You Are Here: Home » దైవత్వం » ఆసక్తి అసంతృప్తే

ఆసక్తి అసంతృప్తే

సాయిబాబా కపర్దేను తన వద్ద కూర్చొబెట్టుకొని మిగిలిన వారందరను పంపి వేసి కన్నతండ్రి వలె ఎంతో ప్రేమతో హితాన్ని బోధించేవారు. సాయి మాటలు, సంజ్ఞలు అర్థం కావ్ఞ అని కూడా కపర్దే తన దినచర్యలో వ్రాసుకున్నారు. సాయిబాబా శివానంద శాస్త్రికి ఏదో చెప్పి, కొన్ని సంజ్ఞలను చేశాడు. దురదృష్టవశాత్తు శాస్త్రి వాటి ప్రాముఖ్యతను అర్థం చేసుకోలేకపోయాడు.  అయితే సాయిబాబా వాక్కులలోని అర్థాలను కొందరు ఎప్ప టికీ అర్థం చేసుకోకపోవచ్చు. కొందరకు అవి అర్థం అవటానికి కొంతకాలం పట్టవచ్చు. సంవత్సరాలు కూడా పట్టవచ్చు. సరిగ్గా నూరేండ్ల క్రితం అంటే 2-2-1912లో సాయి సన్నిధిలో కపర్దే ఉన్నాడు. కపర్దే పేరుమోసిన అడ్వకేటు. సంపన్నుడు. సత్పు రుషుని సన్నిధిలోనున్నా, ఎప్పుడెప్పుడు తన ఊరైన అమరావతికి పోయి తిరిగి న్యాయవాదవృత్తిని చేపడ దామా అని అతనికి ఉండేది. ఆరోజు అతడిని తిరిగి అమరావతికి వచ్చి న్యాయవాద వృత్తిని  కొన సాగించమని ఉన్నది.
అంతక్రితం రోజున అంటే 1-2-1912న కాకాసాహెబ్‌ దీక్షిత్‌ అనే వ్యక్తికి సాయి తన కాళ్లు మర్దన చేస్తున్న శ్రీమతి కపర్దేకు రెండువందల రూపాయలు ఇవ్వమని చెప్పారు. అప్పుడు అక్కడే ఉన్న కపర్దేకు తాను వేరొకరి దయాధర్మం మీద బ్రతకవలసి వచ్చింది కదా అని చింతించాడు. ఎందుకంటే ప్రస్తుతం కపర్దే ఆర్థిక పరిస్థితి క్షీణించింది. సాయి తనను ఇతరుల దయాధర్మాల మీద బ్రతకటానికి అలవాటు చేస్తున్నారనిపించింది.
సాయి ఎప్పుడూ తన భక్తులను ఇతరుల దయా దాక్షిణ్యాల మీద బ్రతకమని కోరడు. అయితే సాయి అలా పలకటంలోని అంతరార్ధం కపర్దేకు చాలాకాలం తరువాత తెలిసింది. కపర్దే భార్య సాత్వికురాలు. అభిమానవతి. ఆమె కష్టపూరితమైన జీవితాన్ని, పేదరికాన్ని ఇష్టపడనట్లు కపర్దే గ్రహించాడు.
అయితే కాకాసాహెబ్‌ అటువంటి జీవితాన్ని అంగీకరించి హాయిగా ఉన్నాడు. పేదరికాన్ని, సహనాన్ని (200 రూపాయలకు సంకేతం) గ్రహించి సంతోషంగా జీవించమని సాయిబోధగా కపర్దే గ్రహించాడు. అంటే సాయి ఇతరుల ఎదుట చేయి చాచని లేమిని, సహనాన్ని పొందమని హితవ్ఞ ఇచ్చాడు.
Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top