You Are Here: Home » ఇతర » ఉత్సవ్‌మేళా చూసొద్దామా!

ఉత్సవ్‌మేళా చూసొద్దామా!

‘సెలవుల్లో సరదాగా గడిపేందుకు పలు ేకంద్రాలు అందుబాటులోకి వస్తున్నారుు. చిన్నారుల ఆటవిడుపుకు కొత్తహంగులు సమకూరుతున్నారుు. వారి అభిరుచులకు అనుగుణంగా కొత్త రకం ఆటవస్తువులు అందుబాటులోకి వస్తున్నారుు. ఇక దసరా సెలవులు వస్తుండ డంతో భాగ్యనగరంలో పలు ప్రదర్శనలు ఏర్పాటవుతున్నారుు. టేస్టీ ఫుడ్గ తింటూ ఇష్టమైన ఆటలు ఆడుకునేందుకు సికింద్రాబాద్‌ జూబ్లీ బస్‌ స్టేషన్‌ పక్కన ఉన్న కంటోన్మెంట్‌ పార్క్‌లో ఏర్పాటైన ‘మహా ఉత్సవ్‌ మేళా-2012’ సందర్శకులతో కళకళలాడుతోంది. సాయంత్రం సమయంలో సరదాగా గడిపేందుకు నగరవాసులు ఉత్సాహం చూపుతున్నారు. చిన్నారుల కోసం ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆట పరికరాలు ఆకట్టుకుంటున్నారుు…’

IMG5సెలవు రోజుల్లో చిన్నారులు సరదాగా తిరగాలని కోరు కుంటారు . ఎవరికి నచ్చిన ప్రదేశాల్లో వారు ఆనం దంగా గడపాలని భావిస్తారు. అందుకే సెలవుల్లో బయటకు వెళ దామని తల్లిదండ్రులను పదేపదే అడుగుతుం టారు. ఈ తరుణంలో నగరంలోని సికింద్రాబాద్‌ జూబ్లీబస్‌స్టేషన్‌ వద్ద ఉన్న కంటోన్మెంట్‌ పార్క్‌లో ఏర్పాటు చేసిన ఉత్సవ్‌ మేళా సందర్శకులతో కళకళలాడుతోంది. ఉత్సవ్‌ మేళాలో చిన్నారులు ఆడుకునేందుకు వీలుగా ఎన్నో రకాల ఆటవ స్తువులు ఇందులో ఏర్పాటయ్యాయి. యమహారైడ్‌, మారు తీకారు, మినీ జీప్‌, ఇరాన్‌ రైడ్‌, వాటర్‌ కిడ్డి, బ్రేక్‌డాన్స్‌ వంటివి చిన్నారులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. హైద రాబాద్‌ మహా ఉత్సవ్‌మేళాలో థీమ్‌ గేట్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది.

షాపింగ్‌ కోసం ప్రత్యేక స్టాల్స్‌…
ఉత్సవ్‌మేళాలో షాపింగ్‌ చేసేందుకు ప్రత్యేక స్టాల్స్‌ ఏర్పాట య్యాయి. హోమ్‌క్లీనింగ్‌, ఫ్యాన్సీ టాయ్స్‌, ఎటు జడ్‌ వెరైటీ స్‌ వంటి స్టాల్స్‌ ఇందులో ఉన్నాయి. వినోదం కోసం ప్రత్యే క ఏర్పాట్లు కూడా ఏర్పాటయ్యాయి. కలకత్తా హ్యాండ ీక్రాఫ్ట్‌‌స, త్రిపుర బాంబూ హ్యాండీక్రాఫ్ట్‌‌సను మహిళల కోసం ఏర్పాటు చేశారు. వేసవి సీజన్‌కు తగిన ఎన్నో రకాల కాట న్‌ దుస్తులు ఇక్కడ అందుబాటులో ఉంచారు. బనారస్‌, లక్నో, కళంకారీ చీరలు, జైపూర్‌ కళాకారులు రూపొందిం చిన ఇమిటేషన్‌ జ్యుయలరీ, ఇరాన్‌, మలేషి యాల ఇంటీరి యర్‌ స్టాల్స్‌ను ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు.

బుడతల కోసం భలే ఆటలు…
చిన్నారి సిసింద్రీల కోసం ఎన్నో ఆటలు ఇందులో కొలువు తీరాయి. 18 రకాల ప్రత్యేక ఆటలు ఇందులో ప్రత్యేకత. జెయింట్‌ వీల్‌లో సుమారు 40మంది ఒకేసారి కూర్చునే అవకాశం ఉంది. దీనికి టికెట్‌ ధరను రూ.30గా నిర్ణయిం చారు. అలాగే 62 అడుగుల ఎత్తులో ఉన్న ప్యారాషూట్‌ టవర్‌లో 30మంది వరకు ఎక్కవచ్చు. గిరగిరా తిరుగుతూ పైవరకు వెళ్లి ఇది కిందకు వస్తుంది. ఇవే కాకుండా ఫ్రిజ్‌బీ రైడ్‌, కొలంబస్‌ , టైటినిక్‌ , బ్రేక్‌ డాన్స్‌ వంటివి కూడా ఇందులో ఉన్నాయి. వీటిలో ఎక్కేందుకు ఒక్కోదానికి రూ.20 నుంచి రూ.30 రూపాయలు వసూలు చేస్తారు.

కొలువుతీరిన హస్తకళా రూపాలు…
సరదా కోసం కాకుండా హస్తకళా ప్రదర్శనలు కూడా నగరంలో ఏర్పాటువుతున్నాయి. లేపాక్షి హస్తకళా ప్రదర్శనలతోపాటు పలు రాష్ట్రాల ఉత్పత్తులన్నీ ఒకేచోట లభించేలా సిల్క్‌ ఎక్స్‌పోలు కూడా జరుగుతున్నాయి . ఈ ప్రదర్శనల్లో ఎవరికి ఇష్టమైన ఉత్పత్తులను వారు కొను గోలు చేసుకునే సౌకర్యం కలుగుతోంది. ఉత్సవ్‌ మేళాను రూ.20 ఎంట్రీ రుసుముతో సాయంత్రం 5గంటల నుంచి రాత్రి 10గంటల వరకు తిలకించవచ్చు. ఈ దసరా సెలవురోజుల్లో మీకిష్టమైన ఓ ఎగ్జిబిషన్‌ను సరదాగా తిలకించేందుకు ప్లాన్‌ చేసుకోండి మరి.

చిన్నారులకు ఆటవిడుపు !
భాగ్యనగర ప్రజల అభిరుచులకు అనుగుణంగా ప్రతిఏటా హైదరాబాద్‌ ఉత్సవ్‌మేళాను పీపుల్స్‌ప్లాజాలో ఏర్పాటు చేస్తున్నాం. సికింద్రాబాద్‌ ప్రాంత ప్రజల కోసం దసరా పండుగ వస్తుండడంతో జూబ్లీబస్‌స్టేషన్‌ వద్ద దీనిని ఏర్పాటు చేశాం. ఇందులో 300పైగా స్టాల్స్‌ ఏర్పాటయ్యాయి. పిల్లల కోసం ప్రత్యేక ఆటవస్తు వులు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రదర్శనకు ప్రజలనుంచి అనూహ్య స్పందన లభిస్తోంది.

– మహ్మద్‌ రఫీక్‌ బేగ్‌, హైదరాబాద్‌ ఉత్సవ్‌మేళా నిర్వాహకులు.
-ఇస్కా రాజేష్‌బాబు, ‘సూర్య’ లైఫ్‌స్టైల్‌ ప్రతినిధి
ఫొటోలు : కె. సర్వేశ్వర్‌రెడ్డి, ఎస్‌ శరత్‌, ఎ. రమణాచారి

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top