You Are Here: Home » సినిమా » పాటలు » ఇంద్రుడు చంద్రుడు (1989)-సంధ్యా రాగపు సరిగమలో

ఇంద్రుడు చంద్రుడు (1989)-సంధ్యా రాగపు సరిగమలో

పల్లవి :

సంధ్యా రాగపు సరిగమలో
తొలి కలయికలో
సాయంకాలపు చలి చలి
ఊహల పకపకలో
డోరేమి రాగాల జోరేమి
ద స ద నా ప్రేమ
నీ మీద శ్రుతి కలిసిన
‘సంధ్యా ‘

చరణం : 1

చినుకు చినుకు నడుములో
చిలుకలులికిపడునులే
హాయ్… కనుల కనుల నడుములో
అలల సుడులు తిరిగెలే
పెదవి పెదవి తడుపులో
వలపు మధువులొలికెలే
తనువు తనువు కదుపులో
తమకమొకటి మెరిసెలే
సంధ్యలో తారలాగా
స్వప్నమైపోకుమా
కన్నెలో సోయగాలు
కంటితోనే తాగుమా
హంసలా హాయిగా ఆమని రేయిలా
వాలిపో ప్రియా

‘సంధ్యా ‘

చరణం : 2

ఎదుట పడిన బిడియమే
చెమట నుదుట చిలికెలే
వణుకు తొణుకు పరువమే
బడికి వయసు కలిపెలే
వలపు పొడుపుకథలలో
చిలిపి ముడులు విడెనులే
హాయ్… మరుల విరుల పొదలలో
మరుడి పురుడు జరిగెలే
తేనెలే దోచుకెళ్లే తుమ్మెదైగపోకుమా
గాలికే గంధమిచ్చే
కౌగిలింతే దూరమా
పాటల తోటలో పల్లవే ప్రేమగా
పాడుకో ప్రియా

‘సంధ్యా ‘


చిత్రం : ఇంద్రుడు చంద్రుడు (1989)
రచన : వేటూరి
సంగీతం : ఇళయరాజా
గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top