You Are Here: Home » సినిమా » పాటలు » ఇంద్ర (2002)- ఘల్లు ఘల్లుమని

ఇంద్ర (2002)- ఘల్లు ఘల్లుమని

పల్లవి : ఘల్లు ఘల్లుమని
సిరిమువ్వల్లే చినుకే చేరగా
ఝల్లు ఝల్లుమని
పులకింతల్లో పుడమే పాడగా ॥ ఘల్లు ॥
హరివిల్లు విప్పి కరిమబ్బు వాన
బాణాలే వేయనీ
నిలువెల్ల మంచు వడగళ్లు తాకి
కడగళ్లే తీరని
జడివాన జాడతో ఈ వేళ
జన జీవితాలు చిగురించేలా
రాలసీమలో ఈ వేల
రతనాల ధారలే కురిసేలా ॥ జడివాన ॥ ॥ ఘల్లు ॥
చరణం :1 రాకాసులు ఇక లేరని
ఆకాశానికి చెప్పనీ
ఈ రక్తాక్షర లేఖని ఇపుడే పంపనీ
అన్నెంపున్నెం ఎరగని
మా సీమకు రారామ్మని
ఆహ్వానం అందించనీ
మెరిసే చూపునీ
తొలగింది ముప్పు
అని నీలిమబ్బు మనసారా నవ్వనీ
చిరుజల్లు ముప్పు మన ముంగిలంత
ముత్యాలే చల్లనీ
ఆశా సుగంధమై నేలంతా
సంక్రాంతి గీతమే పాడే లా
శాంతి మంత్రమై గాలంతా
దిశలన్ని అల్లనీ ఈ వేళ॥ జడివాన ॥

చరణం : 2
భువిపై ఇంద్రుడు పిలిచెరా
వరుణా వరదై పలుకరా
ఆకసాన్ని ఇల దించరా
కురిసే వానగా
మారని యాతన తీర్చగా
మా తలరాతలు మార్చగా
ఈ జలయజ్ఞము సాక్షిగా
తలనే వంచరా
మహరాజు తాను సమిదల్లే మారి
నిలువెల్లా వెలిగెరా
భోగాన్ని విడిచి త్యాగాన్ని వలచి
తాపసిగా నిలిచెరా
జన క్షేమమే తన సంకల్పముగా
తన ఊపిరే హోమ జ్వాలలుగా
స్వర్గాన్నే శాసించెనురా
అమృతమును ఆహ్వానించెనురా
॥ జడివాన ॥ ॥ ఘల్లు ॥

చిత్రం : ఇంద్ర (2002)
రచన : సిరివెన్నెల, సంగీతం : మణిశర్మ
గానం : బాలు, మల్లికార్జున్, బృందం

– నిర్వహణ : నాగేష్

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top