You Are Here: Home » ఇతర » ఆరోగ్యానికి గ్రీన్‌ టీ…

ఆరోగ్యానికి గ్రీన్‌ టీ…

సాధారణంగా ఉదయం నిదుర లేవగానే వెచ్చని కాఫీ లేదా టీతో మన దిన చర్య ప్రారంభిస్తాం. ఆ అలవాటుని కొంచెం మార్చేసి గ్రీన్‌ టీ తీసుకోవడం ప్రారంభిస్తే నూతనోత్సాహాన్ని పొందవచ్చు.మరి అంతలా ఉల్లాసాన్నిచ్చే గ్రీన్‌టీ ఉన్న గుణగణాల గురించి తెలుసుకుంటే ఔనా అనవచ్చు. అవే ఇవి.చదివేయండి మరి.

గ్రీన్‌టీని ప్రపంచానికి పరిచయం చేసింది చైనీయులే. వారు అనునిత్యం దీన్ని సేవించి ఆసియా వాసులకు కూడా అలవాటు చేశారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే భారతదేశంలో గ్రీన్‌టీ అభిమానుల సంఖ్య బంగారం ధర కన్నా స్పీడుగా పెరుగుతోంది. గ్రీన్‌టీలో ఖనిజాలు, మినలర్స్‌, యాంటియాక్సిడెంట్స్‌, ఫ్లావనాల్స్‌ పాలీఫెలాస్‌ వంటి పోషకాల సమృద్ధిగా లభిస్తాయి. గ్రీన్‌టీలోని ప్రతి పోషకానికి ప్రత్యేక గుణాలున్నాయి. వాటి వివరాల్లోకి వెళ్తే…
గ్రీన్‌ టీ గుణగణాలు..
టానిన్స్‌ (క్యాటేచిన్స్‌) :
గ్రీన్‌టీని సువాసనభరితంగా మార్చుతుంది. అంతేకాకుండా యాంటియాక్సిడెంట్స్‌, యాంటి బాక్టిరియల్‌ కారకంగా పని చేస్తుంది. శరీరంలోని మలినాలను, విషతుల్యాలను తొలగిస్తుంది.
Gaకెఫైన్‌ :
బాగా అలసటగా ఉన్న సమయంలో గరం గరంగా గ్రీన్‌టీని సేవిస్తే శారీరక అలసట ఇట్టే మాయమవు తుంది. ఆ గుణం కెఫైన్‌ నుంచి వచ్చిందే.
విటమిన్‌ బి, బి1, బి2 :
నయాసిన్‌, పాంథెనిక్‌ యాసిడ్‌లు ఉండటంతో గ్రీన్‌ టీ మరింత హెల్తీ డ్రింక్‌గా అవతరించింది. ప్రతీరోజు మనం తీసుకునే ఆహారం సులభంగా జీర్ణమవ్వడానికి దోహదం చేసే డైజస్టివ్‌ ఫ్లూడ్స్‌ను గ్రీన్‌ టీ అందిస్తుంది.
విటమిన్‌ సి :
తరచూ గ్రీన్‌టీని తీసుకుంటే శరీరానికి అవసరమైన మోతాదులో విటమిన్‌ ‘సి’ లభి స్తుంది. రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో గ్రీన్‌టీని ఎక్స్‌పర్ట్‌గా చెప్పుకోవచ్చు. మెలానిన్‌ పిగ్మెంటేషన్‌ నుంచి శరీరాన్ని కాపాడుతుంది.
విటమిన్‌ ‘ఈ’ (టోకోఫెరాల్‌ ) :
అద్దం ముందు నిలబడి ‘అయ్యో, చర్మంపై ముడతలు పడతున్నాయి’ అనుకోవడం న్నా అవకాశం ఉంటే రెగ్యులర్‌గా గ్రీన్‌టీని సేవించండి. కొన్ని రోజుల్లోనే అందమైన మార్పును మీరే గమనిస్తారు.ఆకుపచ్చగా ఉండే గ్రీన్‌టీ మన శరీరాన్ని సరికొత్త వెలుగునిచ్చి.. నూతనోత్సాహాన్నిస్తుంది. శారీరక శ్రమను తగ్గిస్తూ … వద్దనుకున్నా చేరి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కొవ్వును కరిగిస్తుంది. గ్లూకోమా అనే కంటి వ్యాధిని నివారిస్తుంది .అంటే అందంగా తయారు చేయడంతో పాటు ఈ అందమైన ప్రపంచాన్ని చూపించడంలో సహకరిస్తుందన్నమాట. అల్కహాల్‌, సిగరెట్‌ వల్ల వచ్చే హ్యాంగోవర్‌ను తగ్గించగలదు.
– వై.శ్వేతా గౌడ్‌, హైదరాబాద్‌

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top