You Are Here: Home » చిన్నారి » కథలు » ఇదేం ప్రేమరా… బాబు..!

ఇదేం ప్రేమరా… బాబు..!

SUNDAY-STORYనేను ఈ లోకంలో వున్నానా? ఏమో… వున్నాననే అంటున్నారందరు… ‘‘రేయ్‌ వినయ్‌ ఎందుకలా అలా మూడీగా వున్నావ్‌? ఇంతకుమునుపు అందరితో కలిసి మాట్లాడేవాడివి’’. ఏమని చెప్పను. నాలో నేను లేనని చెప్పాలా? నా మనసు ఇంకొకరికి ఇచ్చేసానని చెప్పాలా? లేకా మౌనంగా వుండిపోయి… వారిని ఇబ్బంది పెట్టాలా? ఏమీ అర్థం కాలే దు… ఆకలి దప్పికలు లేని యోగిలా తయారయ్యాను. ‘‘ఒరేయ్‌… అన్నయ్యా… ఏమైందిరా నీకు… అరుస్తున్నా వినిపించుకోవేం…’’ అం టూ చెల్లెలు పల్లవి మొటిక్కాయ పెట్టి లేపితేగాని ఈ లోకంలోకి రాలేకపోతున్నాను. పిచ్చితల్లి అన్నయ్యంటే పిచ్చి ప్రేమ. తనతో పాటే నేను భోంచేయకపోతే… తను భోంచేయదు. అరక్షణం నన్ను వదిలిపెట్టి వుం డదు. అమ్మ కొంగుపట్టుకొని తిరిగినట్టు… కాలేజ్‌కు వెళ్ళేటప్పుడు నా చెయ్యి పట్టుకొని వెంటనడుస్తుంది.

కల్పన అనే అమ్మాయి ప్రే మలో పడినప్పటినుండి నన్ను నేను కోల్పోయి… అమెలోకి లీనమైపోయాను. నాలోకం కల్పన… నా ప్రపంచం కల్పన… ఇదేం ప్రేమరాబాబు! రక్తబంధాన్ని కూడా లెక్కచేయనివ్వదు… పగలు రాత్రికి తేడా కనిపించనివ్వదు.. ‘‘అమ్మా ఆకలి’’ అంటూ కంచం ముందర వాలిపోతాను. అమ్మ అన్నం వడ్డించగానే ‘‘ఎందుకో ఆకలిగాలేదు’’ అంటూ ఉన్నపలంగా లేచి వెళ్ళిపోతాను. చీర కొంగు మూతికి అడ్డుపెట్టుకొని విచిత్రంగా నా వైపు చూస్తూ గుమ్మంలో నిలబడిపోతుంది అమ్మ.‘‘రేయ్‌ బండవెధవా… అలా కూర్చోని తూలకపోతే… వెళ్ళి పడుకో… కమ్మగా నిద్రపోతావ్‌… ఈ మధ్య నీకు నిద్ర ఎక్కువైందిరో… కాస్త తగ్గించుకో… పగలు నిద్ర పనికేకాదు నీ చదువుకు కూడా చేటు…’’ తల భూమికి వాల్చి… కల్పన గురించి తీవ్రంగా ఆలోచించడం నాన్నకు నిద్రపోతున్నట్టుగా అనిపించి ఇలా అంటుంటాడు.

స్టూడెంట్స్‌కు సబ్జెక్ట్సులో ఏ ప్రాబ్లం ఎదురైనా నా వద్దకే వచ్చి తీర్చుకొనేవారు… సెమినార్‌ క్లాస్‌లో నేనే ఫస్ట్‌… ‘‘వినయ్‌ చూడు ఏ పరీక్షపెట్టినా ఫస్ట్‌క్లాస్‌లో మార్కులు సంపాదిస్తాడు.. నువ్వున్నావ్‌ సుద్ద వేష్ఠు…’’ అంటూ క్చరర్‌ నన్ను పొగడుతూ… పక్కవారికి క్లాస్‌ పీకుతుంటే గర్వంగా ఫీలయ్యోవాన్ని. మొన్న రాసిన మొదటి టెస్ట్‌లో… కేవలం ఏడుమార్కులే వచ్చినా నా పేపర్‌ చూసి. బి.పి. టాబ్లెట్‌ నాతోనే తెప్పించుకున్నాడు మా లెక్చరర్‌… కల్పనపై వ్యామోహం పెరిగి. నాలో జ్ఞాపకశక్తి తరిగిపోయి… మార్కులు పడిపోయాయి. ఉదయం ‘హాయ్‌’ అంటూ ఎంట్రీ ఇస్తుంది… సాయంకాలం ‘బాయ్‌’ అంటూ వెళ్ళిపోతుంది. ఈ రెండింటి మధ్యలో ఏవీ జరగలేదనే బాధ నన్ను నిలవనీయడం లేదు. ఉదయం లేవగానే… టూత్‌బ్రష్‌ పట్టుకోవాల్సిన నా చేతులు… సెల్‌ఫోన్‌ పట్టుకొని కనిపిస్తే చాలు… పల్లవి కోపం కాలనాగులా నాపై బుసలు కొడుతుంది. ‘‘ఇదేం మయ రోగం రా… ఈ జన్మకు నువు బాగుపడవ్‌…’’ అంటూ చివాట్లు పెడుతుంది. ఏం చేద్దాం… నా సెల్‌ నుండి కల్పన సెల్‌కు రోజుకు రెండు వందల మెసేజ్‌లు, యాభైకు పైగా కాల్స్‌ వెళ్ళంది మనసు ఒప్పకోదు.

కల్పన చాలా బాగుంది… ఆమె బుగ్గలకు నును సిగ్గులు తోడైతే పసిడి మొగ్గలా ముఖం విచ్చుకుంటే ఇంకా కాసేపు చూడాలనిపిస్తుం ది. తను నవ్వితే పాలరాతి పలకల్లా పేర్చినట్లు తెల్లని పళ్ళువరుసలు… మృదువైన ఆధరాలపై లాలాజల తేనె పట్టులు… వర్ణణకే అంతుచిక్కని సుందరిలా కల్పన నా ముందు తిరుగాడుతుంటే… మనసు ఒక పట్టాన నిలువగలదా…? ప్రేమించకుండా వుండ గలడా…? ఔను…. నేను కల్పన అందాన్ని ఇష్టపడుతున్నానా..? లేక… ఆమె గుణగణాల్ని ఇష్టపడుతున్నానా…? ఏదైతేనేమి మొ త్తానికి కల్పనే నా ప్రపంచం అయింది. ‘‘అమ్మా… అన్నయ్య ఈ మ ధ్య నాతో సరిగా మాట్లాడ్డం లేదు… ఏదో మూడీగా వుంటున్నాడు. ఇంతకు మనుపు నాకు ఏది ఇష్టమైతే అది చటుక్కన తీయించేవాడు… వారం వారం సినిమాకు తీసుకెళ్ళేవాడు… ఇప్పుడు మాట్లాడితే చాలు కసురుకుంటున్నాడు…’’ బుంగమూతి పెట్టి ఏడుస్తున్నట్టు అమ్మతో చాలాసార్లు మొరపెట్టుకుంది పల్లవి. చెల్లెలికి నేనంటే ప్రాణం… నాకు కల్పనంటే ప్రాణం… అమ్మకే నా ప్రవర్తన అర్థంగాక బుర్రగోక్కుంటోంది… ఇక పల్లవికేం సమాధానం చెబుతుంది పాపం.

కాసేపైనా ఇంటిపట్టున లేకుండా పోవడం నాన్నకు కోపం తెప్పించింది… మొన్నరాసిన మొదటి పరీక్ష పేపర్స్‌… ముందు పరిచయమైన మా సార్‌తో తెప్పించుకొని చూసాడు… నేను ఇంట్లోకి అడుగు పెట్టగానే విసిరి నా ము ఖాన కొట్టాడు. ‘‘చూడరా… బాగా చూడు…పదవతరగతి… ఇప్పుడు ఇంటర్‌లోకి అడుగుపెట్టాక… నీకు వచ్చిన మార్కుల్ని చూసి… పొ గిడిన ఆ నోళ్ళే… నిన్ను హేళన చేస్తున్నాయి… ఈ మార్కులు ఎవరైనా చూస్తే… ఉమ్మేస్తార్రా…’’ అంటూ నాన్న కోపంగా లోపలికి నడిచాడు.భగవంతుడు మనిషికి రెండు చెవులు ఇచ్చి చాలా మంచి పని చేసాడు… ఒకటి వినడానికి ఇంకొకటి విన్నది వదిలేయటానికి… నా న్న తిట్లకు అస్సలు ఫీలవలేదు నేను… ఈ మధ్య నేను ఎక్కువగా తిరుగుతున్నానని నాన్న నాకు డబ్బులివ్వడం తగ్గించాడు…ఐతేనేమీ సమాజంలో బాగా పేరు సంపాదించాడు… నాన్న పేరును ఎరగా వేసి షావుకార్ల దగ్గర నా విలాసాలకు అప్పు చేయడం మొదలు పెట్టాను…

స్నేహితులు దగ్గర, బంధువుల దగ్గర అప్పులు చేస్తూ… కల్పన దృష్టికి ఉన్నతంగా కనిపించాలని, పడరాని పాట్లు పడ్డాను. రోజుకో డ్రెస్సు… వారానికి ఒక సెల్‌ఫోన్‌ మారుస్తూ… హూందాగ తిరుగుతున్న నాకు ఐనవాళ్ళు, స్నేహితులు, ఆప్తులు, అందరూ వుండీ కూడా కల్పనే నా ప్రపంచం అనుకొని ఒంటరిగా తిరుగుతున్నాను.కల్పన పుట్టినరోజే పల్లవి పుట్టిన రోజు కావడంతో దిక్కుతోచని స్థితిలో వుండిపోయాను… ఐనా తోడబుట్టిన దాని ప్రేమకంటే… కల్పన పైగల మోజే నన్ను ముందుకు నడిపించింది.. పల్లవి పుట్టినరోజు పండుగ విచారంగానే ము గించింది. ఆనందబాష్పాలు చూడాల్సిన చెల్లెలి కంట్లో కన్నీళ్ళు చూసి నా గుండెతరుక్కుపోయిం ది…పల్లవి నాతో మాట్లాడ్డం మానేసింది. నేను కల్పన ప్రేమలో కుతికిలదాక ము నిగిపోయానన్న విషయం… పల్లవికి తెలిసిపోయింది. ఈ మధ్య మొండివైఖరి నాలో విజృం బించింది.

ఉన్న డబ్బు నా కాలేజ్‌ ఫీజులకు, నా తిరుగుడుకు విలాసాలకే ఖర్చు ఐపోయిం ది. ఐనా నాలో ఏదో తీరని లోటు… కల్పనను క్షణం చూడకుండా వుండలేని లోటు… ఇద్దరం కలసి ఆ సుఖాలను పంచుకోలేదనే లోటు… తనివితీరా చూడలేకపోతున్నాననే లోటు… ముద్దు ముచ్చట తీరలేదనే లోటు… వెతుకులాటలో కళ్ళు అలసిపోతున్నాయి. తలచుకొంటూనే మనసు సొలసిపోతోంది. అంతేకాదు.. నాలో స్వార్ధం కూడా ప్రేమతోబాటే పుట్టింది. కల్పన నా వైపు తప్ప ఎవరివైపు చూడకూదనే స్వార్ధం… నేను తప్పఏ మగా డు తనను పలకరించకూడదనే స్వార్ధం… తను నా గురించే ఆలోచించాలనే స్వార్ధం… తను ఏం చేసినా నా కోసమే చేయాలనే స్వార్ధం.. ప్రేమలో స్వార్ధ్థం కూడా సగం నిండిపోయిందా..? ఇదేం ప్రేమరాబాబు! అని అనిపించింది. మరోవైపు అనుమానం… కల్పన ప్రీతిగా ఎవరినైనా పలకరిస్తే సహించలేని అ నుమానం తను ఎటువైపు చూసి నవ్వినా…

అటువైపు ఎవరో వుండివుంటారనే పాడు అ నుమానం… నాకు దూరమైపోతుందేమో… అనే భయంతో కూడుకున్న అనుమానం… ఫోన్‌లో ఇంకెవరితోనైనా మాట్లాడుతోందా..? అనే అనుమానంతో… ఒక్కోసారి కల్పన దగ్గరున్న ఫోన్‌లో కాల్‌లిస్ట్‌ మొత్తం వెతికేస్తాను… ఇదేం ప్రేమరా బాబు! అనుమానం కూడా పుట్టిస్తుంది. పైగా… టెన్షన్‌… కల్పనతో మా ట్లాడ్డానికి… అవకాశం కోసం ఎదురు చూసే టెన్షన్‌… కలిసి తోడుగా వెళదామంటే… ఎవరైనా చూస్తారేమో అనే టెన్షన్‌… ఐ లవ్‌యు చెప్పాలనే టెన్షన్‌… చెప్పాక పరిస్థితి ఎలా మారుతుందోననే టెన్షన్‌… మాట జారినా టెన్షన్‌.. మాట ఇచ్చినా టెన్షన్‌… అసలు లవ్‌ అంటేనే ఓ పేద్ద… టెన్షన్‌… ప్రేమంటే ఎంజాయ్‌మెంట్‌గా వుండాలంటారుగాని… నా లెక్క లో అలర్ట్‌మెంట్‌గా వుంటేనే బెటర్‌…

మొదట కల్పనను ఇష్టపడుతున్నానని తెలి సి… నా ఫ్రెండ్స్‌… ‘‘ఎరా… లైన్‌ కలిపావా..?’’ అనేవారు.. దానికి నేను ‘‘ట్రై చేస్తున్నాను’’ అంటూ బదులిచ్చేవాడిని… ‘‘జాగ్రత్త రో… తొందరగా కలుపు లేదంటే లైన్‌ బిజీ వస్తుం ది…’’ అంటూ నవ్వేవారు. కల్పనతో బాగా మాట్లాడ్డం మొదలు పెట్టాక.. ‘‘ఏరా… యాక్టివేషన్‌ చేసావా…’’ అంటూ ఒకడంటే… ‘‘పాపం వాడికి సర్వర్‌ డౌన్‌రా…’’ అంటూ హేళన చేసేవారు… వీరి లెక్కలో ప్రేమంటే శృంగారామా? ఔను… దానికోసమే కల్పన కోసం ఎంతగానో తపించి పోతున్నాను… అమె ఒడిలో క్షణం సేపు సేద తీర్చుకోవడం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను… కల్పన కోసం కన్నీరు కార్చాను… తను కరిగిపోయి నా ఒడిలో వరిగిపోతుందని…

ఒక్కసారి అమె సున్నితమైన చేతుల్ని పట్టుకొని, పట్టులాంటి ఆ దేహన్ని మెత్తగా హత్తుకుపోవాలనే ఆశ నన్ను నిలవనీయడం లేదు. ఎంతసేపని కల్పన వైపు కన్నార్పకుండా చూడను. ఎంతసేపు నాలో కోర్కెలను గుఱ్ఱాలై పరిగెత్తించను. ‘ప్రేమించాలి’ అంటే యువత భావోద్వేగభాషలో ‘రమించాలి’ అని అర్థం… కల్పన నా కోసం అన్నట్టు ఒంటరిగా కనిపించింది. ‘‘కల్పనా…’’ పిలిచాను.. ‘‘చెప్పరా…’’ నన్నెప్పుడూ ప్రేమగా ‘రా’ అంటూ చివరిగా సంభోదించడం కల్పనకు పరిపాటే… ‘‘నువ్వంటే నాకిష్టం’’ అనేసాను… ‘‘ఇది పాతమాటేగా…’’ దీర్ఘిస్తూ అంది… ‘‘అది కాదు… ఎంత కాలమని ఇలా చూపుల్తో సరిపెట్టుకోవాలి… కాస్త ముందుకు ఆలోచించరాదు…. ప్లీజ్‌…’’ నా నాలుక తడబడకుండా అనేసింది… ‘‘ముందుకంటే…?’’ ఈ ప్రశ్నకు సమాధానం ఏమని చెప్పాలి… అమ్మాయిలు ఎంతసేపూ కళ్ళకు మాత్రమే పదను పెడతారు.

బుర్రకి పదను పెట్టరా… కాస్త చిరాకేసింది… ‘‘మనిద్దరి మధ్య హద్దులు చెరిపేసుకొని… ముద్దుల వరకు వెళ్ళితే ఎలా వుంటుంది…’’ అనేసాను… కల్పన మౌనంగా వుండిపోయింది… ‘‘మౌనం అర్ధాంగీకారం కదూ…?’’ అన్నాను. ‘‘అది అర్ధాంగికీ నాకు కాదు…’’ అనేసింది వెంటనే… ‘‘ప్లీజ్‌… నన్ను అర్థం చేసుకో… నిన్ను నా ప్రాణంగా చూసుకున్నాను… పిచ్చిగా ప్రేమించాను…’’ అంటుండగానే గట్టిగా నవ్వేసింది కల్పన…
‘‘ఔను… నన్నేకాదు నా అందాన్ని పిచ్చపిచ్చగా ప్రేమించావ్‌… నువ్వు లేకపోతో బ్రతకలేనన్నావ్‌… వెరీగుడ్‌… నీ ప్రేమ చాలా గొప్పది… అందాన్ని అనుభవించటం కోసం దానికి ‘ప్రేమ’ అనే ట్యాగ్‌ను తగలేసి ఆశగా ఎదురు చూసావ్‌… ఈ ప్రపంచాన్ని మరిచిపోయి… నా అందమే ఒక రంగుల ప్రపంచం అనుకొని, కోరికతో పిచ్చివాడిలా మారిపోయావ్‌… చదువును కోల్పోయావు…

స్నేహితుల్ని దూరం చేసుకున్నావు… చివరికి ఎంతో ప్రాయాసపడ్డావు… సమయానికి తిండి తినకుండా ఎలా చిక్కిపోయావో చూడు ప్రేమ పిచ్చివాడిగా మారి అందర్నీ దూరం చేసుకున్నావు… ఇప్పుడు నేను కాదంటే ఉన్మాదిలా మారిపోవని గ్యారెంటీ ఏంటీ… నాక్కూడ ఎ న్నో ఆశలున్నాయి… అన్నీ వదిలేసి నీ కోసం పిచ్చిదానిలా మారిపోమంటావ్‌.. అంతేనా…? కన్నవాళ్ళనే పట్టించుకోని నువ్వు… నేను నీతో వచ్చాక ప్రేమగా చూసుకుంటావని గ్యారెంటీ ఏంటీ…? చెల్లెలికి పెళ్ళి చేసి న్యాయం చేయలేని నువ్వు… నన్ను పోషిస్తావన్న నమ్మకమేం టి…? ప్రేమించినంత సులువుకాదు కలిసి జీవించడమంటే… ప్లీజ్‌ నన్ను మరిచిపో…’’.
అన్న కల్పన చివరి మాటకు నా కళ్ళల్లో నీళ్ళు జలదలా రాలిపోయాయి…
‘అవును కల్పన… నిన్ను ప్రేమించలేదు… నీ అందాన్ని ప్రేమించాను… కరక్టే కాదనను… కానీ… నువ్వే ప్రపంచం అనుకొని తిరగానే గానీ…

అత్యాశతో మరో ప్రపంచం కావాలనుకోలేదు… ప్రతిక్షణం నీ గురించే ఆలోచించడంలో… నన్ను నమ్ముకొని ‘నా’ అనే వాళ్ళు వున్నారన్న సంగతి మరిచిపోయాను. నా కడుపు ఆకలితో అలమటిస్తున్నాకూడా… నీ జ్ఞాపకాలతోనే నింపుకొని జీవించాను… నీ కోసం చదువులో ఓడిపోయాను… నీ కోసమే మా వాళ్ళందరికి దూరంగా ఒంటరిగా గడుపుతున్నాను… నీ కోసమే స్నేహితుల్ని దూరం చేసుకున్నాను… ఇందాక నువ్వు అన్నావే… నా అందాన్ని అనుభవించటం కోసం దానికి ‘ప్రేమ’ అనే ట్యాగ్‌ను తగలేసుకున్నావని… ఔను నీ అందాన్నే కాదు… నీతోనే జీవితం… అనుభవించాలనుకున్నాను… ఏ లోటు రాకుండా నీ అందాన్ని పువ్వుల్లో పెట్టి పోషిం చాలనుకున్నాను అందుకే పిచ్చివాడిలా నీ వెంట తిరిగాను. రోజుకో అమ్మాయిని మార్చ డం నాకూ తెలుసు… పవిత్రమైన ప్రేమను అపవిత్రం చేయడం నాకిష్టం లేదు… అందుకే నిన్నే కావాలనుకున్నాను…

నీతోడే వుండాలనుకున్నాను… నిన్ను అడగాల్సిందే అడిగాను..సారీ కల్పన..నీ లెక్కలో ప్రేమంటే ఒక గేమ్‌ అని తెలీదు… అందులో ఖచ్చితంగా ఒకరు ఒడిపోతారని తెలీదు… నీ లెక్కలో ప్రేమంటే సిగరెట్‌… మొదట వెలిగించిందీ నువ్వే… చివరికి చిదిమేసింది నువ్వే… నేను దుడుకు పడ్డాను… తొందరలో అడిగేసాను… ఇన్నాళ్ళు నన్నెందుకు ఇంత ప్రేమగా చూసా వో అర్థం కాలేదు… నాకు అందరూ వుండీ కూడా పిచ్చివాడిలా ఒంటరిగా నీ కోసం అన్వేషణ చేసాను… చూపుల్తో నా మనసును వశపరచుకున్నావ్‌… మాటల్తో నాలో ఆశలు రేెత్తించావ్‌… అందర్నీ దూరం చేసుకొని నీ కోసం వస్తే… నేను నీకు తగనంటున్నావ్‌… సరే వస్తాను…’’. అంటూ కన్నీళ్ళు తుడుకుకొంటూ వెళ్ళి ఒక చెట్టు క్రింద కూర్చున్నాను… ఎవరో భుజం తట్టారు… వెనక్కి తిరిగి చూస్తే… నా మిత్రుడు శ్యామ్‌… నన్ను అక్కడినుండి నేరుగా బస్తీలోకి తీసుకెళ్ళాడు… సరిగ్గా ఇరవై సంవత్సరాలు కూడా నిండని కుర్రాడు… బాగా తాగేసి తూలుతూ నడుస్తున్నాడు… చేతిలో రెండు పుస్తకాలు… మరో చేతిలో సెల్‌ఫోన్‌ పట్టుకున్నాడు…

‘‘చూసావా… వీడి పేరు జబీర్‌ఖాన్‌, మంచి ఇంటలీజెంట్‌ పర్సన్‌… ఉత్తమ విద్యార్థిగా రెండు సార్లు ప్రిన్సిపాల్‌ చేతుల మీదుగా బహుమతి అందుకున్నాడు… ఈ మధ్యే… శ్రీకన్య అనే అమ్మాయి ప్రేమలో పడి చదవడం మరిచిపోయాడు… ప్రతి రోజు ఐదు వందల మెసేజ్‌లు. వందకు పైగా కాల్స్‌ చేస్తూ… సమయం వృథా చేసాడు… తీరా అసలు విషయం చెప్పగానే అమ్మాయి ‘నో’ అనేసింది. అప్పట్నుంచి ఇలా తాగుడుకు భానిసయ్యాడు. ఇలా రా చెప్తాను…’’
అంటూ ఊరి చివర చిన్నపాటి నాగలకట్ట దానిపై ఒక కుర్రాడు… దారి వెంబడి పోయో వాళ్ళను చూస్తూ కూర్చున్నాడు… అంటే తను ఏదో దీర్ఘాలోచనలో వున్నాడు.‘‘వీన్ని చూసావా… నాకీ ప్రపంచంలో సంబంధం లేదన్నట్టుగా కూర్చొని వున్నాడు… వీడి పేరు నవీన్‌… శిరీష అనే అమ్మాయంటే వీడికి పిచ్చిప్రేమ. ప్రతి క్షణం ఆ అమ్మాయి గురించి ఆలోచించి… వీడిలో వున్న మంచి క్రీడాకారున్ని చంపేసాడు. వాలీబాల్‌ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచి… జాతీయ క్రీడకు ఎంపికయ్యాడు. శిరీషను వదిలిపోవడానికి ఇష్టం లేక, వద్దు అనుకొని ఇంటి దగ్గరే వుండిపోయాడు…

కొడుకు ప్రవర్తనతో విసిగిపోయిన వీళ్ళ నాన్న… గుండె జబ్బుతో మొన్న చనిపోయాడు… తీరా శిరీషకు ఐ లవ్‌ యు… చెప్పగానే ఆమె తిరస్కరించింది… అన్నీ కోల్పోయి ఇలా మతిస్థిమితం లేని వాడిలా తయారయ్యాడు. వీడి ఖర్మ ఇలా రాసిపెట్టుంది..’’అంటూ శ్యామ్‌ అతన్ని చూపించి వివరించగానే నాలో జ్ఞానేంద్రియాలు పని చేయడం మొదలు పెట్టాయి. అక్కడే క్షణం నిలవనీయలేదు శ్యామ్‌… ‘‘రా వెళ్దాం’’ అంటూ పక్క వీధిలోకి తీసుకెళ్ళాడు. పదహారణాల పడుచుపిల్ల… చైర్‌లో కూర్చుని విచారపు ముఖకవళికలతో ధీనంగా వుంది. ఏడ్చి ఏడ్చి అలసిపోయిన కళ్ళు… కళ్ళ క్రింద కన్నీటీ చారలు స్పష్టంగా కనిపిస్తున్నాయి… తల కూడా దువ్వినట్టు లేదు…‘‘ఈ అమ్మాయి పేరు భార్గవి… అశోక్‌ అనే అబ్బాయిని అమితంగా ఇష్టపడింది. అబ్బాయి గురించి కలలుకంది… తన ఫ్రెండ్స్‌తో కూడా అశోక్‌ గురించి గొప్పగా చెప్పుకుంది. వీళ్ళిద్దరి ప్రేమించుకొంటున్న సంగతి ఆ నోట ఈ నోట పడి చివరికి ఊరంతా పాకిపోయింది. భార్గవిని చదువు మాన్పించాడు వాళ్ళ నాన్న…

ఐనా సరే భార్గవి, అశోక్‌ను చాటుమాటుగా కలవడం మొదలుపెట్టింది. అశోక్‌ తనను పెళ్ళి చేసుకుంటాడన్న నమ్మకంతో… వచ్చిన సంబంధాల్ని కాదనుకుంది. కానీ… అశోక్‌ మరో అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడని తెలిసి, భార్గవి చాలా బాధపడింది. అశోక్‌ను నిలదీసింది.. ‘నీ ఇష్టం వచ్చింది చేసుకో…’ అంటూ ఉడాయించాడు అశోక్‌… పాపం ప్రేమే కాదు జీవితం కూడా తిరగబడింది భార్గవికి. వచ్చిన సంబంధాల్ని పొగొట్టుకొని… నమ్మిన వాడు దూరం అయ్యేసరికి ఒంటరిగా మిగిలిపోయింది… ఇప్పుడు వస్తున్న సంబంధాల కూడా అమ్మాయి గతాన్ని విని పారిపోతున్నాయి… ప్రేమను నమ్ముకున్న నేరానికి.. మానసిక వేదనే శిక్షగా మారింది. ఇలా పిచ్చిదానిలా కూర్చుంది…’’.అంటూ శ్యామ్‌ ముగించగానే నాలో కంపరం మొదలైంది… అక్కడి నుండి నేరుగా హాస్పిటల్‌కు తీసుకెళ్ళాడు. అక్కడ ఒక కుర్రాడు బెడ్‌ పై పడుకున్నాడు… కోమాలో వున్నాడు. అతని చుట్టూ వాళ్ళ బంధువులు కూర్చుని బోరున ఏడుస్తున్నారు…

అతన్ని చూపించాడు శ్యామ్‌.‘‘వీడి పేరు జగదీశ్వర్‌రెడ్డి… చాలా వినయం విధేయత గల అబ్బాయి… ఒక్కగానొక్క కొడుకు… పోయిన సంవత్సరం అత్యధిక మార్కులతో పాసయ్యి వార్తా పత్రికల్లోకి కూడా ఎక్కాడు. అంతలోనే వీడికి లావణ్య అనే అమ్మాయి పరిచయం అయ్యింది. ఆమె వ్యామోహంలో పడిపోయి చదువును వదిలేసాడు. కేవలం లావణ్య కోసమే కాలేజ్‌కు రావడం పనిగా పెట్టుకున్నాడు. లాయర్‌ అవుదామన్న భవిష్యత్తు కోర్కెలకు గొళ్ళెం వేసి, లావణ్య ప్రేమలో మునిగిపోయాడు. అస్తమానం ఆమె గురించి ఆలోచిస్తూ… మెంటల్‌గా షాక్‌కు గురయ్యాడు. మనుషుల్ని గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు. అధిక ఆలోచన వత్తిడి వలన… వీడి తలలో నరాలు వీక్‌ ఐపోయాయని డాక్టర్లు చెబుతున్నారు…’’.అంటూ శ్యామ్‌ ముగించాడు… నా కళ్ళల్లో కన్నీటికి ఆనకట్ట వెయ్యలేకపోయాను… హాస్పిటల్‌ బయటికి వచ్చేసాము… నా వైపు కోపంగా చూసాడు శ్యామ్‌…

‘‘చూసావా…? ఇలాంటి వాళ్ళు వీధికి ఒక్కరు వున్నారు.. కాలేజీ అనేది కాలక్షేపానికే అనుకుంటే… వేలకు వేలు డొనేషన్‌లు కట్టి అంతదూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రేమనేది ఎంజాయ్‌మెంట్‌ కోసం అని అనుకుంటే.. ఇంత మెంటల్‌టెన్షన్‌ పడాల్సిన అవసరం లేదు.. ప్రేమించుకొంటున్నారు అంటే… రెండు పెదవులు, రెండు దేహాలు కలుపుకొంటారు అనే స్థాయికి ప్రేమను దిగజార్చారు… ఛీ! ప్రేమనేది శరీరాల్లో నుండి పుట్టదురా… మానవత్వం నుండి పుడుతుంది… అనుక్షణం నీగురించి బెంగపెట్టుకొనే తల్లిని అడుగు ప్రేమంటే ఏమిటో చెబుతుంది. అనుదినం నీ భవిష్యత్తు బాగుండాలని తపిస్తూ కృషించే మీ నాన్నను అడుగు ప్రేమంటే ఏమిటో చెబుతాడు. నువ్వు ఏడిస్తే ఓదార్చుతూ కన్నీళ్ళను తుడిచే నీ చెల్లిని అడుగు ప్రేమంటే ఏమిటో చెబుతుంది.నీ బాధల్ని సరిసగం పంచుకునే నీ స్నేహితున్ని అడుగు ప్రేమంటే ఏమిటో చెబుతాడు. అమ్మాయి అందాల్ని ఎంచుకునేది కాదురా ప్రేమంటే… అమ్మాయి బాధల్ని పంచుకునేది ప్రేమ… రెండు పెదవులు కలిపేది కాదుర ప్రేమంటే…

రెండు మనసులు (హృదయ స్పందనలు) కలిసేదిరా ప్రేమ… ఆశించడం ప్రేమ కాదురా… మన్నించడం ప్రేమ… ప్రేమించమన్నారే గాని కన్నవారిని మరచిపొమ్మనలేదురా… ఒక్కసారి నీ వాళ్ళను చూద్దువుగానిరా… అసలైన ప్రేమ వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తుంది…’’. అంటూ నన్ను మా ఇంటికి తీసుకెళ్ళాడు శ్యామ్‌… నా మీద బెంగతో నాన్న మంచాన పడ్డాడు.కళకళలాడుతు న్న అమ్మ ముఖం పాలిపోయివుంది… నన్ను చూడగానే పల్లవి పరిగెత్తుకొంటూ వచ్చి నన్ను హత్తుకొని బిగ్గరగా ఏడ్చింది. అంతే నా కళ్ళు చమర్చాయి… ఇదేం ప్రేమరా బాబు! ఇంత పని చేసింది… పరోక్ష కామంతో మూసుకుపోయిన నా కళ్ళను నా స్నేహితుడు శ్యామ్‌ తెరిపించా డు… వాడికెప్పుడూ ఋణపడి వుంటాను…

– నరెద్దుల రాజారెడ్డి,
సెల్‌: 9666016636

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top