You Are Here: Home » ఇతర » ఉల్లాసానికి…

ఉల్లాసానికి…

విరామం తర్వాత ఆపీసుకెళ్లాలంటే కొత్తగా అనిపించడం చాలామందికి ఉండే సమస్యే! దీనిని అధిగమించటానికి ఆఫీసుకు ఒక గంట ముందుగా వెళ్లడం వల్ల చిన్నపాటి మార్పులుంటే అర్థమవుతాయి. సర్ధుకుపోవడానికి ఆ సమయం చాలు… ఇబ్బంది లేకుండా విధుల్లో కొనసాగిపోవచ్చు.

jumpaసెలవుల తర్వాత నేరుగా విధుల్లో చేరడం కాకుం డా… వచ్చే ముందు సంబంధింత అధికారికి ఫలా నా తేదీన వస్తున్నటుగా ఒక ఈమెయిల్‌ పెట్టడం సత్సాం ప్రదాయం .. దీని వల్ల విరామం తర్వాత కలిగే ఆసౌ క ర్యాని తేలికగా తొలిగించవచ్చు. వాస్తవానికి ప్రణాళిక ప్రకారం మీ సెలవులు తీసుకుంటే… సంబంధిత ఉన్నతా ధికారికి ఫలానా తేదీన వస్తాను అని వివరించి… అప్పటి వరకూ నిర్వర్తించిన విధులు… చేయాల్సిన పనుల తాలూకు వివరాలు గురించి పై అధికారికి వివరించటం వల్ల మీ విరామ సమయాన్ని హాయిగా గడపవచ్చు. కొన్ని సందర్భాల్లో అనుకున్నదాని కంటే ఎక్కువ రోజులు సెలవులు తీసుకోవల్సి రావొచ్చు. అటువంటప్పుడు పనిలో ధ్యాస నిలపం కాస్త కష్టమే! ముందుగానే సంసిద్ధమై విధుల్లో చేరితే ఆ భావన ఉండదు.కుటుంబంతో గడపటానికి ప్రణాళిక వేసుకున్నపుడు మీ వంతు బాధ్యతలు పూర్తిగా నిర్వహించడం…

తిరిగొచ్చా క ఏం చేయాలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వంటివి చేయాలి. అప్పుడే ఎక్కడున్నా ఆఫీసు గురించి ఆలోచనలు ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. వచ్చిన తర్వాత సౌకర్యంగా ఉంటుంది. మీరు సందర్శించిన ప్రదేశం నుంచి మీ సహోద్యోగులకు ఏదో ఒక చిరు కానుక లేదంటే స్వీట్లు తీసుకొస్తే మొదటి రోజు పని చేసుకుంటూ వాటిని పంచుతూ మాట్లాడు కుంటే సరదాగా గడిచిపోతుంది. మీ పర్యటన విశేషాలు గురించి వారితో సంభాషిస్తూ పనిపై దృష్టి పెట్టొచ్చు.

మీరు లేని సమయంలో ఆఫీసులో… విధుల పరంగా జరిగిన మార్పులు ఇతర విషయాలు సహోద్యోగు లను అడిగి తెలుసుకోవడం.. వాయిదా పడిన పనుల మీదా దృష్టి పెట్టడం చేయాలి. ఇందుకే ముందు నుంచీ ప్రణాళి కతో ఉంటే తిరిగి వచ్చాక పని గురించి ఆదుర్దాపడాల్సిన అవసరం ఉండదు. ఎక్కువ రోజులు సెలవు తీసుకొని మళ్లీ విధుల్లోకి చేరడానికి ముందు రోజు విశ్రాంతి తీసుకోవడం మంచిది. శారీరకంగా… మానసికంగా సంసిద్దమై ఉంటే మర్నాడు విధుల్లో నిగ్నమైపోవచ్చు. అలాగే సహోద్యోగులతో ఎప్పటికప్పుడు మెయిల్స్‌, ఫోన్‌ కాల్స్‌తో అందుబాటులో ఉంటే విధులకు దూరమైన భావన ఉండదు. సెలవలు పూర్తయ్యాక మర్నాడు ఆఫీసుకు త్వరగా చేరుకోవాలి. ఆసమయంలో పనిలో త్వరగా నిమగ్నం కావచ్చు. వాయిదా పనులు ఉంటే అన్నీ ఒకసారి పూర్తిగా చేయాలనే ఆరాటం పనికిరాదు. ఆ తడబాటుతో పొరబాట్లు జరిగే ఆస్కారం ఎక్కువ. పనిలో కుదురుకున్నాకే ఆ ప్రయత్నాలనీ!

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top