You Are Here: Home » చిన్నారి » స్ఫూర్తి » ఆశయం

ఆశయం

80 వసంతాల వయస్సులోనూ… పేదలకు ఆదుకోవాలన్నదే ఆయన ధృడ సంకల్పం. ఆ ఆశయ దిశగానే అలుపెరగని కృషి సల్పుతున్నారు. బీసీ వెలమ సంఘాల బలోపేతానికి ఆయన కృషి వెలకట్టలేనిది. పేద విద్యార్థుల అభ్యున్నతికి, వృత్తి విద్యా శిక్షణాలయాల ఏర్పాటు, ప్రభుత్వ ఉద్యోగాలను ఆశించే విద్యార్థులకు ఉచిత శిక్షణ తరగతుల నిర్వహణ విషయంలో ఆయన కృషి శ్లాఘనీయం. ఆయనే బిసి సంఘాల అభ్యున్నతికి అలుపెరగకుండా పాటుపడుతున్న బత్తి రామారావు.

Unaaబిసీ వెలమ సంఘాల బలోపేతానికి విశేష సేవలంది స్తున్న వ్యక్తి బత్తి రామారావు. 80 సంవత్సరాల వయస్సులు ఆయన నిర్విరామ కృషి ప్రతి ఒక్కరూ అభినందించవలసిందే. ముదిమి వయస్సు లోనూ బీసీ వెలమ ప్రజల అభివృద్ధికి కోసం అనేక సేవా కార్యక్రమాలు అలుపెరగక చేస్తూనే ఉన్నారు. పశ్చిమగోదావరి జిల్లా గణపవరం ఆయన పుట్టిన ఊరు. ఆక్కడే హైస్కూలు చదువు పూర్తి చేసుకుని, ఇంటర్‌మీడియట్‌ గుడివాడలో, గ్రాడ్యుయేషన్‌ భీమవరంలోని ఇప్పటి డిఎన్‌ఆర్‌ కళాశాలలో పూర్తిచేశారు. తరువాత హైదరాబాద్‌లో స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌గా డైరక్టరేట్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌లో విధులు నిర్వహించారు.

ప్రభుత్వ ఉద్యోగిగా ఊపిరి సలపని పనులు ఉన్నా… కొప్పుల, పొల్నాటి వెలమ ప్రజల అభివృద్ధి సాధించడానికి తమ వంతు కృషి సల్పుతూనే ఉన్నారు. ఉద్యో గిగా ఆయన అందించిన సేవలతో… రాష్ర్ట మంత్రుల వద్ద వ్యక్తిగత కార్య దర్శిగా ఉంటూనే సంఘానికి సేవలందించారు. రాష్ర్ట మాజీ మంత్రులైన వాసి రెడ్డి కృష్ణమూర్తినాయుడు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, చిత్తరంజన్‌దాస్‌ వద్ద పనిచేస్తూ వారి మెప్పుపొందారు. 1968 నుండి కొప్పుల, పొల్నాటి వెలమ సంఘం కార్యదర్శిగా కొనసాగుతు న్నారు. 2010-12 సంవత్సరంలో సంఘ ఉపాధ్యక్షునిగా సేవలందించారు. మొదటి నుంచి ఆయన బీసీ వెలమ సంఘం కృషికి విశేష సేవలందిస్తూ అందరి అభిమానాలు చూరగొన్నారు.

విశాఖపట్నంలో సంఘ అభివృద్ధిలో భాగంగా మూడు అంతస్తుల సంఘ భవనాన్ని ప్రారంభించారు. పశ్చిమగోదావరి జిల్లాలో బీసీ వెలమ సంఘ బలోపేతానికి కృషి చేశారు. విజయవాడలో సంఘ భవన నిర్మాణానికి స్థలాన్ని ఇచ్చారు. ఏలూరు, విశాఖ జిల్లా చోడవరం, కోటపాడుల్లో ఐటిఐ కళాశాలల ప్రారంభానకి రామారావు కీలక పాత్ర పోషించారు. భీమవరంలో ఐటిఐ కళాశాలను స్థాపించి విద్యార్థులకు శిక్షణ ఇప్పించారు.2012లో సిద్దార్థ విద్యా పరిషత్‌ ఛారిటబుల్‌ ట్రస్టును ఏర్పాటు చేసి, బీసీ విద్యార్థులకు నగరంలోని వనస్థలిపురం మల్లిఖార్జునగర్‌లో 80లక్షల రూపాయల వ్యయంతో సంఘ భవనంతో పాటు విద్యార్థులకు హాస్టల్‌ నిర్మించి, పేద విద్యార్థులకు బాసటగా నిలిచారు రామారావు.

ఛారిటబుల్‌ట్రస్టు చైర్మన్‌గా ఉన్న రామారావు వచ్చే నెలలో జరిగే గ్రూప్‌4 పరీక్షకు హాజరయ్యే కొప్పుల, పోల్నాటి వెలమ బిసి విద్యార్థులకు ఉచిత శిక్షణ ఏర్పాటు చేశారు. ఈ పరీక్షకు సంబం ధించిన మెటీరియల్‌ను బిసి విద్యార్థులకు ఉచితంగా ఇవ్వడానికి ఏర్పాటు చేశారు. 1933 సంవ త్సరం జూలై 3వ తేదీన జన్మించిన రామారావును 80వ పుట్టిన రోజు సందర్భంగా.. జూలై 15న హైదరాబాద్‌ పబ్లిక్‌ గార్డెన్స్‌లోని ఎన్టీఆర్‌ ఆడి టోరియంలో కుటుంబసభ్యులు, అభిమానులు, బీసీ వెలమ సంఘాల నాయ కులు రామారావును ఘనంగా సత్కరించి ఆయన సేవలను కొనియాడారు. ఈ సన్మాన కార్యక్రమంలో గయోపాఖ్యానంలోని యుద్ధ సన్నివేశాన్ని శ్రీకృష్ణ పాత్రధారి జామి జనార్థన నాయుడు, అర్జున పాత్రధారి గుంట్రెడ్డి బలరామ స్వామి ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంది. బిసిల ఎదుగుదలకు, ఉన్నతికి మార్గదర్శిగా నిలిచిన బత్తి రామారావు సేవలకు హేట్సాఫ్‌ చెబుదాం.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top