You Are Here: Home » సినిమా » పాటలు » ఎలా ఎలా ఎలా ఎలా

ఎలా ఎలా ఎలా ఎలా

చిత్రం : పంజా (2011)
తారాగణం : పవన్ కళ్యాన్,పారస్ జైన్
రచన : చంద్రబోస్
సంగీతం : యువన్‌శంకర్‌రాజా
గానం : శ్వేతా పండిట్

పల్లవి :

ఎలా ఎలా ఎలా ఎలా
నాలో కళ చూపేదెలా
ఎడారిలో గోదారిలా
నాలో అల ఆపేదెలా
ఈ మాయని నమ్మేది ఎలా
ఈ మాటని చెప్పేదెలా
నీ పరిచయంలోన పొందా
జన్మ మరల…॥ఎలా॥

చరణం :

నిన్నలోని నిమిషమైనా
గురుతురాదే ఈ క్షణం
నీటిలోని సంబరాన
ఉరకలేసే జీవనం
ఈ స్నేహమే వరం ఈ భావమే నిజం
ఇది తెలుపబోతే భాష చాల్లేదెలా…
నా భాషలోన తియ్యందనం
నా బాటలోన పచ్చందనం
పసిపాపలాగ నవ్వే గుణం
నీవల్లే నీవల్లే వెలిగింది నా నీడ
నీ నీడలోనే చేరాలనీ
నూరేళ్ల పయనాలు చేయాలనీ
ఈ పరవశంలోన నిలిచా
ప్రాణశిలలా ॥ఎలా॥



క్షణం క్షణం ప్రతిక్షణం
కోరే ధనం పచ్చందనం
నిజం నిజం నిరంతరం
మీరే కదా ఆరోప్రాణం
మీ బాధలే నే పంచుకోనా
మీ హాయినే హోయ్ నేర్పించనా
మన నవ్వుతో నవ్వుతుంది
ఈ ప్రపంచం
వస్తున్నా నేస్తం…
అందిస్తాలే నవ జీవితం (2

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top