You Are Here: Home»ఇతర»ఆరోగ్యానికి రక్షణ… నువ్వులు
ఆరోగ్యానికి రక్షణ… నువ్వులు
Posted by: SekharPosted date: November 30, 1999In: ఇతర|comment : 0
నువ్వులను ఆహారంలో భా గంగా తీసుకుంటే స్ర్తీలలో హా ర్మోన్ల సమస్యలు దరిచేరవు. పీ రియడ్స్కు వారంరోజుల ముం దుగా ఓ చెంచాడు నువ్వులను పొడిచేసి, బెల్లం లేదా ఇంగువ తోతీసుకోవాలి. ఇలా చేయడం వల్ల పీరియడ్స్ సక్రమంగా వచ్చేలా చేయడంతో పాటు, ఆ సమయంలో వచ్చే కడుపు, నడుము నొప్పుల నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది.
కండరాల బలహీనత కలిగిన, ఎదుగుదల సరిగా లేని పిల్లలకు ప్రతిరోజు ఉదయం పూట నానబెట్టిన ఓ చెంచాడు నువ్వులను తినిపిస్తే మంచి ఫలితం లభి స్తుంది. అలాగే ఎముకల బలహీనతతో బాధపడే వృద్ధులు, అస్టియోపోరాసిస్ లాంటి సమస్యలతో బాధపడేవారు ఉదయాన్నే నానబెట్టిన నువ్వులను పాలతో తీసుకోవాలి.
రక్త హీనతతో బాధపడే పిల్లలు, పెద్దలు ప్రతిరోటూ నానబెట్టిన ఓ టీ స్పూన్ నువ్వులను మూడు నెలపాటు క్రమం తప్పకుండా తిన్నట్లయితే రక్తం బాగా వృద్ధి చెందుతుంది. అలాగే మలబద్ధకం, మల విసర్జనలో సమస్యలతో బాధ పడేవారు ప్రతిరోజు ఓ టీ స్పూన్ నువ్వులను మెత్తగా దంచి దానికి పావు టీ స్పూను వెన్న కలిపి తింటే మంచి ఫలితం కనిపిస్తుంది.
ఇంకా అతి మూత్రవ్యాధితో ఇబ్బందిపడేవారు ఓ టీ స్పూను నువ్వులను పొడి చేసి, గోరువెచ్చటి నీటితో కలిపి తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. ఎము కల వ్యాధులు, కీళ్లనొప్పులు, చర్మ సంబంధిత సమస్యలు కూడా దూరమవుతాయి. నువ్వుల నూనెతో శరీరమంతటా మర్దనా చేస్తే కండరాల నొప్పులు క్రమం గా తగ్గుతాయి. సొరియాసిస్ లాంటి చర్మ వ్యాధులు నయమవుతాయి.