You Are Here: Home » ఇతర » ఎవరెస్ట్ కన్నా ఎత్తులో బారతీయ వనితలు

ఎవరెస్ట్ కన్నా ఎత్తులో బారతీయ వనితలు

పూర్తిగా మంచుతో కప్పబడి ఉండే మౌంట్‌ ఎవరెస్ట్‌ను అధిరోహించాలని కలగనే వారు అనేకం. ఆ కలను నెరవేర్చుకునే ధైర్యం, ధృఢ సంకల్పం ఉన్నవారు మాత్రం తక్కువే. అందుేక 8848 మీటర్ల ఎత్తులో ఉండే ఈ శిఖారాన్ని అధిరోహించే వారెవరైనా కచ్చితంగా అంతర్జాతీయ గుర్తింపు సాధిస్తారు. వారి సాహస గాథలు కూడా వేలాది మందిని ప్రేరణనందిస్తారుు. మనదేశానికి చెందిన బచేంద్రిపాల్‌ ఈ కీర్తి శిఖరాన్ని అధిరోహించినప్పుడు యావత్‌ భారతం హర్షించింది. అనంతరం సంతోష్‌ యాదవ్‌ ఏకంగా రెండుసార్లు భారత పతాకాన్ని ఎగురవేశారు. ఇటీవలే భారత సైన్యానికి చెందిన దీపికా రాథోడ్గ ఈ శిఖరంపై త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేసిన తొలి రాజస్థానీ మహిళగా రికార్డు సృష్టించారు.

ప్రొఫైల్

పూర్తి పేరు 	: బచేంద్రి పాల్‌
పుట్టిన సం : 1954
జన్మస్థలం : భారతదేశం
వృత్తి : పర్వతాధిరోహకురాలు
ఘనత : ఎవరెస్ట్‌ అధిరోహించిన తొలి భారతీయ
మహిళ (2004)

bacha1984 మే 17న ఎవరెస్ట్‌ పర్వతాన్ని అధిరోహించిన తొలి భారతీయ వనిత బచేంద్రిపాల్‌ చరిత్ర సృష్టించారు. పర్వతాధిరోహన క్రమంలో తన టీమ్‌తో ముందుకు వెళ్తున్న సమయంలో ఒక అవలాంచ్‌ బారీ నుంచి బయట పడటం ఏ హాలీవుడ్‌ చిత్ర దృశ్యానికి తగ్గింది కాదని ఒక సందర్భంలో బచేంద్రి పాల్‌ వివరించారు. నేటికీ దేశ విదేశాల్లో పర్వతారోహన సమావేశాల్లో, శిక్షణ కార్యక్రమాల్లో గౌరవ అతిథిగా పాల్గొంటుంది బచేంద్రిపాల్‌.

ప్రస్థానం
ఆమె పిన్న వయస్సులోనే గంగోత్రి (21900 అడుగులు), రుడుగరియ (19091 అడుగులు) పర్వతాలను అధిరోహించారు. అదే కాలంలో ఆమె జాతీయ సాహస ఫౌండేషన్‌లో ఇన్‌స్ట్రక్టర్‌గా బాధ్యతలను చేపట్టారు. పర్వతాలను అధిరోహించానుకునే మహిళలకు ట్రైనింగ్‌ఇచ్చేందుకు ఈ ఫౌండేషన్‌ ఏర్పడింది. 1984లో బచేంద్రిపాల్‌ 84 ఎవరెస్ట్‌ ఎక్స్‌పడిషన్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎతె్తైన శిఖరం ‘ఎవరెస్ట్‌’ను అధిరోహించారు.

ప్రొఫైల్

పూర్తి పేరు 	: సంతోష్‌ యాదవ్‌
పుట్టిన సం : 1969
జన్మస్థలం : జెైపూర్‌
వృత్తి : పర్వతాధిరోహకురాలు
అవార్డు : పద్మశ్రీ

ఒకే ఏడాదిలో ఎవరెస్ట్‌ శిఖరాన్ని రెండుసార్లు అధిరోహించిన ధీర వనిత సంతోష్‌ యాదవ్‌. పర్వతాధిరోహకురాలిగా అనేక రికార్డులు ఆమె సొంతం. కాంగ్‌షంగ్‌ ముఖభాగం నుంచి ఎవరెస్టు పర్వతంపెై చేరిన తొలి మహిళ కూడా ఆమె కావడం దేశానికే గర్వకారణం. 1992లో తొలి సారి ప్రపంచంలోనే ఎతె్తైన శిఖరం ఎవరెస్టును అధిరోహించి సరిగ్గా సంవత్సరం తర్వాత అంటే మే 1993లో మరోసారి ఈ ఫీట్‌ను చేసి అంతర్జాతీక ఖ్యాతినార్జించింది.

అధిరోహనే ఆసక్తిగా
santoaహర్యానాలోని రెవారి జిల్లాలో 1969లో జన్మించిన సంతోష్‌ జెైపూర్‌లో విద్యాభ్యాసాన్ని పూర్తి చేసింది. కస్తుర్బా మహిళా వసతి గృహంలో నివసించే సమయంలోనే ఉత్తరాక్షిలోని నెహ్రూ మౌటెనీరింగ్‌ విద్యాసంస్థలో చేరింది. ఆ సమయంలో వసతి గృహానికి సమీపంలో ఆరావలి పర్వతాలను, సమీపంలోనే గ్రామాలను గమనిస్తూ ఉండే సంతోష్‌కు అక్కడి గ్రామాలు మాయమవ్వడం ఆశ్చర్యం కలిగించేవి. దాంతో ఆమె అక్కడేం జరుగుతుందో తెలుసుకోవాలని నిర్ణయించుకుని వెళ్లగా కొందరు పర్వతాధిరోహకులు మాత్రమే కనిపించారు.

వారి సాహస యాత్రపెై ఆసిక్తి కలిగి వారిని అడగ్గా ఆ దళ సభ్యులు కూడా పర్వతాధిరోహనకు సహరిస్తాం అన్నారు. దీంతో కొంత సమయం తీసుకుని నెహ్రూ ఇన్‌స్టిట్యూట్‌లో పర్వతాధిరోహనపెై అవగాహన పెంచుకుని తన సాహక కృత్యాలను కొనసాగించింది. ప్రస్తుతం ఇండో- టిబెటన్‌ బార్డర్‌ పోలీస్‌ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రతిభను గుర్తించి భారత ప్రభుత్వం 2000లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.

ప్రొఫైల్

పూర్తి పేరు 	: దీపికా రాథోడ్‌
జన్మస్థలం : రాజస్థాన్‌
వృత్తి : భారత సైన్యలో కెప్టెన్‌,
పర్వతాధిరోహకురాలు

Deeaఎవరెస్ట్‌ శిరాన్ని అధిరోహించిన రాజస్థాన్‌కు చెందిన మహిళలా దీపికా రాథోడ్‌ రికార్డు పుటల్లోకెక్కింది. 8848 మీటర్లు (29,029 అడుగుల ఎతె్తైన) శిఖరాన్ని అధిరోహించే క్రమంలో దీపికా తన సైనిక బృంద సభ్యులతో కలిసి శుక్రవారం ఉదయం 5 గంటలకు ఎవరెస్ట్‌పెై త్రివర్ణ పతకాన్ని ఎగురవేసింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు సంతోషాన్ని నాగ్‌పూర్‌ వాసులతో కలిసి పంచుకున్నారు. కొన్ని సంవత్సరాల క్రితమే ఎవరెస్ట్‌ను అధిరోహిద్దామని దీపికా భావించినా ప్రతికూల వాతావరణం వల్ల కుదరలేదు. భారత సైన్యంలో కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న దీపికా ఈ ఘనతను సాధించి ఎంతో మంది మహిళలకు స్ఫూర్తి ప్రధాతగా అవతరించింది. రాజస్థాన్‌కు చేరిన వెంటనే ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వసుందరా రాజే శుభాకాంక్షలు తెలిపారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top