You Are Here: Home » చిన్నారి » కవితలు » ఎవరూ లేని పందిట్లో

ఎవరూ లేని పందిట్లో

ఇన్నేళ్ళుగా నువ్వక్కడే ఉంటున్నావు
పక్కింటివాళ్ళనెప్పుడెైనా
పరిచయం కోసం పలకరించావా?
దగ్గరవ్వడానికి చనువుగా నవ్వి
బంధువులా కలిసిపోయావా?

ఆటల్లో దెబ్బలాడుకొని అమాయకంగా ఏడ్చుకుంటూ
మీ గేటు ముందు ఆగిపోయిన
ఆ వీధిలో ఉండే చిన్నపిల్లలను
ప్రేమగా పిలిచి ముద్దు చేశావా?

దూరాన కనిపించిన మిత్రునికి
మురిపెంగా ఎదురుగా వెళ్ళి
కరచాలనంతో మైమరిపించావా?
క్షణాలు పంచుకోవడానికి మధురంగా మాటలు పెంచి
కాసేపు కలిసి ఉండాలని మనసులో ఉబలాటపడ్డావా?
చాయి తాగే నెపంతో ఎప్పుడో కూర్చున్న మూలకు చేరి
జ్ఞాపకాలను కలబోసుకోవడానికి

ఇరానీ హోటల్‌కు లాక్కెళ్ళావా?
విందుల్లో కలిసినపుడు
రద్దీలో దాగుండకుండా
పక్కపక్కనే ప్లేట్లు పట్టుకొని
కొసరి కొసరి యోగక్షేమాలడుక్కొని
కలగన్నంతగా తృప్తి పడ్డావా?

ఇవన్నీ మంత్రముగ్ధుల్ని చేసే
తీయ తీయని సందర్భాలు
ప్రయాణంలో దీపాలు వెలిగించే
మానవ సంబంధాలు
మనిషి బతకడానికి చిటికెడు ప్రేమ
చిటికెనవేలు తోడు

ashea-rajuసువాసనలు వెదజల్లే స్నేహం దొరికితే చాలు!-
చిన్నప్పుడు అమ్మతో నడిచినట్టు
నిర్భయంగా నిర్మలంగా గడిపేయవచ్చు
చుట్టూ ఉన్న వాళ్ళను దూరొం కొట్టుకొని
ఉన్నవన్నీ కూడగట్టుకొని ఎవరూ లేని పందిట్లో
సన్నాయి లేని సందడిలా సంబరాలు సంతోషాన్నివ్వవు !

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top