You Are Here: Home » చిన్నారి » ఇనుప మేకు మునుగుతుంది, ఓడ తేలుతుంది… ఎందుకు?

ఇనుప మేకు మునుగుతుంది, ఓడ తేలుతుంది… ఎందుకు?

మనం నీళ్లలో ఒక ఇనుప మేకుని పడేస్తే అది మునిగిపోతుంది. ఇనుముతో చేసిన ఓడలు నీటిపై తేలడం చూసినపుడు పిల్లలందరికీ ఒక సందేహం వస్తుంది. మేకు మునిగినపుడు, ఓడ మాత్రం ఎందుకు తేలుతుంది అనుకుంటారు. వస్తువు సాంద్రత, నీటి సాంద్రత కన్నా ఎక్కువైతే ఆ వస్తువు మునుగుతుంది.

ఇనుప మేకు సాంద్రత ఎక్కువ, కాబట్టి మునుగుతుంది. ఓడ లోపల బోలుగా ఉంటుంది కాబట్టి దాని సాంద్రత నీటి సాంద్రత కన్నా తక్కువగా ఉంటుంది. అందుకే ఓడ నీటిపై తేలుతుంది. అయితే ఓడ అడుగు భాగం కొద్దిగా నీళ్లలో మునిగి ఉంటుంది. ఓడ తొలగించే నీటి బరువుకి సమానమయ్యేంత వరకు ఓడలోని కింది భాగం మునిగి ఉంటుంది. ఆపైభాగం తేలి ఉంటుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top