You Are Here: Home » ఇతర » ఉద్యోగంలో చేరగానే రిటైర్‌మెంట్‌ ప్రణాళిక

ఉద్యోగంలో చేరగానే రిటైర్‌మెంట్‌ ప్రణాళిక

నేటి యువతరం ఆలోచనల్లో మార్పు
ఇన్సూరెన్స్‌పై జీవితకాల పెట్టుబడులు
పొదుపుతోనే వృధ్ధాప్యంలో ఉజ్వల భవిష్యత్‌
మాక్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ హెడ్గ వి. విశ్వానంద్‌

డాక్టర్‌ అమిత్‌నంది 1981లో రిటైర్‌ అయ్యారు. ఆయన అప్పట్లో ఒక ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసేవారు. వచ్చే పింఛను ఆయన, ఆయన భార్య సౌకర్యవంతంగా జీవించేందుకు సరిపోయేది. ఆయన కుమారుడు ఒక ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నారు. కుమార్తె డాక్టర్‌. రిటైర్‌ అరుున మూడు దశాబ్దాల తరువాత ఆ జంట ఇప్పుడు తమ జీవితావసరాల కోసం పోరాటం చేస్తున్నారు.

పిల్లల నుంచి సాయం పొందడం చిన్నతనంగా భావిస్తుంటారు. అందుకే ఒక్కో రూపాయి లెక్కించి ఖర్చు చేస్తుంటారు. కేబుల్‌ టీవీ కనెక్షన్‌ కూడా పెట్టించుకోలేదు. వారు తరచు రామకృష్ణ మఠం సందర్శిస్తుంటారు. ఆటోకు అయ్యే ఖర్చు కూడా రూ.60వరకు ఉంటుంది. అందుకని మఠానికి వెళ్లడం కూడా తగ్గించారు. ఆయన పింఛనుపై ద్రవ్యోల్బణం కాటు పడుతోంది. అప్పట్లో ఆయన చేరిన పింఛను పధకం ఆయన స్వయంగా ఎంచుకున్నది కాదు. యాజమాన్యం కల్పించింది మాత్రమే. 1970 ప్రాంతంలో రిటైర్మెంట్‌ ప్రణాళిక అనేది అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు. దేశంలో దీనిపై అవగాహన ఉన్నవారు కూడా చాలా తక్కువ. చాలామంది తమ రిటైర్మెంట్‌ జీవితంలో పిల్లలపై ఆధారపడేవారు. అప్పట్లో ప్రధానంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పింఛను ఉన్నప్పటికీ తమ అవసరాలు, శక్తి సామర్ధ్యాలకు అనుగుణంగా దానిని ప్లాన్‌ చేసుకోవడంలో ఉద్యోగి ప్రమేయం పెద్దగా ఉండేది కాదు. అందుకుగాను అమిత్‌నంది ఇప్పుడు ఎంతో బాధపడుతున్నారు. నాటితో పోలిస్తే రిటైర్మెంట్‌కు సంబంధించి వ్యక్తిగత ప్రణాళిక అనేది నేడు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకసారి ఉద్యోగంలో చేరితే అది ఇక పర్మినెంట్‌ అనుకునే రోజులు పోయాయి. కాంట్రాక్టు ఉద్యోగాలు వస్తున్నాయి. పనితీరు ఆధారంగా ఉద్యోగం కొనసాగుతోంది. ఎంతోమంది స్వయం ఉపాధిని ఎంచుకుంటున్నారు. ఈ నేపధ్యంలో పింఛను ప్రయోజనాలు అనేవి ఆటోమేటిక్‌గా సమకూరేవిగా ఉండడంలేదు. వాటిని ఎవరికి వారు ప్రత్యేకంగా ప్లాన్‌ చేసుకుని రంగంలోనూ కంపెనీ పెన్షన్‌ ప్లాన్‌లు కొత్తరూపం సంతరించుకుంటున్నాయి.

రిటైర్‌మెంట్‌లో నుంచి ప్లానింగ్‌
నేడు రిటైర్‌మెంట్‌ ప్లానింగ్‌ అక్యుములేషన్‌, యాన్యునీ పేమెంట్స్‌, ఇతర ప్రయోజనాలు అందించడం, సబ్‌స్క్రిప్షన్‌, పేమెంట్‌ స్కీమ్‌లు లాంటి వాటిని ఎన్నో అందిస్తున్నారు. తాము ఏ వయసులో రిటైర్‌మెంట్‌ కాదలిచారో, తమకు ఆ సమయంలో నెలకు ఎంత మొత్తం అవసరమవుతుందో దానిని బట్టి సబ్‌స్క్రయిబర్లు ముందుగానే ప్లాన్‌ చేసుకునే అవకాశం ఇప్పుడు లభిస్తోందని మాక్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ హెడ్‌ విశ్వానంద్‌ చెబుతున్నారు. 45 సంవత్సలకే రిటౌర్‌ కాదలచుకున్నా అందుకు తగ్గ విధంగా పెన్షన్‌ స్కీమ్‌ను నిర్మించుకునే అవకాశం ఉందని తెలిపారు. దురదృష్టవశాత్తూ జీవితంలో అనుకోనిది ఏదైనా జరిగినప్పటికీ మీ జీవిత భాగస్వామి తన చరమ జీవితం ప్రశాంతంగా గడిపేందుకు అవసరమైన ఏర్పాటు కూడా ఈ రిటైర్‌మెంట్‌ ప్లాన్‌లో చేసుకోవచ్చు. జీవితబీమా సంస్థలు అందించే పెన్షన్‌ ప్లాన్‌లు కూడా ఎంతో ఆకర్షణీయంగా ఉంటున్నాయి. క్రమ బద్ధంగా, క్రమశిక్షణా పూరితంగా రిటైర్‌మెంట్‌ ప్లాన్‌ను రూపొందించుకోవడంలో ఇవి తోడ్పడుతాయి.

ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోవాలి
ఏక మొత్తం చెల్లింపుతో లేదా క్రమం తప్పని వార్షిక చెల్లింపులు విధానంలో వీటిని పొందవచ్చు. రిటైర్‌మెంట్‌ అనంతరం ఆదాయపు ప్రయోజనాన్ని తక్షణం పొందవచ్చు. లేదా పూర్తిగా, పాక్షికంగా వాయిదా వేసుకోవచ్చు. దాని ప్రకారం నెలవారీ యాన్యుటీ లెక్కించబడుతుంది. జీవితపర్యంతం, హామీ ఇచ్చిన కాలానికి ఎంచుకోవచ్చు. అంతేకాక నామినీ జీవితానికి వర్తించేలా కూడా వీటిని పొందవచ్చు. నంది కనుక అప్పట్లోనే ప్రభుత్వ పింఛనుకు తోడుగా ప్రైవేటు పెన్షన్‌ ప్లాన్‌ను ఎంచుకుని ఉంటే, ద్రవ్యోల్బణాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని ఉంటే ఇప్పుడు వారి జీవితం ఎంతో ప్రశాంతంగా సాగిపోయేది. తాము కోరుకున్న జీవితం ఆనందంగా గడిపేవారు. అందుకే ఉద్యోగంలో చేరిన తొలిరోజే రిటైర్‌మెంట్‌ జీవితానికి ప్రణాళిక రూపొందించుకోవాలి.

మాక్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ హెడ్గ వి. విశ్వానంద్‌

Other News From

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top