకు చేసిన నృత్యంతో కోట్లాదిమంది అభిమానుల హృదయాలను కొల్ల గొట్టిన బాలీవుడ్‌ భామ కత్రినా కైఫ్‌ హైదరాబాద్‌ లోని మూడు కార్యక్రమాల్లో పాల్గొని సందడి చేయడంతో ఆమెను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

ప్రపంచంలోని ప్రముఖ అంతర్జాతీయ మల్టీబ్రాండ్స్‌ అభరణాల కంపెనీలైన నక్షత్ర, ఆస్మి, జిల్లీ, డిడమాస్‌, పర్ణీత, దివ్య, సరంగి, మాయగోల్డ్‌, నిజామ్‌ కలెక్షన్‌ వంటి ప్రముఖ కంపెనీ ఆభరణాలు తమ వద్ద లభ్య మవుతాయని గీతాంజలి జ్యూవెల్లర్సీ కంపెని మేనేజింగ్‌ డైరక్టర్‌ శ్రీవత్స తెలిపారు. నేటి రోజుల్లో వినియోగ దారులు బ్రాండెడ్‌ జ్యుయలరీ వైపు ఆకర్షితులవున్నారని, ఈ ఆభరణాలకు మంచి డిమాండ్‌ ఉందని పేర్కొన్నారు. బషీర్‌బాగ్‌లోని గీతాంజలి షోరూమ్‌ భారతదేశంలోని అతిపెద్ద 75వ షోరూమ్‌గా, దక్షిణ భారతదేశంలో 13వ షోరూమ్‌గా, హైదరాబాద్‌లో 3వ షోరూమ్‌గా వినియోగదారులకు సేవలు అందిస్తోందని తెలిపారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top