You Are Here: Home » చిన్నారి » కవితలు » ఊత కర్ర

ఊత కర్ర

ఏడేళ్ళుగా నేను ఒక్క అడుగు వేయలే పోయాను
పేరున్న వెైద్యుడి దగ్గరికి నేను వెళ్ళినపుడు
అతను అడిగాడు: ఊత కరల్రెందుకు?
నేనన్నాను: నేను కుంటివాడిని !

అందుకు అతనన్నాడు:
ఏదీ, ఒకసారి ప్రయత్నించి చూద్దాం
నీవు కుంటివాడివని అనుకుంటే- అందుకు కారణం
ఈ దరిద్రపు ఊత కరల్రే
ఏదీ మెల్లగా అడుగులు వెయ్‌, చూద్దాం

అలా అంటూ అతను నా సొగసైన
ఊత కరల్రను తీసుకున్నాడు
ఓ స్నేహితుడిలా నవ్వుతూ
వాటిని నా వెనుక విరిచి
నిప్పుల్లోకి విసరివేశాడు!

అవును!
నాకిప్పుడు నయమైంది
నేను నడవగలను
కేవలం ఒక నవ్వు వల్ల…
అయినా ఎప్పుడెైనా ఊత కరల్రను చూస్తే
నేను మళ్ళీ కాస్సేపు కుంటుతాను!
మూలం: బెర్టోల్‌ బ్రెహ్ట్‌

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top