You Are Here: Home » యువ » ఫ్యాషన్ » ఎకో ఫ్రండ్లీ ఫ్యాషన్‌

ఎకో ఫ్రండ్లీ ఫ్యాషన్‌

DSC_0102పర్యావరణానికి హాని కలిగించని రీతిలో డిజైనర్లు ఫ్యాషన్‌ దుస్తులను రూపొందిస్తున్నారు. ఫ్యాషన్‌ ఎకో-ఫ్రెండ్లీని ఇష్టపడే నేటి ట్రెండ్‌ యువత కోసం పలు బ్రాండ్స్‌ సహజ రంగులు, సహజంగా తయారైన క్లాత్‌ మెటీరియల్‌తో కలెక్షన్స్‌ అందుబాటులోకి వస్తున్నాయి. ఇలాంటి వాటిల్లో లెనిన్‌ దుస్తులకు ఆదరణ పెరుగుతున్న తరుణంలో ఎకో ఫ్రెండ్లీ దుస్తులను అందించడంలో ప్రముఖంగా పేరుపొందిన ‘లావెన్‌’ ఫ్యాషన్స్‌ హైదరాబాద్‌ జూబ్లీహి ల్స్‌ రోడ్‌ నెంబర్‌ 36లో తమ మొదటి స్టోర్‌ను నెలకొల్పింది. ఈ లావెన్‌ స్టోర్‌ను శనివారం రెవెన్యూ శాఖ మంత్రి ఎన్‌. రఘువీరారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హ్యాండ్‌లూమ్స్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌ డైరెక్టర్‌ కాంతిలాల్‌ దండే, ప్రముఖ టెలివిజన్‌ ఆర్టిస్ట్‌, మొగలి రేకులు ఫేమ్‌ ద్వారకేష్‌, నీకు నాకు చిత్ర నటీనటులు నందిత, ప్రిన్స్‌లు సందడి చేశారు. ఈ సందర్భంగా లెవన్‌ ఫ్యాషన్‌ సిఈఓ రాజేష్‌, డైరెక్టర్‌ యశ్వంత్‌ మాట్లాడుతూ మెన్స్‌ అండ్‌ ఉమెన్స్‌కోసం బెన్‌హర్‌, సిజర్‌, ఎవాల్స్‌, రిలాక్స్‌ క్యాజువల్స్‌తో పాటు విభిన్న రకాల కలెక్షన్‌లు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. అనంతరం నటి నందిత మాట్లాడుతూ తాను ధరించే దుస్తుల్లో లెనిన్‌ కలెక్షన్‌ ఉంటుందన్నారు. జీన్స్‌ రిచ్‌ లుక్‌ ఇవ్వడంతోపాటు సౌకర్యవంతంగా ఉంటాయని తెలిపారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top