You Are Here: Home » చిన్నారి » స్ఫూర్తి » సందేశం » ఎడారుల విస్తరణను అడ్డుకుందాం!

ఎడారుల విస్తరణను అడ్డుకుందాం!

desertమానవుడు తాను చేసిన తప్పిదాలకు నేడు ఫలితం అనుభవిస్తున్నాడు. గ్లోబల్‌ వార్మింగ్‌, వాతావరణ మార్పులు లాంటి సమస్యలు భూగోళాన్ని చుట్టుముట్టాయి. ఎడారులు విస్తరిస్తున్నాయి. వర్షాభావం నెలకొంటోంది. ఎన్నో ప్రాంతాల్లో కరువు నెలకొంది. అలాంటి ప్రాంతాలు ఎడారీకరణ చెందుతున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ సమస్యపెై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఏటా ఐక్యరాజ్యసమితి జూన్‌ 17న ‘వరల్డ్‌ డే టు కంబాట్‌ డెజర్టిఫికేషన్‌ అండ్‌ డ్రాట్‌’ను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఎడారీకరణను నిరోధించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఆ రోజున విద్యార్థులకు పలు పోటీలు నిర్వహిస్తుంటారు. కేస్‌ స్టడీస్‌, అధ్యయన సదస్సులు జరుపుతుంటారు. తొలిసారిగా 1994 డిసెంబర్‌లో ఈ ప్రత్యేక దినం నిర్వహించడంపెై నిర్ణయం తీసుకున్నారు. ఎడారీకరణ సమస్య ప్రధానంగా ఆఫ్రికా ఖండంలో అధికంగా ఉన్నప్పటికీ, ఆసియాలోని భారత్‌ లాంటి దేశాలు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. మన రాష్ట్రంలోనూ అనంతపూర్‌, మహబూబ్‌నగర్‌ లాంటి జిల్లాలు తరచూ కరువు బారిన పడుతున్నాయి.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top