You Are Here: Home » సినిమా » పాటలు » ఊసరవెల్లి (2011)-నేనంటే నాకు చాలానే ఇష్టం

ఊసరవెల్లి (2011)-నేనంటే నాకు చాలానే ఇష్టం

పల్లవి :

నేనంటే నాకు చాలానే ఇష్టం
నువ్వంటే ఇంకా ఇష్టం
ఏచోటైనె నా ఉన్నా నీకోసం
నా ప్రేమ పేరు నీలాకాశం
చెక్కిళ్లు ఎరుపయ్యే సూరీడు చూపైన
నా చేయి దాటందే నిను తాకదే చెలి
ఎక్కిళ్లు రప్పించే ఏ చిన్న కలతైనా
నా కన్ను తప్పించి
నను చేరదే చెలి చెలి చెలీ

చరణం : 1

వీచే గాలి నేను పోటీ పడుతుంటాం
పీల్చే శ్వాసై నిన్ను చేరేలా
నేల నేను రోజు సర్దుకుపోతుంటాం
రాణీ పాదాలు తలమోసేలా
పూలన్నీ నీ సొంతం
ముళ్లన్నీ నాకోసం
ఎండల్ని దిగమింగే నీడనై ఉన్నా
ఏ రంగు నీ నేస్తం అదేగా నా నేస్తం
నీ నవ్వుకై నేను రంగు మార్చనా

చరణం : 2

చేదు బాధలేని లోకం నేనవుతా
నీతో పాటే అందులో ఉంటా
ఆట పాట ఆడే బొమ్మైనేనుంటా
నీ సంతోషం పూచి నాదంటా
చిన్నారి పాపలకూ చిన్నారి ఎవరంటే
నీ వంక చూపిస్తా అదుగో అని
ప్రియాతి ప్రియమైన
ప్రయాణం ఏదంటే
టకాలని చెప్పేస్తా నీతో ప్రేమనీ

చిత్రం : ఊసరవెల్లి (2011)
రచన : రామజోగయ్యశాస్త్రి
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గానం : అద్నన్ శామీ

ప్రపంచంలో కీ బోర్డుని అత్యంత వేగంతో వాయించగల సమర్థుడు, భారతీయ రాగాల్ని పియానో మీద పలికించిన ‘పాప్ పాషా’ అద్నన్ శామీ. ఒకసారి ఇథియోపియాలో దారుణమైన కరువొచ్చింది. దానికి చలించిన శామీ ‘రన్ ఫర్ యువర్ లైఫ్’ అనే గీతాన్ని స్వయంగా రచించి గానం చేస్తూ ప్రదర్శించాడు. ఆ ప్రదర్శనకు వచ్చిన లక్షలమంది విరాళాలు అందించారు. ‘శామీ’ని ఐక్యరాజ్యసమితి ‘శాంతి పతకం’ తో సత్కరించి, సంగీత రాయబారిగా ప్రకటించింది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top