You Are Here: Home » ఇతర » ఇదే మన ‘ఫార్చ్యూన్‌’

ఇదే మన ‘ఫార్చ్యూన్‌’

భారత కార్పొరేట్‌ వాణిజ్య రంగంలో మహిళా మణులు మరోసారి విజయ బావుటా ఎగరేసారు. ఫార్చ్యూన్‌ మాగజైన్‌ ప్రచురించిన 50 మంది అత్యంత శక్తిమంతమైన కార్పొరేట్‌ మహిళల్లో చందా కొచ్చర్‌ేక రెండవసారి కూడా ప్రధమ స్థానం దక్కింది. ప్రపంచ మహిళా కార్పొరేట్ల జాబితాలో ఈమె 5వ స్థానంలో ఉండటం హర్షణీయం. రెండు, మూడవ స్థానాల్లో మల్లికా శ్రీనివాసన్‌, అరుణ జయంతి ఉండగా, ఈ జాబితాలో మరో ఆరుగురు కొత్తగా నమోదు అవ్వడం విశేషం. ప్రపంచ దేశాల్లో భారతీయ మహిళా శక్తిసామర్ధ్యాలకి నిలువుటద్దం పడుతున్న ఈ ఆరుగురు కొత్త తరంగాలు భవిష్యత్తులో మరింత స్థారుుకి చేరగలరనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. కోల్గేట్‌ పామోలివ్‌ ఇండియా సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌, ప్రభా పరమేశ్వరన్‌, మోర్గాన్‌ స్టాన్లీ ఇండియా ఇన్వెస్టిమెంట్‌ బ్యాంకింగ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, ఆయేషా డి సెక్విరా, ఇన్‌టెల్‌ గ్రూప్‌కి చెందిన దేబ్జానీ ఘోష్‌, డియాజియో ఇండియా సంస్థకి చెందిన అబాంతీ శంకరనారాయణన్‌, స్పెన్సర్‌ స్టార్ట్‌-మేనేజింగ్‌ పార్ట్‌నర్‌, అంజలీ బన్సాల్‌, టప్పర్‌వేర్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆశాగుప్తా ఈ ఫార్చ్యూన్‌ మాగజైన్‌ జాబితాలో సరికొత్తగా చేరిన మహిళలు.

ఆయేషా డి సెక్విరా
Unti82007 సంవత్సరం ప్రారంభంలో ఆషాకు వాల్‌స్ట్రీట్‌, మోర్గాన్‌ స్టాన్లీలో ఉంటున్న తన సీనియర్ల దగ్గరనుంచి ‘నువ్వు మాతో కలిసి పనిచేయాలనుకుంటున్నావా? అంటూ పిలుపు వచ్చింది. 41 సంవత్సరాలుగా గోవాలో పుట్టిపెరిగిన ఆయేషాకు ఈ ఆహ్వానం ఎంతో ఆకట్టుకుంది. కానీ ఆందోళన కలిగించే అంశం ఏమి టంటే ఆ సమయానికి కొన్ని కారణాల వల్ల న్యూ యార్క్‌ నుండి చాలామంది హాంకాంగ్‌కి తరలి వెళ్ళి పోయారు. అందువల్ల ఈమె వెంటనే తనకొచ్చిన ఆహ్వానానికి స్పందించ కుండా తనకి హాంకాంగ్‌ వెళ్ళడం ఇష్టం లేదని చెప్పింది. కానీ భారతదేశం వెళ్ళమంటే నేను వెంటనే వెళ్ళడానికి సిద్దంగా ఉన్నాను అంది. అదే ఆమె తీసుకున్న సరైనా నిర్ణయం.

ఆ అవకాశంతో ఫిబ్రవరి 2007లో నిమేష్‌ కంపానీ, మోర్గాన్‌ స్టాన్లీ ఉమ్మడి వ్యాపారం ముగింపు సమయా నికి వచ్చినట్టు ప్రకటించింది. 2007 నవంబర్‌ కల్లా ఆయేషా ి మోర్గాన్‌ స్టాన్లీ లావాదేవీలకి భారత దేశ అధికార ప్రతినిధిగా నియమితురాలయ్యింది. ఆయేషా గోవాలో తన ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన తర్వాత 1993 లో అమెరికాలో యేలీ బిజినెస్‌ స్కూల్‌ల్లో మేనేజ్‌మెంట్‌ కోర్సు చేయడానికి యునైటెడ్‌ స్టేట్స్‌కి వెళ్ళి పోయింది. 1994లో ఆయేషా బ్యాంకు పెట్టుబడుల విభాగంలో చేరింది. 1995 కల్లా అసోసియేట్‌గా ఎది గింది. ఆ తర్వాత న్యూ యార్క్‌లో మోర్గాన్‌ స్టాన్లీలో తన 13 సంవత్సరాలు పరుగు పందెం ప్రారంభించింది . అలా సాగుతున్న ఈమె ప్రహసనంలో 2000 నాటికి వినియోగ దారుల ఉత్పత్తుల్లో యూనిలివర్‌, పెప్సీ కంపెనీ వంటి ప్రముఖ పేరున్న సంస్థలతో కలిసి పనిచేయడం మొదలయ్యింది.

అదే ఈమె మార్కెటింగ్‌లోకి రావడానికి మొదటి పునాది. ఎంత సేవలు అందస్తున్నప్పటికీ ‘నాకు భారత్‌, ఆసియా వ్యాపార సంస్థల పరంగా ఏ మాత్రం ఖచ్ఛితమైన గుర్తింపు రాలేదు’ అంటూ చెప్పింది. ఈమె తన వ్యాపార కార్యక్రమాల్లో భాగంగా నాలుగు సంవత్సరాల క్రితం భారతదేశానికి రావడం జరిగింది. ఎంతో బిజీగా ఉండే ఈమె మరిన్ని సంస్థలకి సలహాదారుగా కూడా తన సేవలందిస్తోంది.

ఆయేషా డి సెక్విరా
prabaఈమె 1995లో కాల్గెట్‌ పామాలివ్‌ ఇండియా లిమిటెడ్‌లో మార్కెటింగ్‌ మానేజర్‌గా అడుగుపెట్టింది. అప్పుడు ఈ సంస్థ, కేశ సంరక్షణకి తయారు చేసే ఉత్పత్తులు మార్కెటింగ్‌ చేసే పూర్తి బాధ్యతను ప్రభకి అప్పగిం చారు. ఆ తరువాత 1997లో న్యూయార్క్‌లో ఓరల్‌ కేర్‌ అంతర్జాతీయ వాణ్యి జ్యాభివృద్ది కోసం ఈమెకు అసోసియేట్‌ డైరెక్టర్‌గా పదోన్నతినిచ్చి ఆ బాధ్యతలు అప్పగించారు. ఈమె తనకిచ్చిన విధులు, బాధ్యతలు సమర్థవంతంగా నిర్విహ స్తూ సంస్థకి తలమానికంగా నిలిచింది. న్యూ యార్క్‌లో ఈమె అనేక విభాగాల్లో అనేక పదవుల్లో తన సేవలందిస్తూ తన సత్తా చాటుకుంది. ఏషియా డివిజన్‌ మొత్తానికి ఈమె మార్కెటింగ్‌ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ప్రత్యేక శ్రద్దతో, స్వతసిద్ద మైన బాధ్యతతో పనిచేసి మార్కెటింగ్‌ విభాగానికి వైస్‌-ప్రసిడెంట్‌ స్థాయికి ఎదిగింది.

2007లో తన నాయకత్వంలో మెక్సికోలో మార్కెటింగ్‌ డైరెక్టర్‌గా తన ప్రతిభాపాటవాల్ని నిరూపించుకుంది. ఈ సంస్థ అన్ని విభాగాల్లోను తన సేవలందిస్తూ అంతర్జాతీయంగా ఒక ప్రత్యేకతని చాటుకుంది.ఫిబ్రవరి 1, 2012లో కాల్గేట్‌ పామాలివ్‌ ఇండియా లిమిటెడ్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ప్రభా పరమేశ్వరన్‌ని ఎంపిక చేసింది . ఈ విధంగా నియమించడానికి కేంద్ర ప్రభుత్వం, ఈ సంస్థ వాటాదారులు అనుమతి తప్పని సరిగా ఉండాలి. ఈమె చేసిన సేవలు, ఈమెకున్న ప్రతిభని పరిగణనలోకి తీసుకుని ఈ పదవికి ఈమెని ఎన్ను కున్నారు. దానితో ఈమె బాధ్యతలు మరింత పెరిగాయి. మొక్కవోని దీక్షతో అనుకున్న గమ్యస్థానాన్ని చేరడంలో ప్రభాపరమేశ్వరన్‌ ఏ స్థాయికి చేరిందో ఫార్ట్యూన్‌ మాగజైన్‌ మన ముందు ఉంచింది.

అబాంతీ శంకర్‌నారాయణన్‌
abanti1ఈమె ప్రపంచంలో స్పిరిట్‌ ఉత్పత్తి చేసే అతి పెద్ద సంస్థ అయిన డియాజియో సంస్థకి రెండుసార్లు మేనేజింగ్‌ డైరెక్టర్‌గా నియమితురాలయ్యింది. అంబాంతీ 2010లో డియాజియో ఇండియా లిమిటెడ్‌ సంస్థలో చేరి మార్కెటింగ్‌ డైరక్టర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టింది. తన కృషితో గుర్తింపు పొంది డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ స్థాయికి చేరింది. మొన్న జులై నెలలో మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించింది. ఈమె విజయ పరంపరలో భాగంగా 2011లో ‘రోజన్స్‌ రిజర్వ్‌’ అనే విస్కీ ఉత్పత్తిని ప్రారంభించింది. విదేశీ ప్రమాణాలున్న ఈ మద్యం భారతదేశ ప్రాంతీయ సంస్థలకు 2002లో ధారాదత్తం చేసి, అంతర్జాతీయ ప్రమాణాలున్న ఓడ్కా వంటి వాటిని మాత్రమే భారతదేశంలో అమ్మకాలు చేస్తోంది. ‘ఈ వ్యాపారంలో ఎంత వీలైతే అంత తొందరగా అనుకున్న టార్గెట్స్‌ చేరుకుని మరింత అభివృద్ది పథంలో నడిపించాల’న్న తన కోరికను వ్యక్తం చేసింది అబాంతీ.

ఈమె ఈ సంస్థలోకి రాక పూర్వం మౌంట్‌ ఎవరెస్ట్‌ మినరల్‌ వాటర్‌ (టాటా గ్రూప్‌ సంస్థ)లో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా, డిప్యూటీ సిఇఓగా పనిచేసింది. టాటా గ్రూప్‌ మంచినీళ్ళు బాటిల్‌ రూపంలో రావడానికి ఈమె చూపించిన చొరవ, కృషే కారణంగా చెప్పవచ్చు. హిమాలయా వాటర్‌ బాటిల్‌ ప్రపంచవ్యాప్తంగానే కాకుండా ప్రతి చిల్లర దుకాణాల వరకూ వ్యాపించేలా చేసింది. ఇదే విధంగా టాటా గ్రూప్‌లో ఎన్నో వినియోగదారుల ఉత్పత్తులు భారతదేశంలోను, యుకెలోను, యుఎస్‌లోను అందరికీ అందుబాటులోకి తేవడానికి అబాంతీ ఎంతో కృషిచేసింది. ఇలా అనేక రంగాల్లో తన ప్రతిభని చాటుకుంటూ ఇప్పుడు ఎంతో స్థాయికి ఎదిగి ఫార్ట్యూన్‌ మాగజైన్‌లో తను కూడా ఒక అత్యంత శక్తివంతమైన మహిళగా మన ముందుకు రావడం మనకి కూడా ఒక గర్వకారణమేగా..!

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top