You Are Here: Home » చిన్నారి » ఎలక్ట్రాన్‌ను కనుగొన్నది ఎవరు?

ఎలక్ట్రాన్‌ను కనుగొన్నది ఎవరు?

జోసఫ్ జాన్ థామ్సన్ 1856 డిసెంబర్ 18న ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌లో జన్మించాడు. ఈయనకి చిన్నతనం నుంచి పుస్తక పఠనం అంటే మక్కువ. కనిపించిన ప్రతి పుస్తకాన్ని విడవకుండా చదివేవాడు. దీన్ని గమనించిన తల్లిదండ్రులు జాన్ థామ్సన్‌కి ఇంజనీరింగే సరైనదిగా భావించి ఆయన్ని ఆ కోర్సులో చేర్పించారు. తన 19వ ఏటనే థామ్సన్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఆ తరవాత కేంబ్రిడ్జి యూనివర్సిటీకి వెళ్లాడు. ప్రయోగాలు చెయ్యకుండా శాస్ర్తాన్ని అర్థం చేసుకోలేమన్నది థామ్సన్ నమ్మకం.

ఆయన 1897లో పదార్థంలోని విద్యుత్ లక్షణాన్ని, తద్వారా ఎలక్ట్రాన్ ఉనికిని కనుగొన్నాడు. అప్పటి వరకూ వాడకంలో ఉన్న క్రూక్స్ ట్యూబ్‌ని అనుసరించి కాథోడ్ రే ట్యూబ్ అనే మరో పరికరాన్ని థామ్సన్ రూపొందించాడు. దాని ద్వారా ఉత్పన్నమయ్యే కాథోడ్‌లో కిరణం లేదు గానీ విద్యుత్ కలిగిన ‘పదార్థాలు’ ఉన్నాయని తెలిసింది. నెగిటివ్ చార్జ్ కలిగిన ఆ పదార్థాలనే ఇప్పుడు ఎలక్ట్రాన్లని అంటున్నాం. థామ్సన్ ఎలక్ట్రాన్ సాపేక్ష బరువుని కూడా కొలిచి, అది హైడ్రోజన్ అణువులో 2000వ వంతు ఉంటుందని తెలిపాడు.

సర్ జెజె థామ్సన్ 1906లో నోబెల్ పురస్కారాన్ని పొందారు. ఆ తర్వాత ఆయన శిష్యుల్లో ఎనిమిది మంది నోబెల్ బహుమతిని సొంతం చేసుకున్నారు. జె.జె. థామ్సన్ 1940లో మరణించాడు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top