You Are Here: Home » చిన్నారి » ఈ మొక్కలు ఆకుపచ్చగా ఎందుకుండవు?

ఈ మొక్కలు ఆకుపచ్చగా ఎందుకుండవు?

వర్షాలు పడినప్పుడే పుట్టగొడుగులు పుట్టుకొస్తాయి. ఈ పుట్టగొడుగుల్ని ఇంగ్లిష్‌లో ‘మష్రూమ్స్’ అంటారు. ఈ పుట్టగొడుగుల్ని ప్రస్తుతం ప్రత్యేకంగా కుటీర పరిశ్రమాల్లో ఉత్పత్తి చేస్తున్నారు. ఇటీవల వీటిని ఉత్పత్తి చేయటానికి పెద్ద పరిశ్రమలను కూడా స్థ్ధాపిస్తున్నారు.
పుట్టగొడుగులు ఒక రకమైన శిలీంధ్ర జాతికి చెందిన మొక్కలు. అయితే ఇవి మిగిలిన మొక్కల మాదిరిగా తమ ఆహారాన్ని కిరణ జన్య సంయోగ క్రియ ద్వారా తయారు చేసుకోలేవు. అందుకనే ఇవి ఆకుపచ్చగా ఉండవు.

పుట్టగొడుగులు సహజంగా ఎదిగేది మాత్రం వర్షం పడినప్పుడే. ఇవి పొలం గట్లపైన, పెద్ద పెద్ద చెట్ల మొదళ్లు, సారవంతమైన మట్టి కుప్పల వద్ద పుట్టుకొస్తాయి. వీటిలో గొడుగు లాంటి భాగం కింద ఉండే మొప్పల్లాంటి అరల్లో సంతాన బీజాలు తయారవుతాయి. ఇవి గాలి ద్వారా వ్యాప్తి చెంది అనువైన పరిస్థితులు ఏర్పడినప్పుడు మొలకెత్తుతాయి.

పుట్టగొడుగులు మొలకెత్తడానికి మెత్తటి తేమ కలిగిన నేల, తక్కువ ఉష్టోగ్రత ఉండాలి. అలాంటి పరిస్థితి వర్షకాలంలో ఉంటుంది. కాబట్టి పుట్టగొడుగులు ఆ సమయంలోనే మొలుస్తాయి. వీటిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top