You Are Here: Home » చిన్నారి » ఉరుము ఎలా వస్తుంది?

ఉరుము ఎలా వస్తుంది?

రుతుపవనాల ప్రారంభంలో మేఘాల కదలిక ఎక్కువగా ఉండి, తరచూ ఉరుములు వినిపిస్తుంటాయి. ఒక్కొక్కసారి ఈ ఉరుముల శబ్దం తీవ్రంగా ఉంటుంది. చిన్న పిల్లలు భయపడతారు కూడ. అంత శబ్దం వచ్చినప్పుడు ‘పిడుగు పడింది’ అంటారు పెద్దవాళ్లు. అసలు ఈ ఉరుములు ఎలా వస్తాయి?
మేఘాలు ఒకదానితో ఒకటి ఢీకొన్నప్పుడు కలిగిన ఘర్షణ వల్ల విద్యుత్ పుడుతుంది. ఈ విద్యుత్ ఉత్తీర్ణం జరిగినప్పుడు చుట్టుప్రక్కల గాలి వేడెక్కి వ్యాకోచిస్తుంది. ఆ వేడిగాలి చల్లటి గాలిని బలంగా తాకినప్పుడు శబ్దం వస్తుంది. ఆ శబ్దమే ఉరుము.

అలా విడుదలైన విద్యుత్ భూమిపైన మొనదేరిన కొనలు లేదా ఎత్తయిన ప్రదేశాలపై ప్రసరిస్తుంది. దీనినే పిడుగు పడడం అంటారు. అంతేగాని పిడుగు అంటే ఆకాశం నుంచి నేల మీద పడే వస్తువు కాదు. ఈ పిడుగుపాటును నివారించటానికి ఎత్తయిన భవనాలపై లెటైనింగ్ కండక్టర్‌ని ఉంచుతారు. మెరుపు కనిపించిన కొన్ని సెకన్ల తర్వాత ఉరిమిన శబ్దం వినిపిస్తుంది. దానికి కారణం శబ్ద వేగం కన్నా కాంతి వేగం చాలా ఎక్కువగా ఉండడమే. అంటే ఉరిమినప్పుడు వెలువడిన కాంతి వేగంగా ప్రయాణించి మనకు ముందుగా కనిపిస్తుంది, శబ్దం కొంత ఆలస్యంగా ప్రయాణించి మెరుపు కనిపించిన తర్వాత వినిపిస్తుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top