You Are Here: Home » సినిమా » పాటలు » ఎరుపు లోలాకు కులికెను కులికెను

ఎరుపు లోలాకు కులికెను కులికెను

 చిత్రం : ప్రేమలేఖ (1996)
రచన : భువనచంద్ర
సంగీతం : దేవా
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
పల్లవి : ఎరుపు లోలాకు కులికెను కులికెను
ముక్కు బుల్లాకు మెరిసెను మెరిసెను

అమ్మమ్మా అందమే
ఏనుగెక్కి పోతుందే
కళ్లతో కొంటెగా సైగలేవో చేస్తుంది
రాజస్థానీ కన్నెపిల్ల వయసుకి
వన్నెలు వచ్చిన వేళ

చరణం : 1

మనసంతా మనసంతా
మరుమల్లెల పులకింత
వయసంతా వయసంతా
చిరు కవితల కవ్వింత

ఏ ఊరి చల్లగాలి ఈ ఊరికొచ్చెనమ్మా
ఒంటె మీదకెక్కి నన్ను
ఊరు చుట్టూ తిప్పెనమ్మా
ఏటిగట్టు ఊరిగట్టు
నన్ను చూసి పాడంగా
సంగతులు ఎన్నెన్నో
వంతులేసి చెప్పంగా
॥॥
చరణం : 2

ఆకాశం ఆకాశం ఈ సుందర ఆకాశం
బహుదూరం బహుదూరం
మనకందని నవలోకం

చుట్టి చుట్టి నన్ను చుట్టె
చక్కనైన తోకచుక్క
ముద్దు ముద్దు మాటలాడె
ముచ్చటైన పాలపిట్ట
అందాలే చిందెనులే
లేత నుదుటి కుంకుమలు
పగ్గాలే వేసెనులే
నీలి నీలి ముంగురులు
॥॥

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top