You Are Here: Home » చిన్నారి » ఆర్మడిల్లోలను ఎలా విభజిస్తారు?

ఆర్మడిల్లోలను ఎలా విభజిస్తారు?

ఆర్మడిల్లో అనేది ఒక చిన్న క్షీరదం. స్పానిష్ భాషలో ఆర్మడిల్లో అంటే కవచం ఉన్న చిన్నజీవి అని అర్థం. వీటిల్లో దాదాపు 20 జాతులు ఉన్నాయి. కొన్నింటిని వాటి కవచాల మీద ఉండే చారలను బట్టి జాతులుగా విభజిస్తారు. వీటి సగటు పొడవు, తోకతో కలిపి 75 సెంటీ మీటర్లు. వీటిలో అతి పెద్దదైన జెయింట్ ఆర్మడిల్లో పొడవు 150 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. చిన్నదైన పింక్ ఫెయిరీ ఆర్మడిల్లో పొడవు 12 నుంచి 15 సెంటీమీటర్లు ఉంటుంది.

ఇవి దక్షిణ అమెరికా ఖండంలో నివసిస్తాయి. ఆర్మడిల్లోలలో తొమ్మిది చారల ఆర్మడిల్లోలు ఉనికిలో ఉన్నాయి. ఇవి అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఎక్కువగా కనిపిస్తాయి. వీటి శరీరం మీద ఉండే కవచం వీటికి రక్షణనిస్తుంది. కొన్ని ఆర్మడిల్లోలు శత్రువు నుంచి తప్పించుకోవటానికి తలను, కాళ్లను కవచం లోపలకి ముడిచిపెట్టుకుంటాయి. అప్పుడు అవి గుండ్రంగా గట్టి బంతిలా కనిపిస్తాయి. దాంతో శత్రుజంతువులు వాటిని ఏం చేయలేక వెనుదిరుగుతాయి.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top