You Are Here: Home » చిన్నారి » కథలు » ఇంకేం చర్చిస్తారు?

ఇంకేం చర్చిస్తారు?

కొడవటిగంటి కుటుంబరావు దెయ్యాల పుస్తకం (తాత్విక వ్యాసాలు) నేను కూడా చదివాను. ఆ పుస్తకం గురించి రంగనాయకమ్మ (‘అక్షరం’ మార్చి 4) తక్కువే రాశారని చెప్పాలి. ఈ పుస్తకంలో ప్రతి పేజీలో దెయ్యాలు, భూతాలు, ప్రేతాత్మలు, జ్యోతిషాలు, దివ్యదృష్టులు, సోది చెప్పడాలు- ఇంకా ఇలాంటివే – అతీత శక్తులున్నాయని చెప్పడానికి కొన్ని వందల ఉదాహరణలు ఇచ్చారు. ‘రాబోయేది చెప్పడం ఎలా సాధ్యమవుతున్నదో శాస్తవ్రేత్తలకు తెలియదు. అందుచేత వారు వాటిని నమ్మ నిరాకరించారు. న్యాయంగా శాస్తవ్రేత్తలలో సత్యాన్వేషణాసక్తి ఉంటే- మనస్సుకు ఆపాదించే ఈ శక్తులను వారు అన్వేషించి ప్రయోగాల ద్వారా అవి లేవని రుజువు చేయవలసింది.’ (పే. 56, 57). శాస్తవ్రేత్తలు అన్వేషించి ప్రయోగాల ద్వారా అవి లేవని నిరూపించాలట. లేనిదానిని ఎవరైనా ఎలా నిరూపిస్తారు? లేనిదానికి నిరూపణ ఏమిటి? అది దెయ్యం కావచ్చు, కుర్చీ కావచ్చు- ఉంది అని ఎవరైనా అనుకుంటే అది నిరూపించుకోవలన బాధ్యత కూడా వారిదే. వాళ్ళు అలా నిరూపించకపోతే- అదే ‘లేదు’ అన్నదానికి రుజువు. దెయ్యాల్ని, ప్రేతాత్మల్ని నమ్మేవాళ్ళు లోకంలో చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళెవరూ ‘భౌతికవాదులం’ అని చెప్పుకోలేదు. కొ.కు. మాత్రం భౌతికవాదినని చెప్పుకుంటున్నారు. ‘ఈ పుస్తకం గురించి చర్చించాల్సింది చాలా ఉంది’ అంటున్నారు. ఇందులో ఇంక చర్చించడానికి ఏంఉంది? అంత స్పష్టంగా దెయ్యాలున్నాయని చెబుతుంటే ఇంకేం చర్చ! ఏనాడో నిర్ణయమెన విషయంగురించి చర్చ ఏం ఉంటుంది?
– వి. వెంకటరావు

Other News From

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top