You Are Here: Home » చిన్నారి » కవితలు » ఇతరులం

ఇతరులం

రూ నీడ
గాలీ భూమి
ఎండా వాన
అన్నీ తమవే
అనుకునే వారు తప్ప

ఎక్కడైనా –
నీడనిచ్చే చెట్టు
దాహం తీర్చే బావి
ఆకలి తీర్చే అన్నం
ప్రాణం పోసే – గాలి ఎండా వర్షం
అన్నీ భరిస్తున్న భూమి
ఎప్పుడూ అడగలేదు
ఎవరని
ఎక్కడివారని
ఏమి హక్కుందని

హద్దు, హక్కులూ లేని హాయిలో
పాస్‌ పోర్టు అయినా లేకుండా
ఎక్కడైనా పక్షి పక్షే

ఒకే ఆకాశం కింద
కిటికీ బయటా లోపలా
ముక్కలైన ప్రపంచంలో ముడుచుకుని
నువ్వూ నేనే
బతికినన్నాళ్లూ
నీది నాదని!

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top