You Are Here: Home » దైవత్వం » ఎవరు ఎంత…

ఎవరు ఎంత…

నేటి యాంత్రిక జీవన విధానంలో ప్రతిఇంటా పఠించవలసిన భగవద్గీత పారాయణం చేయడం చాలా మందికి వీలుపడని విషయం. అందుకే కనీసం రోజుకి రెండు గీతా శ్లోకాలు చదివితే జీవిత పరమార్ధం, గీతార్ధం అందరికీ అవగతమౌతాయి.

శ్రీమద్భగవద్గీత- ప్రధమోధ్యాయం-అర్జున విషాధయోందృతరాష్ట్ర ఉవాచ.
dialogaశ్లోకంః ధృష్టకేతు శ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్‌
పురుజిత్‌ కుంతిభోజశ్చ శైభ్యశ్చ నరపుంగవః

ఆచార్యా! ఇంకా ధృష్టకేతువు, చేకితానుడు, మహాపరాక్రమశాలి అయిన కాశీరాజు, పురుజితుడు, కుంతిభోజుడు, పురుషశ్రేష్టుడైన శైభ్యుడు యుద్ధం రంగంలో నిలిచివున్నారు చూడుడు.
శ్లోకంః యుధామనుశ్చ విక్రాంన్తః ఉత్తమౌజా శ్చ వీర్యవాన్‌
సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః

యుధామన్యుడిని మించిన వీరుడు లేడు. ఉత్తమౌజుడు గొప్ప పరాక్రమశాలి. సుభద్ర కుమారుడు అభిమన్యుని సంగతి వేరే చెప్పనవసరంలేదు. ద్రౌపది కుమారులైన ప్రతివింద్యుడు, శ్రుతసోముడు, శ్రుతకీర్తి, శతానీకుడు, శ్రుతసేనులు వారికి సాటి వారే. వీరందరూ మహారథులై ఈ యుద్ధరంగంలో నిలిచారు చూడు..

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top