You Are Here: Home » ఇతర » ఎల్‌జీ ఇండియా నూతన ఎయిర్‌ కండిషనర్లు

ఎల్‌జీ ఇండియా నూతన ఎయిర్‌ కండిషనర్లు

దేశ అత్యంత విశ్వసనీయ కన్సూమర్‌ డ్యూర బుల్‌ బ్రాండ్‌ అయిన ఎల్‌జి ఎలక్ట్రానిక్స్‌ ఇండియా రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని నూతన శ్రేణి ఎయిర్‌ కండిషనర్లను మార్కెట్లోకి విడుదల చేసింది. వినియోగదారులకు ఆరోగ్యదా యక జీవితాన్ని అందించేలా స్వచ్ఛమైన, పరిశుభ్ర మైన గాలి ఇచ్చేలా ఇవి రూపుదిద్దుకున్నాయి. ఈ నూతన శ్రేణి ఎయిర్‌ కండిషనర్లు అత్యంత ఆధునా తన ఇన్వర్టర్‌ వి టెక్నాలజీతో తయారయ్యాయి. 60శాతం వరకు ఇంధన సామర్ధ్యం అందించేలా ఇవి రూపుదిద్దుకున్నాయి. ఇవి 30 అడుగుల ఎత్తు వరకు ఎయిర్‌ఫ్లో అందిస్తాయి. 4వే సెలక్టబుల్‌ స్వింగ్‌ వినియోగదారులకు సౌఖ్యాన్ని అందించేలా గది నలుమూలలా చల్లదనాన్ని అందిస్తుంది. అడ్వాన్స్‌డ్‌ ప్లాస్‌మాస్టర్‌ అయొనైజర్‌ అండ్‌ ఆటో క్లీన్‌ ఫీచర్‌ ద్వారా 99. 9 శాతం వరకు స్వచ్ఛమైన గాలిని అందిస్తుందని ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్ట్‌ సూన్‌ క్వాన్‌ తెలిపారు. నూతన శ్రేణితో 2013 చివరికల్లా మార్కెట్లో తమ వాటా 25 శాతం పెంచుకోవాలన్న లక్ష్యంతో ఉన్నట్లు వివరించారు.
Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top