You Are Here: Home » విశేషం » ఇండియా గేట్‌ నిర్మాణ నేపథ్యం

ఇండియా గేట్‌ నిర్మాణ నేపథ్యం

పిల్లలూ!  మీలో మన దేశ రాజధాని ఢిల్లీని సందర్శించిన వారు అక్కడి రాజ్‌పథ్‌లో ఉన్న  ఇండియా గేట్‌ను తప్పక చూసే ఉంటారు. అయితే దీని నిర్మాణం ఎప్పుడు, ఎవరు, ఎందుకు చేపట్టారో మనం తెలుసుకుందాం.ఇండియాగేట్‌ అనేది భారతీయ సైనికుల స్మారక చిహ్నం.  ఒకటో ప్రపంచయుద్ధం, ఆఫ్ఘన్‌ యుద్ధాలలో 90,000 మంది భారతీయ సైనికులు అసువ్ఞలు బాశారు. వారి త్యాగానికి గుర్తుగా  బ్రిటిష్‌ ప్రభుత్వం నిర్మించిన స్మారకచిహ్నమే ఈ ఇండియా గేట్‌. దీనికి 1921లో ఫిబ్రవరి 10న శంకుస్థాపనచేశారు. దీని నిర్మాణం పూర్తి కావడానికి పది సంవత్సరాల కాలం పట్టింది. ఇండియా గేట్‌ ఎత్తు 42మీ. దీనిపైన మధ్యలో గిన్నెలాంటి ఆకారం ఉంటుంది. వార్షికోత్సవాల వంటి సందర్భాలలో దీంట్లో నూనెపోసి దీపం వెలిగిస్తారు. ఇండియాగేట్‌ను ‘ఆల్‌ ఇండియా వార్‌ మెమోరియల్‌ అని కూడా పిలుస్తారు. దీనర్థం ‘అఖిల భారత యుద్ధ స్మారక చిహ్నం అని.
ఇండియా గేట్‌ పైభాగంలో దీని నిర్మాణ నేపథ్యాన్ని ఇంగ్లీషు అక్షరాలలో చెక్కారు
Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top