You Are Here: Home » సినిమా » పాటలు » ఇది కథ కాదు (1979)- ఆ… ఆ… ఆ… ఆ… ఆ…..

ఇది కథ కాదు (1979)- ఆ… ఆ… ఆ… ఆ… ఆ…..

పల్లవి :
ఆ… ఆ… ఆ… ఆ… ఆ…..
గాలికదుపు లేదు కడలికంతు లేదు
గంగ వెల్లువ కమండలంలో
ఇమిడేదేనా
ఉరికే మనసుకు గిరి గీస్తే అది ఆగేదేనా

చరణం : 1
ఆ నింగిలో మబ్బునై
పాడనా పాటలు ఎన్నో
ఈ నేలపై నెమలినై
ఆడనా ఆటలు ఎన్నో ॥నింగిలో॥
తుళ్లి తుళ్లి గంతులు వేసే
లేగకేది కట్టుబాటు
మళ్లి మళ్లి వసంతమొస్తే
మల్లెకేల ఆకుచాటు ॥
చరణం : 2
ఓ తెమ్మెరా ఊపవే
ఊహల ఊయల నన్ను
ఓ మల్లికా ఇవ్వవే
నవ్వుల మాలిక నాకు
తల్లి మళ్లీ తరుణయ్యింది
పువ్వు పూచి మొగ్గయ్యింది
గుడిని విడిచి వేరొక గుడిలో
ప్రమిదనైతే తప్పేముంది

చిత్రం : ఇది కథ కాదు (1979)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : ఎం.ఎస్.విశ్వనాథన్
గానం : ఎస్.జానకి

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top