You Are Here: Home » ఇతర » ఇంటర్‌‘వ్యూ’

ఇంటర్‌‘వ్యూ’

చదువు, మంచి మార్కుల్తో నేడు అంత త్వరగా జాబ్‌ రాదు. ప్రెజెంటేషన్‌ స్కిల్‌ ఉండి తీరాలి. ఆ జాబ్‌కి అవసరమైన పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి. అందుకే రాత పరీక్ష, ఇంటర్వ్యూకి వెళ్లే ముందు బాగా ప్లాన్‌ చేసుకోవాలి. ఫెస్‌ టూ ఫెస్‌ ఇంటర్వ్యూ చాలా సాధారణం.

1fillerరెండు, మూడు రోజులు ముందు సబ్జెక్టుని చదువుకోవాలి. నెర్వస్‌గా ఉండకుండా ఫ్రీగా రిలాక్స్‌డ్‌గా ఉండాలి. ఆ కంపెనీని గూర్చిన భోగట్టా, వర్‌‌క ప్రొఫైల్‌, దాని బ్రాంచీలు కనీసం ఇంటర్నెట్‌ ద్వారా తెల్సు కోగల్గాలి. అదెక్కడుంది, దగ్గర దారిని గూర్చి ముందే నల్గుర్ని ఎంక్వైరీ చేయాలి. రెజ్యూమ్‌ కాపీలు దగ్గ రుంచుకోవాలి. దుస్తులు మంచి నీట్‌గా ఉండి చూడగానే మంచి ఇంప్రషన్‌ కలిగించేవిగా ధరించాలి. హెవీ మేకప్‌ చేసుకోకూడదు. అరగంట ముందే ఇంటర్వ్యూ స్ధలానికి వెళ్లి రిలాక్స్‌ అవ్వాలి. పెదాల మీద చిరు నవ్వుని చెదరనీయ కూడదు, ఆత్మవిశ్వాసంతో గదిలోకి అడుగు పెట్టి విష్‌ చేయాలి. స్పష్టంగా హాయిగా మాట్లాడాలి. ఇంటర్వ్యూ చేసే వారు ఏ భాషలో అడిగితే, ఆ భాషలోనే జవాబివ్వాలి.

వారి కళ్లల్లోకి సూటిగా చూస్తూ మాట్లాడాలి. కళ్లు వాల్చి ఎక్కడో చూడకూడదు. అది మనం బలహీనతని తెలియజేస్తుంది. ఒక చోట పని మానేస్తే మానేసిన కారణాలు, మన బాధలు చెప్పాలి కానీ అక్కడి విషయాలు చెడుగా చెప్పొద్దు. ఇంటర్వ్యూ కాగానే ప్లీజింగ్‌ స్మైల్‌తో థాంక్స్‌ చెప్పి లేవాలి. కొన్ని కంపెనీలు ఫేస్‌ టూ ఫేస్‌ కన్నా ముందు ఫోన్లో బ్రీఫ్‌ ఇంటర్వ్యూ చేస్తారు. అందుకే రెడీగా మీ స్కిల్స్‌, అనుభవం, జీతం అన్నీ ఎదురుగా రాసి పెట్టుకుంటే తడుముకోకుండా జవాబివ్వవచ్చు. ఇంట్లో గోల గోలగా అరవకుండా ఉంటే, స్థిమితంగా మాట్లాడగలరు.

పెన్ను, కాగితం దగ్గర పెట్టుకుని, ముఖ్య విషయాలు నోట్‌ చేసుకోవచ్చు. మొబైల్‌ అయితే ముందే చార్జి చేసి పెట్టుకోండి. కాల్‌ వెయిటింగ్‌ ఆప్షన్‌ని ఆపేయండి డిస్ట్రబెన్స్‌ కాకుండా ఎంతో నమ్రతగా, హాయిగా ఫ్రీగా మాట్లాడండి. ఫోన్‌ గదిలో పిల్లలు పెద్దలు టి.వి సౌండ్‌ వినబకుండా జాగ్రత్తపడండి. స్పష్టంగా మాట్లాడండి. అవతలి వారు మాట పూర్తయినాక మీరు మాట్లాడండి. స్వరం కాన్ఫిడెన్స్‌గా ఉండాలి. నోట్లో ఏదో నముల్తూ మాట్లాడరాదు. కొంతమంది లంచ్‌కి పిల్చి ఇంటర్వ్యూ చేస్తారు. నోట్లో ఏదైనా తింటూ మాట్లాడరాదు. టేబుల్‌ మేనర్స్‌ బాగా పాటించాలి. సాధారణంగా ఇంటర్వ్యూ అంటే మనల్ని మనం పరిచయం చేసుకోవటమే.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top