You Are Here: Home » విశేషం » ఉత్సాహమే విజయానికి ఊతం!

ఉత్సాహమే విజయానికి ఊతం!

ఉత్సాహమే విజయానికి ఊతం!

ఎవరి సహాయంలేదు. అపజ యం తప్పదని విచారించేవారు చాలామంది కన్పిస్తారు మనకు. పైగా ఏ పనీ చేపట్టినా అపజయం ఎదురవుతూ నిరుత్సాహ పడుతూ ఉంటారు. సగం పనిపూర్తి చేసి అలసి-విసిగి దానిని పూర్తి చేయ కుండా ఆపేస్తూ ఉంటారు. తమతోటి వారు తమకన్నా వేగంగా ప్రతి పనిలోను ముందు కుదూసుకు వెడుతూ విజయ పథంవైపు వెళ్లడం వీరికి ఆశ్చర్యం కల్గించడమే గాక ఆత్మన్యూనతా భావా న్ని వుంటుంది. అసలు తాను మొదలు పెట్టిన పని తనవల్ల కాదని తెలిసి మొదలు పెట్టడం తనదే తప్పని అందుకే పూర్తి కాలేదని కుమిలిపోతూ ఉంటారు. ఇలాంటి భావాలు రావడానికి కారణం వీరిలో ఉత్సాహం లేకపోవడమే. మనిషి బ్రతకడానికి ఆక్సిజన్‌ ఎంత అవసరమో జీవి తంలో విజయపథం వైపు పయనించడానికి ఉత్సాహం అంత అవసరం.

ఏ విషయంలో నైనా సరే మనిషి సాధించగలమనే నమ్మకంతో ముందుకు సాగాలి. ఆశావాదిగా వద్దు! నిరాశవద్దు! నిరాశతో ఏ పని ప్రారంభించిన అది పూర్తికాదు. ఎంతో సులువైన పనికూడా పూర్తి చేయలేరు. నేను చేయగలను అనే ధీమాతో పని ప్రారంభిస్తే ఎంతటి కష్టతరమైన పని అయినా సులువుగా చేయగ ల్గుతారు.

మనుషుల్లో కన్పించే మరొక లోపం పోల్చు కోవడం. ఇలా ఇతరులతో పోల్చుకోవడం వల్ల మనిషి దిగాలు పడిపోతాడు. ఎంతసేపు ఎదుటివాడు బాగా చేస్తున్నాడనేతలంపు మనిషిని నిర్వీర్యం చేసేస్తుంది. పోల్చు కోవడం వల్ల మరొక ప్రమాదం కూడా ఎదురవుతుంది. మనిషికి తెలియకుండానే ‘ఈర్ష్య’ మొదలవు తుంది. దానితో పని సమర్థత బాగా దెబ్బతింటుంది. ఇద్దరిని సరిపోల్చుకుంటూ తను తక్కువ అని భావించడంలో ఎంతమాత్రం నిజం ఉండదు. అది మరువ కూడదు. మీ సర్వశక్తిని కూడగట్టుకుని ఆత్మవిశ్వాసంతో చేయడమే మీరు చేయగలిగిన పని. అదే మీకు విజయం తెచ్చి పెడుతుంది.

నిరుత్సాహాన్ని దరిచే రనిస్తే మీ ప్రతిభలన్నీ అడుగంటి పోతాయి. ఏమీ చేయని వారు తప్పులు చేయరు. పనిచేసే వారే తప్పొ రైటో చేస్తారు. ఏపని చేయని వారు తప్పులు చేయరు. ఎందుకంటే తప్పుచేయడం అనేది తెలిసేది ఏదైనా పనిచేసినపుడే తెలుస్తుంది. అదే విధంగా ఏదైనా పనిచేస్తే విజయం సాధించడమో, అపజ యం పాలు కావడమో సంభవి స్తుంది. ఒకసారి తప్పుచేస్తే మళ్ళీ ఆ తప్పుచేయకుండా జాగ్రత్తపడ తాము. అదే విధంగా ఒకసారి అపజయం పాలైతే మళ్ళీ అలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త పడతాము.అందుకే అపజయం విజయానికి తొలిమెట్టు అని అంటారు. లెక్కలు చేసేటప్పుడు ఒక్కొక్క లెక్కకు జవాబు రాదు. అందువల్ల లెక్కలు చేయడంమానేస్తామా? ఆ లెక్క ఆపి తరువాత లెక్కలు చేస్తాం. కొన్ని లెక్కలు చేసిన తరువాత మొదట రాని లెక్కను కూడా చేసేయ్యగల్గుతాము. లెక్కల్లో కన్పించే అంకెలను చూసి గాబరా పడడం కన్నా ఆ అంకెలలోని ఆనందాన్ని గుర్తించి వాటితో ఆడుకునే పద్ధతులు అన్వేషించుకోవాలి. అందరూ సున్నాలే. అంటే జీరోలే. ఒకటిి పక్కనజేరితే జీరో టెన్‌ అవుతుంది. అంటే హీరో అవుతుంది. అదే విధంగా మనం కృషి పక్కన ఉంటే విజయాలు సాధిస్తూ హీరోలు అవుతాము.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top